iDreamPost

అమ్మ ఎండలో క్రికెట్ ఆడుకోనివ్వలేదని.. ఉ*రి వేసుకుని చనిపోయిన 9 ఏళ్ల బాలుడు!

తొమ్మిదేళ్ల పిల్లలు అంటే.. అభం శుభం తెలియని వయస్సు. కేవలం కల్మషం లేకుండా మాట్లాడటం మాత్రమే తెలుసు. కానీ అలాంటి పసి హృదయాల్లో ఆత్మహత్య అనేద ఆలోచన పుట్టిందంటేనే ఆందోళన కలిగించే విషయం. అమ్మ తిట్టిందని 9 ఏళ్ల బాలుడు ఆత్మహత్య చేసుకున్నాడు.

తొమ్మిదేళ్ల పిల్లలు అంటే.. అభం శుభం తెలియని వయస్సు. కేవలం కల్మషం లేకుండా మాట్లాడటం మాత్రమే తెలుసు. కానీ అలాంటి పసి హృదయాల్లో ఆత్మహత్య అనేద ఆలోచన పుట్టిందంటేనే ఆందోళన కలిగించే విషయం. అమ్మ తిట్టిందని 9 ఏళ్ల బాలుడు ఆత్మహత్య చేసుకున్నాడు.

అమ్మ ఎండలో క్రికెట్ ఆడుకోనివ్వలేదని.. ఉ*రి వేసుకుని చనిపోయిన 9 ఏళ్ల బాలుడు!

నేటికాలంలో పిల్లల మానసికి స్థితి చాలా దారుణంగా ఉంటుంది. ముఖ్యంగా కాలం మారుతున్న క్రమంలో పిల్లలలో కూడా అనేక విచిత్రమైన ఆలోచనలు వస్తున్నాయి. ఇక పిల్లలు చేసే పనులు చూస్తే..తల్లిదండ్రులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇంకా దారుణం ఏమిటంటే.. తల్లిదండ్రులు మందలించారని వారిపై పగ పెంచుకునే పిల్లలు కొందరు అయితే, వారి బెదిరించేందుకు వివిధ పనులు చేసే వారు మరికొందరు. ఇంకొందరు అయితే ఆత్మహత్య అంటే అర్థం తెలియదు..కానీ ఆ దారుణ నిర్ణయం తీసుకుని నిండు జీవితాన్ని బలి చేసుకుంటున్నారు. తాజాగా ఎండలో ఆడుకోవద్దని తల్లి అన్నందుకు 9 ఏళ్ల బాలుడు దారుణానికి ఒడిగట్టి..ఆ కుటుంబంలో విషాదం నింపాడు.  పూర్తి వివరాల్లోకి వెళ్తే..

9 ఏళ్ల బాలుడు అంటే..చక్కగా తోటి పిల్లలతో కలిసి ఆడుకునే వయసు.  అంతేకాక ఎంతో భవిష్యత్ కలిగిన వాడు. ఏది మంచి, ఏది చెడో కూడా పూర్తిగా తెలియని వయస్సు అది. అయితే ఇలాంటి వయస్సులో కూడా కొందరు పిల్లలు పెద్ద పెద్ద ఆలోచనలు చేస్తున్నారు. అందుకు ఉదాహరణే వారు తీసుకుంటున్న నిర్ణయాలు, చేస్తున్న పనులు. ప్రాణం అంటే ఏమిటో అర్థం పూర్తిగా తెలియని ఆ వయస్సులో ప్రాణాలు తీసుకోవాలనే ఆలోచన ఆ  9 ఏళ్ల బాలుడి రావడం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అలా ఓ తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఓ బాలుడు ఎండలో తోటి పిల్లలతో కలసి క్రికెట్ ఆడుతున్నాడు. అయితే ఎండలో ఉంటే..పిల్లాడు ఆనారోగ్యం బారిన పడతాడని ఆ బాలుడి తల్లి భావించింది.ఈ క్రమంలో ఎండలో ఆడుకోవద్దని తల్లి అన్నందుకు ఉరి వేసుకొని 9 ఏళ్ల బాలుడు ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ విషాద ఘటన వరంగల్ జిల్లాలో చోటుచేసుకుంది.

తెలంగాణ రాష్ట్రంలో వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం మైసంపల్లికి చెందిన సిద్ధు అనే తొమ్మిదేళ్ల బాలుడు తన కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నాడు. సిద్దు స్థానిక పాఠశాలలో మూడో తరగతి చదువుతున్నాడు. ఇక వేసవి సెలవులు కావడంతో ఎండలో ఎక్కువగా తిరుగుతూ,ఆడుకుంటున్నాడు. ఎండలో తోటి పిల్లలతో కలిసి సిద్ధు క్రికెట్ ఆడేవాడు. అయితే ఎండలో తిరగవద్దని సిద్దు తల్లి  అతడిని మందలించింది. దీంతో మనస్తాపానికి గురైన సిద్ధు దారుణ నిర్ణయం తీసుకున్నాడు. ఇంట్లో ఎవరు లేని సమయంలో ఫ్యాన్ కు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కాసేపటి తరువాత కుటుంబ సభ్యులు గమనించగా..అప్పటికే జరగాల్సిన నష్టం జరిగింది. అయితే ఇలా తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయానికి రావడం ఇతర పిల్లల తల్లిదండ్రులను ఆందోళన కలిగిస్తుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి