iDreamPost
android-app
ios-app

TS Elections: ఓటు హక్కు వినియోగించుకున్న చిరంజీవి, NTR, అల్లు అర్జున్! క్యూలో నిల్చొని మరీ..

  • Published Nov 30, 2023 | 10:31 AMUpdated Nov 30, 2023 | 1:07 PM

తెలంగాణలో ఎన్నికల పోలింగ్ ప్రారంభం అయ్యింది. సామాన్యులే కాక సెలబ్రిటీలు సైతం తరలి వచ్చి.. క్యూలో నిల్చొని మరీ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆ వివరాలు..

తెలంగాణలో ఎన్నికల పోలింగ్ ప్రారంభం అయ్యింది. సామాన్యులే కాక సెలబ్రిటీలు సైతం తరలి వచ్చి.. క్యూలో నిల్చొని మరీ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆ వివరాలు..

  • Published Nov 30, 2023 | 10:31 AMUpdated Nov 30, 2023 | 1:07 PM
TS Elections: ఓటు హక్కు వినియోగించుకున్న చిరంజీవి, NTR, అల్లు అర్జున్! క్యూలో నిల్చొని మరీ..

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ మొదలైంది. రాష్ట్రంలోని 119 నియోజ‌క‌వ‌ర్గాల్లో నేడు పోలింగ్ జరుగుతోంది. గురువారం (నవంబర్‌ 30) ఉదయం7 గంటల నుంచే పోలింగ్ ప్రారంభం అయ్యింది. సామాన్యులతో పాటు పలువురు సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు గురువారం నాడు ఉదయమే పోలింగ్‌ కేంద్రాలకు చేరుకున్నారు. సామాన్యులతో పాటు పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు కూడా క్యూ లైన్‌లో నిలబడి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. టాలీవుడ్ సెలబ్రిటీలు మెగాస్టార్‌ చిరంజీవి, యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌, అల్లు అర్జున్‌, సుమంత్, సంగీత దర్శకుడు కీరవాణి తదితరులు తమ ఓటు ఉన్న పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు వేశారు

జూబ్లీహిల్స్‌ క్లబ్‌లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు చిరంజీవి. మెగాస్టార్‌ వెంట ఆయన సతీమణి సురేఖ, కూతురు శ్రీజ కూడా వచ్చి.. ఓటు వేశారు. అలానే యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ కూడా తన కుటుంబంతో కలిసి జూబ్లీహిల్స్‌లోని ఓబుల్‌రెడ్డి స్కూల్‌లో ఉన్న పోలింగ్‌ కేంద్రంలో ఓటు వేశారు. సతీమణి లక్ష్మీ ప్రణతి, తల్లి షాలినితో కలిసి ఎన్టీఆర్ క్యూ లైన్‌లో నిలబడి.. ఓటు వేశారు. అలానే అల్లు అర్జున్‌ బీఎస్‌ఎన్‌ఎల్‌ సెంటర్‌ పోలింగ్‌ బూత్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. మరో హీరో సుమంత్ కూడా జూబ్లీహిల్స్‌ క్లబ్‌లో ఓటు వేశారు.

ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలని ఎన్టీఆర్ కోరారు. ఇక అల్లు అర్జున్ ఓటు వేయడానికి వచ్చిన జూబ్లీహిల్స్‌లోని బీఎస్‌ఎన్‌ఎల్ పోలింగ్‌ బూత్‌లో ఈవీఎం కాసేపు మొరాయించింది. దాంతో ఆయన వెయిట్ చేసి…ఆ తర్వాత ఓటు వేసి వెళ్లారు. అలానే స్పోర్ట్స్ సెలబ్రిటీలు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. టీమిండియా మాజీ కెప్టెన్‌, కాంగ్రెస్‌ పార్టీ జూబ్లీహిల్స్‌ అభ్యర్థి అజారుద్దీన్, అతని కుమారుడు అసదుద్దీన్ ఇతర కుటుంబ సభ్యులు ఓటు హక్కును వినియోగించుకున్నారు.

అలానే టీమిండియా మాజీ క్రికెటర్‌ ప్రజ్ఞాన్‌ ఓజా, ప్రముఖ బాక్సర్‌ నిఖత్‌ జరీన్‌ ఓటింగ్‌లో పాల్గొన్నారు. అనంతరం తమ వేలిపై నున్న సిరా చుక్కను చూపిస్తూ ’’మేము మా ప్రాథమిక బాధ్యతను వినియోగించుకున్నాం. ఇప్పుడే ఓటింగ్‌ బాధ్యతను పూర్తి చేశాం. మరి మీరు‘‘ అంటూ ట్వీట్‌ చేశారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి