iDreamPost

లిక్కర్ లోడ్ వ్యాన్ బోల్తా.. రూ.50 లక్షల మద్యం రోడ్డు పాలు..!

Liquor Van Overturned on The Road: ప్రధాన రహదారిపై లిక్కర్ లోడ్ తో వెళ్తున్న ఓ వ్యాన్ హఠాత్తుగా మరో వాహనాన్ని తప్పించబోయి బోల్తా పడింది. విషయం తెలుసుకున్న స్థానికులు ఎగబడి అందిన కాడికి దోచుకు వెళ్లారు.

Liquor Van Overturned on The Road: ప్రధాన రహదారిపై లిక్కర్ లోడ్ తో వెళ్తున్న ఓ వ్యాన్ హఠాత్తుగా మరో వాహనాన్ని తప్పించబోయి బోల్తా పడింది. విషయం తెలుసుకున్న స్థానికులు ఎగబడి అందిన కాడికి దోచుకు వెళ్లారు.

లిక్కర్ లోడ్ వ్యాన్ బోల్తా.. రూ.50 లక్షల మద్యం రోడ్డు పాలు..!

ఇటీవల రోడ్డు ప్రమాదాల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నాయి. డ్రైవర్లు చేస్తున్న నిర్లక్ష్యం వల్ల ఎంతోమంది అమాయకుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. మద్యం సేవించి వాహనాలు నడపడం, అతి వేగం, నిర్లక్ష్యం, ఇతర కారణాల వల్ల నిత్యం ఎక్కడో అక్కడ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి.  ఎంతోమంది అనాథలుగా మిగలిపోతున్నారు.  రోడ్డు భద్రతా చర్యలు ఎంత కఠినం చేస్తున్నా.. డ్రంక్ అండ్ డ్రైవ్ కార్యక్రమాలు, భారీ చలాన్లు విధిస్తున్నా వాహనదారుల్లో మార్పు రావడం లేదని అధికారులు అంటున్నారు. తాజాగా లిక్కర్ లోడ్ తో వెళ్తున్న వ్యాన్ బోల్తా పడటంతో బాటిల్లు పగిలి లక్షల్లో నష్టం వాటిల్లింది. వివరాల్లోకి వెళితే..

జిగిత్యాల జిల్లా ప్రధాన రహదారి పై మద్యం వ్యాన్ బోల్తా పడటంతో సుమారు 50 లక్షల ఆస్తి నష్టం జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. మద్యం లోడ్ తో జగిత్యాల – కరీంనగర్ రహదారిపై వెళ్తున్న లిక్కర్ లోడ్ వ్యాన్ మాల్యాల మండలం వీఆర్‌కే ఇంజనీరింగ్ కాలేజ్ వద్ద వాహనాన్ని తప్పించబోయి అదుపు తప్పి బోల్తా పడింది. దీంతో వాహనంలో ఉన్న మద్యం సీసాలు రోడ్డుపై పడి ధ్వంసం అయ్యాయి. లిక్కర్ వ్యాన్ రోడ్డుపై బోల్తా పడిందన్న విషయం తెలియగానే స్థానికులు అక్కడికి ఎగబడ్డారు. రోడ్డు పై వెళ్లేవారు, చుట్టుపక్కల వాళ్లు కళ్లు కప్పి అందినకాడికి తీసుకువెళ్లారు. విషయం తెలుసుకున్న పోలీసు ఘటనా స్థలానికి చేరుకొని ట్రాఫిక్ క్లీయర్ చేసి అందరినీ తరిమికొట్టారు. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలు కావడంతో కరీంనగర్ ఆస్పత్రికి తరలించారు. కరీంనగర్ డిపో నుంచి జగిత్యాలలోని పలు వైన్ షాపులకు లిక్కర్ తరలిస్తుండగా ఈ ఘటన జరిగింది. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

సాధారణంగా ప్రధాన రహదారుల్లో ప్రమాద వశాత్తు లారీలు, వ్యాన్లు బోల్తా పడితే.. పొరపాటున అందులో మద్యం, చేపలు, కూల్ డ్రింక్ బాటిల్స్, ఇతర తినుబండారాలకు సంబంధించిన సరుకులు ఉంటే జనం తండోపతండాలుగా ఎగబడతారు. వాహనంలో ఉన్న డ్రైవర్, క్లీనర్ చచ్చారా..? బతికారా? అన్న విషయం కూడా ఆలోచించకుండా అందినకాడికి సంచుల్లో నింపుకొని ఉడాయిస్తుంటారు. సమాచారం అందుకొని పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకునే సరికి జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. దేశ వ్యాప్తంగా ఇలాంటి ఘటనలు తరుచూ ఎక్కడో అక్కడ జరుగుతూనే ఉంటాయి.. వాటికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతుంటాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి