iDreamPost

ఓటరు కార్డు లేదా.. అయినా సరే ఓటేయొచ్చు.. ఎలా అంటే

  • Published Oct 23, 2023 | 6:16 PMUpdated Oct 23, 2023 | 6:16 PM

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం నూతన గైడ్‌లైన్స్‌ జారీ విడుదల చేసింది. ఓటరు కార్డు లేకపోయినా.. ఓటేయొచ్చు అంటోంది. మరి అది ఎలానో తెలియాలంటే ఇది చదవండి.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం నూతన గైడ్‌లైన్స్‌ జారీ విడుదల చేసింది. ఓటరు కార్డు లేకపోయినా.. ఓటేయొచ్చు అంటోంది. మరి అది ఎలానో తెలియాలంటే ఇది చదవండి.

  • Published Oct 23, 2023 | 6:16 PMUpdated Oct 23, 2023 | 6:16 PM
ఓటరు కార్డు లేదా.. అయినా సరే ఓటేయొచ్చు.. ఎలా అంటే

త్వరలోనే తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్‌ 30న పోలింగ్‌ జరగనుండగా.. డిసెంబర్‌ 3న ఫలితాలు వెల్లడించనున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో రాజకీయ వాతావరణం హీటెక్కింది. అభ్యర్థుల ప్రకటన, ఎన్నికల ప్రచారంతో పార్టీలన్ని బిజీగా ఉన్నాయి. ఇక ఎన్నికల సంఘం కూడా ఎలక్షన్‌ నిర్వహణకు సంబంధించి అన్ని రకాల చర్యలు తీసుకుంటుంది. ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చిన నాటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు, ఎన్నికల సిబ్బంది ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇక ఎన్నికల అధికారులు కూడా ఎలక్షన్‌ పనులతో బిజీగా ఉన్నారు. కొత్తగా ఓటు నమోదు చేసుకోవాలనుకునే వారి కోసం అక్టోబర్‌ 30 వరకు అవకాశం కల్పించారు. అంతేకాక ఓటర్‌ కార్డుకు సంబంధించి ఈసీ కీలక ప్రకటన చేసింది. ఆ వివరాలు..

త్వరలోనే రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం.. ఓటర్లకు కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. ఓటరు గుర్తింపు కార్డులోని వివరాల్లో ఏమైనా తేడాలున్నప్పటికి.. గుర్తింపు నిర్ధారణ అయితే అలాంటి వారికి ఓటు హక్కు కల్పించాలని సీఈసీ ఆదేశించింది. వేరే నియోజకవర్గానికి సంబంధించి ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ (ఈఆర్వో) జారీ చేసిన ఓటరు గుర్తింపు కార్డును ఆధారంగా చూపి, మరో నియోజకవర్గం పరిధిలోని పోలింగ్ కేంద్రంలోని ఓటును వినియోగించుకోవడానికి వచ్చే వారికి సైతం ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఇవ్వాలని ఆదేశించింది. అయితే, సదరు పోలింగ్ కేంద్రం ఓటర్ల జాబితాలో పేరుండాలని ఈసీ స్పష్టం చేసింది.

ఓటరు గుర్తింపు కార్డు లేకున్నా, ఒక వేళ ఉన్నా గుర్తింపు ధ్రువీకరణ సాధ్యం కాని పక్షంలో పోలింగ్ రోజు ప్రత్యామ్నాయ ఫోటో ధ్రువీకరణ పత్రాలను తీసుకొస్తే ఓటు వేసే అవకాశం కల్పించాలని పేర్కొంది. ఈ మేరకు ఆయా రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారులకు సీఈసీ లేఖ రాసింది.

ప్రత్యామ్నాయ పత్రాలివే..

  • ఓటరు గుర్తింపు కార్డు లేని సమయంలో ప్రత్యామ్నాయ ధ్రువీకరణ పత్రాలు చూపించి ఓటు హక్కు వినియోగించుకోవచ్చని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.
  • ప్రత్యామ్నయ ధ్రువీకరణ పత్రాలు అనగా.. ఆధార్ కార్డు, ఉపాధి హామీ జాబ్ కార్డు, బ్యాంకు/పోస్టల్ కార్యాలయం జారీ చేసిన ఫోటోతో కూడిన పాస్ బుక్‌ వంటి డాక్యుమెంట్లు చూపించి ఓటేయొచ్చు.
  • అలాగే, కేంద్ర కార్మిక శాఖ జారీ చేసిన ఆరోగ్య బీమా స్మార్ట్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు, భారతీయ పాస్ పోర్ట్, ఫోటోతో కూడిన పెన్షన్ డాక్యుమెంట్లను కూడా చూపించొచ్చు.
  • రిజిస్ట్రార్ జనరల్ అండ్ సెన్సెస్ కమిషనర్ ఇండియా (ఆర్జీఐ), నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ (ఎన్‌పీఆర్‌) కింద జారీ చేసిన స్మార్ట్ కార్డుతో కూడా ఓటు వేయవచ్చు.
  • కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు/పీఎస్‌యూలు/పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలు జారీ చేసిన ఉద్యోగ గుర్తింపు కార్డులు.
  • ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు జారీ చేసిన అధికారిక గుర్తింపు కార్డులు
  • కేంద్ర సామాజిక న్యాయ, సాధికారిత మంత్రిత్వ శాఖ జారీ చేసిన యూనిక్ డిజెబిలిటీ గుర్తింపు కార్డు (యూడీఐడీ) చూపించి ఓటేయొచ్చు

అయితే ఇది కేవలం ఓటరు గుర్తింపు కార్డులో ఫోటోలు తారుమారు కావడం, ఇతర లోపాలున్నప్పుడు.. ఓటరు గుర్తింపు ధ్రువీకరణ సాధ్యం కానప్పుడు మాత్రమే కేంద్ర ఎన్నికల సంఘం పైన జాబితాలో నిర్దేశించిన ఏదైనా ధ్రువీకరణ పత్రాన్ని ఆధారంగా చూపించి ఓటు హక్కు వినియోగించుకోవచ్చని ఈసీ స్పష్టం చేసింది. అయితే వీటిని ఓటరు గుర్తింపు కార్డుగా గుర్తించలేమని తెలిపింది.

అలానే ప్రవాస భారత ఓటర్లు అనగా ఎన్‌ఆర్‌ఐలు తమ పాస్ పోర్టును తప్పనిసరిగా చూపాల్సి ఉంటుందని సీఈసీ వెల్లడించింది. పోలింగ్‌కు కనీసం 5 రోజుల ముందు పోలింగ్ కేంద్రం పేరు, తేదీ, టైం, ఇతర వివరాలతో ఓటర్లకు పోలింగ్ ఇన్ఫర్మేషన్ స్లిప్పులను జారీ చేయాలని ఈసీ.. ఎన్నికల సిబ్బందికి ఆదేశాలు జారీ చేసింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి