iDreamPost

పదోతరగతి ఫలితాల్లో రికార్డు స్థాయి మార్కులు! కానీ ఏం లాభం..?

Kodagu Crime News: ఈ మద్య కాలంలో చాలా మంది ప్రతి చిన్న విషయానికి తీవ్ర మనస్థాపానికి గురై దారుణమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు.

Kodagu Crime News: ఈ మద్య కాలంలో చాలా మంది ప్రతి చిన్న విషయానికి తీవ్ర మనస్థాపానికి గురై దారుణమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు.

పదోతరగతి ఫలితాల్లో రికార్డు స్థాయి  మార్కులు! కానీ ఏం లాభం..?

ఇటీవల దేశంలో మహిళలపై ఎన్నో దారుణాలు జరుగుతున్నాయి. ప్రేమ పేరుతో కొంతమంది యువకులు యువతులను వేధించడం.. తమ ప్రేమను అంగీకరించకుంటే హత్య చేయడం జరుగుతుంది. సహజీవనం పేరుతో యువకులు తమ అవసరాలు తీరిన తర్వాత అమ్మాయిలు దారుణంగా హత్య చేస్తున్నారు. కొన్ని చోట్ల ఒంటరిగా కనిపించే మహిళలపై కామాంధులు రెచ్చిపోయి అత్యాచారం, హత్యలకు పాల్పపడుతున్నారు. నిత్యం ఇలాంటి దారుణ కృత్యాలు ఎన్నో జరుగుతున్నాయి. ఓ యువకుడు మైనర్ పై దారుణానికి ఒడిగట్టాడు. తాను పెళ్లి చేసుకోవాలి అనుకున్న అమ్మాయిని అతి కిరాతకంగా నరికి చంపేశాడు. ఆ కేసు పూర్తి వివరాల్లోకి వెళ్తే..

కర్ణాటక.. కొడగు జిల్లా సోమవారపేటలోని సూర్లబ్బి గ్రామంలో దారుణ ఘటన వెలుగు చూసింది. సోమవారపేటలోని సూర్లబ్బి గ్రామానికి చెందిన మీనా (17), ఓంకారప్ప (30) ల నిశ్చితార్థానికి పెద్దలు ముహూర్తం ఫిక్స్ చేశారు. మీనా సూర్లబ్బి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 2023-24 సంవత్సరంలో చదువుతోంది. నిన్న గురువారం ఎస్ఎస్ఎల్ సి పరీక్ష ఫలితాలు వెలువడ్డాయి. పరీక్షల్లో మీనా రికార్డు స్థాయిలో మార్కులు సాధించింది. ఎస్‌ఎస్‌ఎల్‌సీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించినందుకు మీనా, ఆమె తల్లిదండ్రలతో పాటు గ్రామస్థులు కూడా ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. గురువారం ఓంకారప్ప నిశ్చితార్థం ఫిక్స్ చేశారు. మీనా మైనర్ కావడంతో  ఈ విషయం కొంతమంది గ్రామస్థులు పోలీసులకు తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని నిశ్చితార్థం ఆపారు. అనంతరం ఇరు కుటుంబ సభ్యులు ఎవరి ఇండ్లకు వారు వెళ్లిపోయారు. అప్పటికే మీనా.. ఓంకారప్ప ఒకరంటే ఒకరు ఇష్టపడ్డారు.

మీనా పరీక్షలో మంచి మార్కులు తెచ్చుకోవడం, తన నిశ్చితార్థం ఆగి పోవడం తట్టుకోలేక పోయాడు ఓంకారప్ప, అతనిలో ద్వేషం పెరిగిపోయి తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. సాయంత్రం యువతి ఇటిపైకి దాడికి తెగబడ్డాడు. ఇంట్లో ఉన్న యువతి తల్లిదండ్రులపై దాడి చేశాడు. ఆ తర్వాత  మీనాకు ఇంటి నుంచి బయటకు లాక్కొచ్చి.. తనతో తెచ్చుకున్న కొడవలితో నరికి ఆమె తలను మొండం నుంచి వేరు చేశాడు. ఆ తర్వాత ఘటనాస్థలం నుంచి పారిపోయాడు. విషయం పోలీసులకు తెలియడంతో హత్య జరిగిన ప్రదేశాన్ని డాగ్ స్క్వాడ్, ఫొరెన్సీక్ సైన్స్ బృందంతో అదనపు ఎస్పీ సుందర్ రాజ్ సందర్శించి పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామన్నారు పోలీసులు. మంచి మార్కులతో పాసై  ఉన్నత విద్యను అభ్యసించాల్సిన తమ కూతురు జీవితం అర్థాంతరంగా ముగిసిపోవడంతో కన్నీరు మున్నీరవుతున్నారు తల్లిదండ్రులు.  మీనా హత్య నేపథ్యంలో గ్రామంలో  తీవ్ర విషాదం నెలకొంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి