iDreamPost

అమెరికా మీద దాడి జరిగిందా ? ట్రంప్ సంచలన వ్యాఖ్యలు …

అమెరికా మీద దాడి జరిగిందా ?  ట్రంప్ సంచలన వ్యాఖ్యలు …

కరోనా వైరస్ నేపధ్యంలో అగ్రరాజ్యం అమెరికా మీద దాడి జరిగిందని అధ్యక్షుడు డొనాల్డ్ జే ట్రంప్ ప్రకటించాడు. గురువారం అమెరికా మొత్తం మీద 2416 మంది చనిపోయారు. గతంలో అత్యధికంగా సుమారు 4356 మంది చనిపోయిన విషయం అందరికీ తెలిసిందే. ఒక్క రోజులు అంతమంది కరోనా వైరస్ దాడికి చనిపోయిన వారి సంఖ్యలో అమెరికాదే ప్రపంచ రికార్డని చెప్పాలి. నిజానికి చనిపోయిన వారి సంఖ్యను కూడా ప్రపంచరికార్డని చెప్పుకోవటం దురదృష్టమనే చెప్పుకోవాలి.

తర్వాత బాధితులు, మృతుల సంఖ్య కొద్ది రోజులు తగ్గినట్లే తగ్గి మళ్ళీ పెరుగుతోంది. గడచిన మూడు రోజులుగా వరుసగా అమెరికాలో 2 వేల చొప్పున చనిపోతున్నారు. ఈ నేపధ్యంలోనే గురువారం ట్రంప్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ అమెరికా మీద దాడి జరిగిందని ప్రకటించటం సంచలనంగా మారింది. చైనాతో కలిపి ప్రపంచంలో మరే దేశానికి లేనంతగా వ్యవస్ధలు పటిష్టంగా ఉన్నప్పటికీ ప్రస్తుతం అన్నీ వ్యవస్ధలు దేశంలో కుప్పకూలిపోయినట్లు ట్రంప్ ప్రకటించాడు.

కరోనా వైరస్ రూపంలో అమెరికా మీద దాడి జరిగిందని ట్రంప్ ప్రకటించాడే కానీ దాడి వెనుక ఎవరున్నారు అన్న విషయాన్ని మాత్రం చెప్పలేదు. నిజానికి మొదటి నుండి వైరస్ కు ప్రధాన కారణంగా చైనానే ట్రంప్ నిందిస్తున్న విషయం అందరూ చూస్తున్నదే. అమెరికా సంక్షోభానికి చైనానే కారణమంటూ ఆరోపించిన ట్రంప్ పనిలో పనిగా చైనాను వెనకేసుకొస్తోందన్న నెపంతో ప్రపంచ ఆరోగ్య సంస్ధ (డబ్ల్యూహెచ్ఓ)కు ఇస్తున్న నిధులను కూడా ట్రంప్ నిలిపేసిన విషయం సంచలనంగా మారింది.

చైనా వూహాన్ లోని వైరాలజీ ల్యాబ్ లోనే వైరస్ తయరైందని, అక్కడి నుండే ప్రపంచంపైకి ప్రయోగించారని ట్రంప్ పదే పదే ఆరోపిస్తున్నాడు. అలాగే ల్యాబరేటరీలపై తమ దేశం దర్యాప్తు చేయాలన్న ట్రంప్ డిమాండ్ ను చైనా తిప్పికొట్టేసిన విషయం కూడా అందరికీ తెలిసిందే. ట్రంప్ చేస్తున్న ఆరోపణలను చైరా కొట్టేస్తున్న నేపధ్యంలో మళ్ళీ అమెరికా మీద కరోనా వైరస్ రూపంలో దాడి జరిగిందనే కొత్త ఆరోపణలు ట్రంప్ మొదలుపెట్టటం ఎక్కడకు దారితీస్తుందో చూడాల్సిందే.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి