iDreamPost

పరువు కోసం ప్రాణాలను తీసుకున్న యువతి!

నేటికాలంలో చాలా మంది యువతలో సమస్యలపై పోరాడే గుణం అనేది లేకుండా పోయింది. తమకు ఎదురయ్యే ప్రతి చిన్న సమస్యకు తీవ్ర వేదనకు గురవుతున్నారు. అంతేకాక మనస్తాపంతో దారుణమైన నిర్ణయాలు తీసుకుని తల్లిదండ్రులకు కడుపుకోత మిగులుస్తున్నారు.

నేటికాలంలో చాలా మంది యువతలో సమస్యలపై పోరాడే గుణం అనేది లేకుండా పోయింది. తమకు ఎదురయ్యే ప్రతి చిన్న సమస్యకు తీవ్ర వేదనకు గురవుతున్నారు. అంతేకాక మనస్తాపంతో దారుణమైన నిర్ణయాలు తీసుకుని తల్లిదండ్రులకు కడుపుకోత మిగులుస్తున్నారు.

పరువు కోసం ప్రాణాలను తీసుకున్న యువతి!

ప్రస్తుత సమాజంలో మనిషిలో ధైర్యం, ఆత్మవిశ్వాసం, ఓర్పు అనేవి కనుమరుగవుతున్నాయి.  జీవితం హాయిగా సాగితే ఏమి ఉండదు.. కానీ ఒక్కసారిగా ఏవైనా సమస్యలు వస్తే.. చాలా ఆందోళనకు గురవుతుంటారు. ఇంకా చెప్పాలంటే చాలా మంది యువతకు జీవిత విలువ తెలియడం లేదు. అందుకే ఎంతో బంగారు భవిష్యత్ ఉన్న జీవితాన్ని చిన్న చిన్న విషయాలకు భయపడి ముగిస్తున్నారు. తాజాగా ఓ యువతి కూడా చదువులో ఫెయిల్ అయ్యింది.. అయితే ఆమె తాను జీవితమే ఫెయిల్ అయ్యాను అన్నట్లు భావించి.. దారుణ నిర్ణయం తీసుకుంది. చివరకు కన్నవారికి కడుపుకోత మిగిల్చింది.  ఈ ఘటన జగిత్యాల జిల్లాలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం మద్దులపల్లికి చెందిన వైష్ణవి(20)కుటుంబంతో కలిసి నివాసం ఉంటుంది. ఆమె తల్లిదండ్రులు స్థానికంగా పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఇక వైష్ణవిని ఆమె తల్లిదండ్రులు ఎంతో ప్రేమగా పెంచుకున్నారు. ఆమెకు ఏ కష్టం వచ్చిన వారు తట్టుకునే వాళ్లు కాదు. అలా వైష్ణవిని కంటికి రెప్పలా ఆ తల్లిదండ్రులు చూసుకున్నారు. వాళ్లు కష్టపడుతూ.. వైష్ణవిని చదివిస్తున్నారు. కరీంనగర్ పట్టణంలోని ఓ ప్రైవేటు కాలేజీలో  వైష్ణవి డిగ్రీ చదువుతోంది. ఇటీవలే జరిగిన రెండు, మూడో సెమిస్టర్ లో రెండు సబ్జెక్టుల్లో ఫెయిల్ అయ్యింది. దీంతో తాను రెండు సబ్జెక్టుల్లో ఫెయిల్ అయ్యాను అని వైష్ణవి తీవ్ర మనస్తాపానికి గురైంది. తనలో తానే తీవ్ర మనోదన చెందింది. చివరకు మనస్తాపంతో వైష్ణవి దారుణ నిర్ణయం తీసుకుంది. ఆదివారం రాత్రి ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో పురుగుల మందు తాగింది.

వైష్ణవిని గమనించిన కుటుంబసభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేశారు. అయితే ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో వైష్ణవి మరణించింది. దీంతో ఆమె కుటుంబ విషాదంలో మునిగిపోయింది. ఇలా కేవలం ఒక్క వైష్ణవే కాదు.. చాలా మంది యువత చదువు, ప్రేమ వంటి అనేక విషయాల్లో చావే పరిష్కారంగా భావిస్తున్నారు. చదువులో మార్కులు తగ్గాయని, ఫెయిల్ అయ్యామని తీవ్ర మనస్తాపానికి గురవుతుంటారు. ఇంకా దారుణం ఏమిటంటే..చదువుల విషయంలో తీవ్ర ఒత్తిడికి గురై.. ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. మనోస్థైర్యం, ఆత్మవిశ్వాసం అనేవి నేటి యువతలో కొరవడి.. ఇలాంటి దారుణ నిర్ణయాలు తీసుకుంటున్నారు. జీవితం అంటే చదువు ఒక్కటే అనే భావనలో ఎక్కువ మంది ఉన్నారు. అందుకే  చదువులో ఏమాత్రం కాస్త వెనుకబడిన.. జీవితమే లేదనే భావనలో ఉంటున్నారు. వైష్ణవి లాగా ఎంతో మంది యువత.. ఇలాంటి పిచ్చి నిర్ణయాలు తీసుకుని వారి తల్లిదండ్రులకు కడుపుకోత మిగులుస్తున్నారు. మరి.. ఇలాంటి ఆత్మహత్యల నివారణకు చర్యలు ఏమిటి?. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి