iDreamPost

గాలిపటం దారం మెడకి చుట్టుకుని కానిస్టేబుల్ మృతి!

  • Published Dec 27, 2023 | 12:08 PMUpdated Dec 27, 2023 | 12:08 PM

కొన్నిసార్లు మృత్యువు ఏ రూపంలో ముంచుకు వస్తుందో తెలియదు. అప్పటి వరకు మనతో ఎంతో సంతోషంగా ఉన్నవాళ్లు హఠాత్తుగా కన్నుమూస్తుంటారు.

కొన్నిసార్లు మృత్యువు ఏ రూపంలో ముంచుకు వస్తుందో తెలియదు. అప్పటి వరకు మనతో ఎంతో సంతోషంగా ఉన్నవాళ్లు హఠాత్తుగా కన్నుమూస్తుంటారు.

  • Published Dec 27, 2023 | 12:08 PMUpdated Dec 27, 2023 | 12:08 PM
గాలిపటం దారం మెడకి చుట్టుకుని కానిస్టేబుల్ మృతి!

మనిషికి మృత్యువు ఏ రూపంలో వస్తుందో తెలియదు. అందుకే వాన రాకడ.. ప్రాణం పోకడ ఎవరూ ఊహించలేరని పెద్దలు అన్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా పిల్లలు, పెద్దలు సంతోషంగా గాలిపటాలు ఎగురవేస్తుంటారు. గాలిపటానికి వాడే మాంజాల వల్ల ఎన్నో ప్రమాదాలు పొంచి ఉంటాయని తెలిసి కూడా దాన్ని వాడుతూనే ఉంటారు. మాంజాతో పక్షులు ప్రాణాలు పోతుంటాయి కొన్నిసార్లు మనుషుల ప్రాణాలు కూడా పోతుంటాయి. తాజాగా మాంజా ఓ కానిస్టేబుల్ ప్రాణం తీసింది. ఈ ఘటన ముంబై లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..

మహారాష్ట్ర ముంబైలో విషాద ఘటన చోటు చేసుకుంది. సరదాగా ఎగురవేసిన గాలిపటం ఓ కానిస్టేబుల్ కి మృత్యుపాశంగా మారింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ముంబై నగరంలోని డిండోషి పోలిస్ స్టేషన్ లో కానిస్టేబుల్ విధులు నిర్వహిస్తున్నాడు సమీర్ సురేష్ జాదవ్ (37) డిసెంబర్ 24న ఆదివారం మధ్యాహ్నం డ్యూటీ ముగించుకొని వర్లిలోని తన ఇంటికి వెళ్తున్నాడు. అంతలోనే శాంతా క్రూజ్ ఈస్ట లో ఓ గాలి పటం  మాంజా అతని గొంతుకు కోసుకొని పోయింది. అంతే తీవ్ర రక్తస్రావంతో సమీర్ కిందపడిపోయాడు. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు  వెంటనే అక్కడికి చేరుకొని అతన్ని సియోన్ ఆసుపత్రికి తరలించారు.

సురేష్ జాదవ్ ని పరీక్షించిన పోలీసులు అప్పటికే అతను మరణించినట్లు పోలీసులు ధృవీకరించారు. మృతుడు జాదవ్ కి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అప్పటి వరకు అందరితో కలిసి సంతోషంగా ఉన్న సురేష్ జాదవ్ హఠాత్తుగా చనిపోవడంతో సహ ఉద్యోగులు, కుటుంబ సభ్యులు శోక సంద్రంలో మునిగిపోయారు.  పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై ఖేర్వాడీ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. పతంగులు ఎగురవేసే సమయంలో తగు జాగ్రత్తలు ఉండాలని.. ప్రాణాంతకరమైన మాంజాలను ఉపయోగించవొద్దని, చిన్నపిల్లలను వీటికి దూరంగా ఉంచాలని అంటున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి