iDreamPost

వేగంగా వెళుతున్న రైలుపై పడిన కారు.. ముగ్గురు మృతి

వరుస రైలు ప్రమాద ఘటనలు కలవరపాటుకు గురి చేస్తున్నాయి. ఒడిశాలోని బాలాసోర్ రైలు ప్రమాదం ఈ దశాబ్దంలో అతి పెద్ద ఘటన. మొన్న ఏపీలోని విజయనగరంలో కూడా ట్రైన్ యాక్సిడెంట్ లో 10 మంది మరణించారు. ఇప్పుడు..

వరుస రైలు ప్రమాద ఘటనలు కలవరపాటుకు గురి చేస్తున్నాయి. ఒడిశాలోని బాలాసోర్ రైలు ప్రమాదం ఈ దశాబ్దంలో అతి పెద్ద ఘటన. మొన్న ఏపీలోని విజయనగరంలో కూడా ట్రైన్ యాక్సిడెంట్ లో 10 మంది మరణించారు. ఇప్పుడు..

వేగంగా వెళుతున్న రైలుపై పడిన కారు..  ముగ్గురు మృతి

రైలు ప్రమాద సంఘటనలు చూస్తుంటే గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ఒడిశాలోని బాలాసోర్‌లో జూన్ 2వ తారీఖున జరిగిన రైలు ప్రమాదం ఈ దశాబ్దంలో పెద్ద సంఘటన. చరిత్రలో మిగిలిపోయే ఆనవాళ్లను మిగిల్చింది. మూడు రైళ్లు ఢీ కొన్న ఘటనలో సుమారు 300 మంది మరణించారు. 800 మంది గాయపడ్డారు. ఏపీలోని విజయ నగరం జిల్లాలో జరిగిన ట్రైన్ యాక్సిడెంట్‌లో 14 మంది మృత్యువాత పడిన సంగతి విదితమే. ఇవే కాకుండా రైలు పట్టాలు తప్పాయని, భోగీల్లో మంటలు అలముకున్నాయని వచ్చిన వార్తలు కలవరపాటుకు గురి చేస్తున్నాయి. అయితే ఇప్పుడు కారు కారణంగా రైలు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు మరణించారు.

పట్టాలపై వేగంగా వెళుతున్న రైలుపై కారు పడటంతో ప్రమాదం జరిగి ముగ్గురు మృతి చెందారు. అదేంటీ రైలుపై కారు ఎలా పడిందన్న డౌట్ వస్తుంది. అసలు ఏమైందంటే.. మహారాష్ట్రలోని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా కార్యకర్త ధర్మేంద్ర గైక్వాడ్ తన బంధువులు మంగేశ్ జాదవ్, నితిన్ జాదవ్‌లతో కలిసి కారులో వెళుతున్నారు. కర్ణత్ వైపు వెళుతుండగా.. కారు అదుపు తప్పి.. కర్ణత్-పన్వేల్ రైల్వే స్టేషన్ల మధ్య ఉన్న బ్రిడ్జిపై నుండి కింద పడిపోయింది. అదే సమయంలో అటు నుండి వేగంగా గూడ్స్ రైలు వెళుతుండగా.. దాని మీద పడింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ముగ్గురు వ్యక్తులు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు.

అయితే కారు గూడ్స్ రైలు మీద పడటంతో రైలు పట్టాలు తప్పింది. కొన్ని బోగీలు పక్కకు జరిగాయి. గూడ్స్ రైలు కావడంతోనే పెను ప్రమాదం తప్పింది. ప్రయాణీకుల రైలు అయితే.. మరో దుర్ఘటన చవి చూసేది ఈ దేశం. ఈ ప్రమాదంపై సమాచారం అందిన వెంటనే రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కారులోని మృతదేహాలను బయటకు తీసి.. శవ పరీక్ష నిమిత్తం తరలించారు. దీంతో దెబ్బతిన్న గూడ్స్ రైలు ఘటనా స్థలిలోనే గంట సేపటికి పైగా నిలిచిపోయింది. ఈ రూట్లలో కూడా రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగినట్లు తెలుస్తోంది. అయితే ఈ ఘటనలో మృతి చెందిన రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా కార్యకర్త ధర్మేంద్ర గైక్వాడ్ కు కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే సంతాపం వ్యక్తం చేశారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి