iDreamPost

Valimai : అజిత్ సినిమాకు ఎన్ని చిక్కులో

Valimai : అజిత్ సినిమాకు ఎన్ని చిక్కులో

తమిళనాడు మొత్తం అజిత్ కొత్త సినిమా వలిమై ఫీవర్ తో ఊగిపోతోంది. ఆన్ లైన్ లో అడ్వాన్ బుకింగ్ టికెట్లు పెట్టడం ఆలస్యం హాట్ కేక్స్ లా నిమిషాల్లో అమ్ముడుపోతున్నాయి. ఓపెనింగ్స్ విషయంలో సరికొత్త రికార్డులు ఖాయమని ట్రేడ్ చాలా నమ్మకంగా ఉంది. 23 అర్ధరాత్రి నుంచే బెనిఫిట్ షోలు వేసేలా థియేటర్ల యాజమాన్యాలు ఏర్పాట్లు చేసుకున్నాయి. మొదటి వారంలోనే వంద కోట్ల గ్రాస్ రావడం పక్కా అని అక్కడి విశ్లేషకుల అంచనా. ఖాకీ ఫేమ్ వినోత్ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ లో మన ఆరెక్స్ 100 కార్తికేయ విలన్ గా నటించడం ఇక్కడా కొంత హైప్ రేపుతోంది. హైదరాబాద్ ప్రమోషన్లన్నీ తనే చూసుకుంటున్నాడు.

అక్కడ సీన్ అలా ఉంటే తెలుగు రాష్ట్రాల్లో మాత్రం పరిస్థితి దానికి పూర్తి భిన్నంగా ఉంది. నగరాల్లో సైతం బుకింగ్ ఏమంత ఫాస్ట్ గా జరగడం లేదు. స్టైలిష్ బైక్ రేసింగ్ కాన్సెప్ట్ కావడంతో మాస్ అంత సులభంగా టర్న్ కావడం లేదు. పైగా అజిత్ కు ఇక్కడ ఎప్పటి నుంచో మార్కెట్ పెద్దగా లేదు. టాక్ చాలా బాగుందని వస్తే తప్ప కలెక్షన్లు ఆశించలేం. ఈ నేపధ్యంలో వలిమై ఎక్స్ పెక్ట్ చేసినంత బజ్ తెచ్చుకోలేకపోయింది. ఇది ఒక కోణం మాత్రమే. అసలైన అడ్డంకి భీమ్లా నాయక్. కేవలం ఒక్క రోజు గ్యాప్ తో వస్తున్న ఈ పవర్ స్టార్ మూవీ మీద ఎలాంటి అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సోషల్ మీడియా మొత్తం ఇదే చర్చ.

వీటికి తోడు బుక్ మై షో లాంటి యాప్స్ మీద నైజామ్ డిస్ట్రిబ్యూటర్లు యుద్ధం ప్రకటించడం మరో దెబ్బ. ఇప్పటికీ ఇంకా వాటిలో బుకింగ్స్ అందుబాటులోకి తేలేదు. అసలు వివాదం ఈ రెండు మూడు రోజుల్లో కొలిక్కి వస్తుందో లేదో కూడా తెలియదు. ఇది వలిమైని ఇబ్బంది పెట్టే పరిణామమే. ట్రేడ్ నుంచి అందుతున్న సమాచారం మేరకు దీని తెలుగు వెర్షన్ కు కేవలం రెండున్నర కోట్ల బిజినెస్ మాత్రమే చేశారు. బ్రేక్ ఈవెన్ కావాలంటే మూడు దాకా వస్తే సరిపోతుంది. ఒకవేళ భీమ్లా నాయక్ కు బ్లాక్ బస్టర్ టాక్ వస్తే మరింత ఇబ్బంది. ఇది చాలదన్నట్టు మల్టీ ప్లెక్స్ ఆడియన్స్ ని టార్గెట్ చేసిన గంగూబాయ్ కటియావాడి ఉండనే ఉంది. చూడాలి మరి ఏం జరగనుందో

Also Read : Bheemla Nayak : ఈ వారమంతా పవర్ స్టార్ సందడే

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి