iDreamPost

Tollywood Hits Of 2021 : బాక్సాఫీస్ ను ఆదుకున్న తెలుగు సినిమాలు

Tollywood Hits Of 2021 : బాక్సాఫీస్ ను ఆదుకున్న తెలుగు సినిమాలు

కరోనా వల్ల థియేటర్లు మళ్ళీ కొన్ని నెలలు మూతబడాల్సి వచ్చినా సరే తెలుగు ప్రేక్షకులు మాత్రం తమ సినిమా ప్రేమని అభిమానాన్ని కలెక్షన్ల రూపంలో ఋజువు చేస్తూనే వచ్చారు.దేశంలో ఎక్కడా లేని విధంగా అధిక సంఖ్యలో సినిమాలు చూసింది మనవాళ్లే. ఇండియా బుక్ మై షో గణాంకాల ఆధారంగా చేసిన ఒక డేటా విశ్లేషణలో టాప్ మూవీ బుకింగ్స్ పరంగా హైదరాబాద్ మొదటి స్థానంలో ఉందంటేనే అర్థం చేసుకోవచ్చు సినిమా అనేది తెలుగు వాళ్ళ జీవితంలో ఎంత నిత్యకృత్యంగా మారిందో. ఇంకో మూడు రోజుల్లో కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతున్న తరుణంలో 2021 లో వచ్చిన టాప్ బ్లాక్ బస్టర్స్ మీద ఒక లుక్ వేద్దాం

1. క్రాక్

యాభై శాతం ఆక్యుపెన్సీతో రిస్క్ అయినా సరే సంక్రాంతిని నమ్ముకుని నచ్చిన రవితేజ క్రాక్ ప్రేక్షకుల అంచనాలను పూర్తిగా అందుకుని అద్భుత విజయం సాధించింది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందిన ఈ పోలీస్ డ్రామాలో అన్ని అంశాలు పర్ఫెక్ట్ గా బాలన్స్ అవ్వడంతో పండగ విన్నర్ గా నిలిచి వసూళ్లలోనూ సంచలనం రేపింది. ఫ్లాపులతో సతమతమవుతున్న మాస్ మహారాజాకు మార్కెట్ ని తిరిగి తెచ్చి ఇచ్చి నిర్మాణంలో ఉన్న వాటి డిమాండ్ ని పెంచేసింది

2. అఖండ

ఇంచుమిందు రవితేజ లాంటి సిచువేషన్ లోనే ఉన్న బాలకృష్ణ మాస్ సత్తా ఏంటో చాటిన చిత్రం అఖండ. మొదటి రోజు టాక్ ఎలా ఉన్నప్పటికీ బిసి సెంటర్స్ ఆడియన్స్ దీన్ని బ్రహ్మాండంగా ఆదరించారు. సింహా లెజెండ్ తర్వాత హ్యాట్రిక్ ఇస్తాడన్న నమ్మకాన్ని దర్శకుడు బోయపాటి శీను పూర్తిగా నిలబెట్టుకున్నాడు. లోటుపాట్లు ఎన్ని ఉన్నా అఘోరాగా బాలయ్య నటన, తమన్ నేపధ్య సంగీతం, డైలాగులు, హిందుత్వ కాన్సెప్ట్ అఖండను కంప్లీట్ బ్లాక్ బస్టర్ గా నిలిపాయి. కెరీర్ హయ్యెస్ట్ ఇచ్చాయి

3. ఉప్పెన

లాక్ డౌన్ భయం వల్ల ఓటిటికి ఇస్తారేమో అనే అనుమానాలకు తెరదించుతూ థియేటర్ల కోసం ఎదురు చూసి కొత్త హీరో హీరోయిన్లతో మైత్రి సంస్థ చేసిన సాహసం ఆశించిన దానికన్నా గొప్ప ఫలితాన్ని ఇచ్చింది ఉప్పెన. వైష్ణవ్ తేజ్ కి పర్ఫెక్ట్ డెబ్యూగా ఉపయోగపడగా కృతి శెట్టిని టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మార్చేసింది. మొదటి చిత్రంతోనే వంద కోట్ల మార్కు అందుకున్న దర్శకుడిగా బుచ్చిబాబు పేరు మారుమ్రోగిపోయింది. ఇదిచ్చిన కాన్ఫిడెన్స్ తోనే జూనియర్ ఎన్టీఆర్ కోసం స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నాడు

4. జాతిరత్నాలు

కేవలం 12 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ పెట్టుకుని బిజినెస్ జరుపుకున్న ఒక సినిమా 30 కోట్లను దాటడం ఎవరూ ఊహించనిది. నవీన్ పోలిశెట్టి-ప్రియదర్శి – రాహుల్ రామకృష్ణల కామెడీకి జనం పగలబడి నవ్వుకున్నారు. దర్శకుడు అనుదీప్ ఓవర్ నైట్ లో స్టార్ డైరెక్టర్ అయిపోయాడు. హైదరాబాద్ లాంటి నగరాల్లో వారాల తరబడి హౌస్ ఫుల్ బోర్డులతో జాతిరత్నాలు చేసిన సందడి అంతా ఇంతా కాదు. మ్యూజికల్ గానూ ఈ మూవీ ఛార్ట్ బస్టర్ అయ్యింది. మనసారా నవ్వించి కోట్ల రూపాయల వసూళ్లను కొల్లగొట్టింది

5. వకీల్ సాబ్

జనసేన కోసం అజ్ఞాతవాసి తర్వాత మూడేళ్ళ గ్యాప్ తీసుకుని పవన్ కళ్యాణ్ చేసిన పింక్ రీమేక్ వకీల్ సాబ్ ఓపెనింగ్స్ లో సునామి లాగా విరుచుకుపడింది. ఆల్రెడీ చూసేసిన కథే అయినప్పటికీ పవర్ స్టార్ ఎనర్జీకి అభిమానులు ఫిదా అయ్యారు. 80 కోట్లకు పైగా కలెక్షన్లతో నిర్మాతను డిస్ట్రిబ్యూటర్లను గట్టున పడేసింది. ఇండుస్ట్రీ హిట్ క్యాటగిరీలోకి వేయలేం కానీ పవన్ కం బ్యాక్ కి పర్ఫెక్ట్ ప్లాట్ ఫార్మ్ గా ఇది ఉపయోగపడింది. ముఖ్యంగా లాయర్ గా పవన్ పెర్ఫార్మన్స్ మాస్ తో సైతం విజిల్స్ వేయించింది.

6. లవ్ స్టోరీ

చాలా ఆటుపోట్లు సుదీర్ఘ నిరీక్షణ తర్వాత వచ్చిన లవ్ స్టోరీ చైతుకి కెరీర్ బెస్ట్ గా నిలిచింది. విడుదలకు ముందే అంచనాలు పెంచిన సారంగదరియా పాట, సాయి పల్లవి నటన, శేఖర్ కమ్ముల డైరెక్షన్ సెన్సిటివ్ పాయింట్ ని సైతం మెప్పించేలా చేశాయి. టీవీలో వచ్చినప్పుడు కూడా టిఆర్పి రేటింగ్స్ అత్యధికంగా రావడం విశేషం. టాక్, రివ్యూల సంగతి ఎలా ఉన్నా ఫ్యామిలీ ఆడియన్స్ ని రప్పించేలా చేయడంలో లవ్ స్టోరీ సక్సెస్ అయిన మాట వాస్తవం. అందుకే ముప్పై కోట్లకు పైగా వసూళ్లు వచ్చాయి

7. పుష్ప

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప ది రైజ్ పార్ట్ 1 కలెక్షన్ల ఫిగర్స్ చూస్తే ఈజీగా బ్లాక్ బస్టర్ స్టేటస్ అందుకున్నట్టే కనిపిస్తోంది. ఇంకా ఫైనల్ రన్ పూర్తి కాలేదు కాబట్టి అప్పుడే కంక్లూజన్ కు రాలేం కానీ టాక్ తో నిమిత్తం లేకుండా ముఖ్యంగా బయటి రాష్ట్రాల్లో పుష్ప దుమ్మురేపింది మాత్రం నిజం. వసూళ్లను హైప్ చేసి చూపిస్తున్నారన్న కామెంట్స్ లో ఎంతవరకు నిజముందో చెప్పలేం కానీ అల వైకుంఠపురములో తర్వాత ఫ్లాప్ రాకూడదన్న బన్నీ లక్ష్యం మాత్రం సంపూర్ణంగా నెరవేరింది.

సూపర్ హిట్లు ఎన్నో

బడ్జెట్ తో సంబంధం లేకుండా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్లుగా నిలిచి మంచివిజయం అందుకున్నవి ఉన్నాయి. ఎస్ఆర్ కళ్యాణ మండపం, రాజరాజ చోర, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, జాంబీ రెడ్డి, నాంది, పెళ్లి సందD, మాస్టర్, శ్యామ్ సింగ్ రాయ్ మంచి రన్ ని సంపాదించుకున్నాయి ఇవన్నీ కమర్షియల్ గా ప్రొడ్యూసర్లకు డిస్ట్రిబ్యూటర్లలు లాభాలు ఇచ్చినవి. మొత్తంగా చూసుకుంటే ఇతర బాషలతో పోలిస్తే టాలీవుడ్ అన్ని కోణాల్లో చాలా మెరుగైన స్థితిలో నిలిచిందన్నది వాస్తవం

Also Read : RRR Release : విడుదలకు 9 రోజులు – వెంటాడుతున్న చిక్కుముడులు

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి