iDreamPost

OTTలో ఉన్న టాప్-5 కొరియన్ సినిమాలు ఇవే! ఒక్కో సినిమాకి ఉలిక్కి పడతారు!

  • Published Apr 05, 2024 | 5:44 PMUpdated Apr 05, 2024 | 5:44 PM

ఈ మధ్య కాలంలో ఓటీటీలకు ప్రేక్షకుల ఆదరణ పెరిగిపోతున్న మాట నిజమే. అయితే, ముఖ్యంగా అందరు ఆసక్తిగా చూస్తున్నది మాత్రం కొరియన్ సిరీస్ అనే చెప్పి తీరాలి. మరి ఈ క్రమంలో టాప్ 5లో ఉన్న కొరియన్ సిరీస్ ఏంటో చూసేద్దాం.

ఈ మధ్య కాలంలో ఓటీటీలకు ప్రేక్షకుల ఆదరణ పెరిగిపోతున్న మాట నిజమే. అయితే, ముఖ్యంగా అందరు ఆసక్తిగా చూస్తున్నది మాత్రం కొరియన్ సిరీస్ అనే చెప్పి తీరాలి. మరి ఈ క్రమంలో టాప్ 5లో ఉన్న కొరియన్ సిరీస్ ఏంటో చూసేద్దాం.

  • Published Apr 05, 2024 | 5:44 PMUpdated Apr 05, 2024 | 5:44 PM
OTTలో ఉన్న టాప్-5 కొరియన్ సినిమాలు ఇవే! ఒక్కో సినిమాకి ఉలిక్కి పడతారు!

ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ ఎన్నో సినిమాలు, సిరీస్ లు రిలీజ్ అవుతుంటాయి. ఈ మధ్య కాలంలో అందరూ ఎక్కువగా ఓటీటీ లకు పరిమితం అవుతున్నారు. ఎప్పుడు ఏ కొత్త సినిమా రిలీజ్ అవుతుందా అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే, ఇప్పుడు మలయాళీ సినిమాలకు ప్రజలు ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. అలానే తెలుగు యువతను అట్ట్రాక్ట్ చేస్తున్న మరొక ట్రెండ్ కొరియన్ డ్రామాస్.. చిన్న పిల్లల దగ్గర నుంచి యువత వరకు అందరూ ఈ కొరియన్ డ్రామాస్ కు బాగా అట్ట్రాక్ట్ అవుతున్నారు. ఆ ఇండస్ట్రీ నుంచి కూడా ఎన్నో అద్భుతమైన సినిమాలు.. వస్తూనే ఉన్నాయి. మరి, వీటిలో ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్.. ప్రైమ్ వీడియో, నెట్‌ఫ్లిక్స్ లాంటి ఓటీటీ లలో ట్రెండింగ్ లో ఉన్న కొరియన్ డ్రామాస్ ఏంటో చూసేద్దాం.

అమెజాన్ ప్రైమ్ వీడియో:

1) పారాసైట్:
పారసైట్ అనే ఈ సినిమా 2018లో వచ్చి.. ఆస్కార్ విన్నింగ్ సినిమాగా రికార్డు సృష్టించింది. ఒక రకంగా కొరియన్ సినిమాల సత్తా ఏంటి అనేది ప్రపంచానికి చాటి చెప్పింది ఈ సినిమా. ఇండియన్ మూవీ లవర్స్ అంతా కూడా.. ఈ సినిమా వచ్చిన తర్వాతనే కొరియన్ సినిమాలను చూడడం మొదలుపెట్టారు. ముఖ్యంగా ఈ సినిమాలో ధనవంతులు, పేదల మధ్య ఉన్న గ్యాప్ ఎలాంటిదో కళ్ళకు కట్టినట్లు చూపించారు. ఒక కుటుంబం వారి పేదరికాన్ని అధిగమించడం కోసం ఒక డబ్బున్న ఇంట్లో పనివాళ్లుగా చేరుతారు. అక్కడ వాళ్ళు ఎలాంటి సవాళ్ళను ఎదుర్కొన్నారనేదే ఈ సినిమా కథ.

2) ది గ్యాంగ్‌స్టర్, ది కాప్, ది డెవిల్:
క్రైమ్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్స్ అంటే ఇష్టపడని వారు ఉండరు. అందులోను కొరియన్ డ్రామాస్ లో చూపించే క్రైమ్ థ్రిల్లర్స్ చాలా డిఫ్ఫరెంట్ గా ఉంటాయి. ఈ సినిమాలో ఒక సీరియల్ కిల్లర్ ను పట్టుకోవడం కోసం.. ఒక పోలీస్ ఆఫీసర్ ఒక గ్యాంగ్ స్టార్ తో కలిసి.. కొన్ని వింత ప్రయోగాలు చేస్తుంటాడు. ఈ క్రమంలో వారు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారన్నదే కథ.

నెట్ ఫ్లిక్స్:

3) మెమొరీస్ ఆఫ్ మర్డర్ :
ఈ సినిమా ఒక రియల్ స్టోరీ ని బేస్ చేసుకుని చిత్రీకరించారు. 1980’స్ లో కొరియాలో ఒక చిన్న టౌన్ లో జరిగిన వరుస హత్యలు, దాని గురించి జరిగిన విచారణలు వీటి అన్నిటిని ఆధారంగా తీసుకుని ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ సినిమా పూర్తిగా ఒక క్రైమ్ థ్రిల్లర్ మూవీ.

4) సేవ్ ద గ్రీన్ ప్లానెట్:
భూమిపై ఏలియన్స్ తిరుగుతున్నారని ఇప్పటికి కొంతమంది నమ్ముతూ ఉంటారు. అలానే మన భూమిపై ఆండ్రోమెడా నుంచి వచ్చిన ఏలియన్స్ ఉన్నారని, వాళ్లు మన భూమిని నాశనం చేయడానికి వచ్చారని ఓ వ్యక్తి బాగా నమ్ముతూ ఉంటాడు. ఆ వ్యక్తి చుట్టూ తిరిగే ఒక కామెడీ మూవీ ఇది. పైగా ఆ ఏలియన్స్ కు ఓ ఫార్మా కంపెనీ యజమానే లీడర్ అని నమ్మి అతడిని కిడ్నాప్ చేస్తాడు. ఈ క్రమంలో అతని ఎం చేసాడు చివరకు ఏలియన్స్ ఉన్న మాట నిజామా కదా అని తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాల్సిందే.

5) ఓల్డ్‌బాయ్ :
ఈ సినిమా 2003లో వచ్చింది. ఈ సినిమా వచ్చి చాలా కాలమే అయినా కూడా.. ఈ సినిమాతో కొరియన్ సినిమా దశ మారిపోయిందని చెబుతూ ఉంటారు. ఈ సినిమా కథ విషయానికొస్తే.. ఒక వ్యాపారవేత్తను గుర్తు తెలియని వ్యక్తులు.. కిడ్నప్ చేసి దాదాపు 15 ఏళ్ళ పాటు చిత్రహింసలు పెడతారు. అసలు తనను ఎవరు బంధించారో తెలుసుకొని, వాళ్లపై రివెంజ్ తీర్చుకోవాలని ఆ వ్యక్తి చూస్తాడు. కానీ దీనికోసం అతని దగ్గర 5 రోజుల సమయమే ఉంటుంది. ఈ సమయంలో తానూ అనుకున్నది చేయగలుగుతాడా లేదా తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాల్సిందే.

ఇప్పటివరకు ఈ సినిమాలను ఎవరైనా మిస్ అయ్యి ఉంటే కనుక వెంటనే చూడాల్సిందే. మరి, ఈ సినిమాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి