iDreamPost

విషాదం: పిచ్చి కుక్క దాడిలో 12 ఏళ్ల బాలిక మృతి!

విషాదం: పిచ్చి కుక్క దాడిలో 12 ఏళ్ల బాలిక మృతి!

గత కొన్ని రోజుల రెండు తెలుగు రాష్ట్రాల్లో వీధి కుక్కలు రెచ్చిపోతున్నాయి. ఇటు చిన్న పిల్లల నుంచి అటు పెద్ద వాళ్ల వరకు అందరిపై దాడులు చేస్తూ తీవ్రంగా గాయపరుస్తున్నాయి. మరీ ముఖ్యంగా చిన్న పిల్లలపై దాడులు చేస్తూ చివరికి వారి ప్రాణాలను సైతం తీస్తున్నాయి. వీధి కుక్కల దాడిలో గతంలో ఎంతో మంది బాలబాలికలు చనిపోయారు. ఈ వరుస ఘటనలు మరువకముందే తాజాగా మరో బాలిక కుక్క కాటుకు బలై ప్రాణాలు కోల్పోయింది. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం ఆత్మకూరు గ్రామంలో సంగెం సాహిత్య (12) అనే బాలిక తల్లిదండ్రులతో పాటు నివాసం ఉంటుంది. ఇదిలా ఉంటే.. గత 15 రోజుల కిందట వీరి గ్రామంలో ఓ పిచ్చి కుక్క స్వైర విహారం చేసి 10 మంది గ్రామస్తులపై దాడి చేసింది. దీంతో అందరూ ఆస్పత్రి పాలయ్యారు. అయితే ఈ కుక్క దాడిలో బాలిక సాహిత్య తీవ్రంగా గాయపడింది. ఇక అప్పటి నుంచి ఆ బాలిక ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. ఇక పరిస్థితి విషమించడంతో సాహిత్య శనివారం ప్రాణాలు కోల్పోయింది.

కూతురు మరణించడంతో ఆమె తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు గుండెలు పగిలేలా ఏడ్చారు. ఈ ఘటనపై గ్రామస్తులు స్పందిస్తూ.. గ్రామంలో కుక్కల బెడద ఎక్కువగా ఉందని, వీటి నుంచి రక్షించేలా అధికారుల తక్షణమే చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు. కొందరు గ్రామ అధికారులు స్పందించి ఆ దిశగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు తెలుస్తుంది. సాహిత్య మరణంతో వారి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పిచ్చి కుక్క దాడిలో ప్రాణాలు కోల్పోయిన సాహిత్య మరణంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.

ఇది కూడా చదవండి: హైదరాబాద్ లో దారుణం.. మైనర్ బాలికపై తండ్రీకొడుకుల అత్యాచారం!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి