iDreamPost

పెళ్లింట విషాదం.. DJ పాటలకు డ్యాన్స్ చేస్తూ బాలుడు మృతి

Wedding Tragedy: పెళ్లి బారాత్ లో డీజే సాంగ్స్ కి అందరూ డ్యాన్స్ చేస్తూ ఎంతో సంతోషంగా ఉన్న సమయంలో హఠాత్తుగా గుండెపోటుతో ఓ బాలుడు కుప్పకూలిపోయాడు.. ఎక్కడంటే..

Wedding Tragedy: పెళ్లి బారాత్ లో డీజే సాంగ్స్ కి అందరూ డ్యాన్స్ చేస్తూ ఎంతో సంతోషంగా ఉన్న సమయంలో హఠాత్తుగా గుండెపోటుతో ఓ బాలుడు కుప్పకూలిపోయాడు.. ఎక్కడంటే..

పెళ్లింట విషాదం.. DJ పాటలకు డ్యాన్స్ చేస్తూ బాలుడు మృతి

ఈ మధ్య కాలంలో దేశ వ్యాప్తంగా గుండెపోటు మరణాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ఒకప్పుడు పెద్ద వయసు వాళ్లకే హార్ట్ ఎటాక్ వస్తుందని అనేవారు. కానీ ఈ మధ్య చిన్న పిల్లలు, యుక్త వయసు వారికి హార్ట్ ఎటాక్ రావడంతో ఉన్నచోటే కుప్పకూలి పోతున్నారు. అప్పటి వరకు మనతో ఎంతో సంతోషంగా ఉన్నవాల్లు హఠాత్తుగా కంటికి కనిపించని లోకాలకు వెళ్తున్నారు. అధికంగా వ్యాయామం చేయడం, పని ఒత్తిడి, ఎక్కవగా డ్యాన్స్ చేయడం, అనారోగ్య కారణాల వల్ల గుండెపోటు వస్తుందని వైద్యులు చెబుతున్నారు. డీజే సౌండ్స్ కి డ్యాన్స్ చేస్తూ ఓ బాలుడు కుప్పకూలిపోయిన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది.   ఉత్తర్ ప్రదేశ్ లో ఈ విషాదం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..

ఉత్తర్ ప్రదేశ్ లో ఓ పెళ్లి ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. డ్యాన్స్ చేస్తూ 15 కుర్రాడు హఠాత్తుగా కన్నుమూశాడు. తన సోదరుడి వివాహ వేడుకలో ఏర్పాటు చేసిన డీజే పాటలకు సుధీర్ డ్యాన్స్ చేస్తుండగా హఠాత్తుగా కుప్పకూలిపోయాడు. అప్పటి వరకు తమతో ఎంతో హ్యాపీగా డ్యాన్స్ చేస్తున్న సుధీర్ హఠాత్తుగా ఉన్నచోటే కుప్పకూలిపోవడంతో కంగారు పడ్డ  కుటుంబ సభ్యులు వెంటనే దగ్గరలోని హాస్పిటల్ కి తీసుకువెళ్లగా.. అప్పటికే కన్నుమూసినట్లు వైద్యులు నిర్దారించారు. డీజే సౌండ్స్ దగ్గరగా వినడం వల్ల హార్ట్ ఎటాక్ వచ్చి ఉంటుందని ప్రాథమిక అంచనా వేస్తునున్నారు. పెళ్లి సంబరాల్లో మునిగిపోయిన ఆ ఇంట ఈ ఘటన చోటు చేసుకోవడంతో ఒక్కసారిగా అందరూ విషాదంలో మునిగిపోయారు.

ఇటీవల పెళ్లి బారాత్ లో తప్పనిసరిగా డీజే సౌండ్ పెడుతున్నారు. డీజే పాటలకు చిన్నా పెద్ద.. ఆడ, మగ అనే తేడా లేకుండా డ్యాన్స్ లు చేస్తూ సంబరాలు జరుపుకుంటున్నారు. కొంతమంది పరిమితికి మించి డీజే సౌండ్స్ పెంచడంతో చిన్న పిల్లలు, వృద్దులు, అనారోగ్యంతో బాధపడేవారు తట్టుకోలేక హార్ట్ ఎటాక్ రావడంతో చనిపోతున్నారని వైద్యులు చెబుతున్నారు. ఇలాంటి ఘటనలు మళ్లీ మళ్లీ పునరావృతం అవుతున్నా.. పెళ్లి సంబరాల్లో డీజే పాటలు పెడుతూనే ఉన్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని డీజే కారణంగానే హార్ట్ ఎటాక్ వచ్చి ఉండవొచ్చని అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. అయితే మృతి చెందిన బాలుడు స్వయానా పెళ్లి కొడుకు సోదరుడు కావడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి