iDreamPost

బావ కోసం మరదలు త్యాగం.. ఇలాంటి ప్రేమ ఇప్పట్లో సాధ్యమా?

బంధాల్లో బావ మరదళ్లకు ఉండే రిలేషన్ వేరు. ఆ సరదాలు, చిలిపి పనులు.. వారికి మాత్రమే సాధ్యం. ఈ బావ మరదళ్లకు కూడా ఒకరంటే ఒకరికి చాలా ఇష్టం. కానీ

బంధాల్లో బావ మరదళ్లకు ఉండే రిలేషన్ వేరు. ఆ సరదాలు, చిలిపి పనులు.. వారికి మాత్రమే సాధ్యం. ఈ బావ మరదళ్లకు కూడా ఒకరంటే ఒకరికి చాలా ఇష్టం. కానీ

బావ కోసం మరదలు త్యాగం.. ఇలాంటి ప్రేమ ఇప్పట్లో సాధ్యమా?

ప్రేమ త్యాగాన్ని కోరుకోదు. అలాగే తన కోసం బలి అవ్వమని చెప్పదు. కానీ ప్రియుడి కోసం ప్రియురాలు.. ప్రేయసి కోసం ప్రేమికుడు ప్రాణాలు తీసుకునే లవ్ స్టోరీలు ఈ కాలంలో చోటుచేసుకోవడం చాలా అరుదు. అంతర్ సౌందర్యం కన్నా.. బాహ్య సౌందర్యాన్ని చూసే ప్రేమలు పెరిగిపోయాయి నేటి కాలంలో ఇటువంటి ప్రేమ కథలు ఇంకా జరుగుతుండటం ఆశ్చర్యం అనిపించకమానదు. ప్రస్తుతం ఇద్దరి లవర్స్ మధ్య ప్రేమ.. పొద్దున్న మొదలై.. సాయంత్రం ఎండ్ పడిపోతుంది. డబ్బు, అవసరాల కోసమే ప్రేమ అన్నట్లుగా తయారయ్యింది. లవ్ పేరుతో షికార్లు చేయడం.. ఖాళీ సినిమా థియేటర్లలో కార్నర్ సీట్లలో కూర్చొవడం, ఒక కూల్ డ్రింక్‌లో రెండు స్ట్రాలు వేసుకుని తాగడంగా మారిపోయింది. కానీ తమది అలాంటి ప్రేమ కాదని నిరూపించింది జంట.

కానీ ఇది చెప్పే క్రమంలో ప్రేమికులిద్దరూ ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. బాసర ఐఐఐటీలో విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటనలో ప్రేమ ప్రధాన పాత్ర పోషించింది. ఆమె సూసైడ్ నోట్ లో ఈ విషయాలు బయటకు వచ్చాయి. ఆమె రాసుకున్న చివరి వీలునామా కన్నీళ్లు తెప్పిస్తుంది. ఇంతకు ఏం జరిగిందటే.. సంగారెడ్డి జిల్లా మనూరు మండలం దవ్వూరుకు చెందిన శిరీష బాసర ట్రిపుల్ ఐటీలో పీయూసీ ఫస్ట్ ఇయర్ చదువుతోంది. అయితే ఆమెకు తన బావ ఆకాశ్‌ అంటే ఎంతో ఇష్టం. వారిద్దరికీ ఒకరంటే ఒకరు చచ్చేంత ప్రేమ. కాగా, ఇటీవల అతడు ఆత్మహత్య చేసుకుని మరణించాడు. తాను ప్రాణంగా ప్రేమించిన బావ లేకపోవడంతో శిరీష తల్లడిల్లుపోయింది. అతని లేని జీవితం వద్దనుకుని.. ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

అయితే చనిపోయే ముందు సూసైడ్ నోట్ రాయగా.. అది పోలీసులకు లభ్యం అయ్యింది. ఇందులో ‘నాన్న.. నేను ఇలా చేయడం తప్పని తెలుసు. మీరు బాధపడతారని కూడా తెలుసు. నన్ను క్షమించండి. బావ లేని జీవితనం నాకు శూన్యం. అందుకే నేను తన దగ్గరికి వెళ్లిపోతున్నా. బావ చావుకు కారణమైన వారిని వదలకండి. అలాగే నా చివరి కోరిక తీర్చండి. బావను చివరిసారిగా కూడా చూడలేకపోయా. అందుకే నన్ను బావని దహనం చేసిన చోటే కాల్చండి. ప్లీజ్ నాన్న. మేము బతికి ఉన్నప్పుడు ఎలాగూ కలిసి లేం. కనీసం చనిపోయాక అయినా కలిసి ఉంటాం. ఎవరికో భయపడి నేను చనిపోవడం లేదు. నాకు బావ కావాలి. అతడి ప్రేమ కావాలి. బావ లేకుండా నేను ఉండలేను. నాకు నువ్వు, అమ్మ ఎంతో బావ కూడా అంతే నాన్న. తమ్ముడిని జాగ్రత్తగా చూసుకో’ అని రాసింది. ఈ సూసైట్ నోట్ చూసి కన్నీంటి పర్యంతమౌతున్నారు తల్లిదండ్రులు. బావ కోసం మరదలు చేసిన ఈ త్యాగంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి