iDreamPost

వీధి కుక్కలపై పగ. కుక్కలను కాల్చి చంపిన ఘటన‌లో బయటపడ్డ సంచలన నిజాలు!

Mahabubnagar Crime News: ఇటీవల దేశ వ్యాప్తంగా కుక్కల దాడులు మరీ ఎక్కువ అయ్యాయి. ముఖ్యంగా చిన్న పిల్లలపై కుక్కలు దాడి చేసి దారుణంగా చంపేస్తున్న ఘటనలు భయాందోళన సృష్టిస్తున్నాయి.

Mahabubnagar Crime News: ఇటీవల దేశ వ్యాప్తంగా కుక్కల దాడులు మరీ ఎక్కువ అయ్యాయి. ముఖ్యంగా చిన్న పిల్లలపై కుక్కలు దాడి చేసి దారుణంగా చంపేస్తున్న ఘటనలు భయాందోళన సృష్టిస్తున్నాయి.

వీధి కుక్కలపై పగ. కుక్కలను కాల్చి చంపిన ఘటన‌లో బయటపడ్డ సంచలన నిజాలు!

ఇటీవల వీధి కుక్కలు స్వైర విహారం చేస్తూ కనిపించినోళ్లపై దాడులు చేస్తున్నాయి. వీధి కుక్కల దాడుల్లో ఎంతోమంది తీవ్రంగా గాయపడుతున్నారు. కొంతమంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. దీంతో వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంటుంది. కొద్ది నెలల క్రితం అంబర్ పేటలో ప్రదీప్ అనే బాలుడిపై కుక్కలు అత్యంత దారుణంగా దాడి చేసి చంపాయి. తర్వాత కాజీపేటలో వీధి కుక్కలు చుట్టు ముట్టి మరో బాలుడిని చంపాయి. నిత్యం ఎక్కడో అక్కడ కుక్కల దాడుల్లో చనిపోతున్న కేసులు వెలుగు చూస్తూనే ఉన్నాయి. ఇదిలా ఉంటే తెలంగాణలో వీధి కుక్కలను కాల్చిన ఘటన సంచలనం రేపింది. తాజాగా ఈ ఘటనకు సంబంధించిన మిస్టరీ వీడింది. వివరాల్లోకి వెళితే..

మహబూబ్ నగర్ జిల్లా పొన్నకల్ గ్రామంలో గత నెల 15న 20 వీధి కుక్కలను తుపాకీతో కాల్చి చంపిన ఘటన తీవ్ర సంచలనం రేపింది. వీధి కుక్కలపై పగ పెంచుకున్నవాళ్లే ఈ దారుణానికి పాల్పపడి ఉండవొచ్చని భావించారు. కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నెల రోజుల నుంచి ఈ కేసు పోలీసులకు సవాల్ గా మారిన వేళ.. నిందితులు చేసిన చిన్న తప్పు వారిని పట్టించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా దేవునిపల్లికి చెందిన నర్సింహరెడ్డి (58) హైదరాబాద్ లోని రెడ్ హిల్స్ లో నివాసం ఉంటున్నాడు. మహబూబ్ నగర్ జిల్లా పొన్నకల్ ఆయన అత్తగారి ఇల్లు. తరుచూ తన అత్తగారింటికి వచ్చే నర్సింహరెడ్డి డాక్స్ హుండ్ జాతికి చెందిన రెండు కుక్కలను పెంచుకుంటుున్నాడు. ఆ కుక్కలపై నర్సింహరెడ్డి ఫ్యామిలీ ఎంతో మక్కువ పెంచుకున్నారు. ఈ క్రమంలోనే రెండు కుక్కలపై గ్రామంలోని వీధి కుక్కలు దారుణంగా దాడి చేశాయి. ఈ దాడిలో ఒక కుక్క చనిపోగా.. మరోకుక్కకు తీవ్రంగా గాయాలు అయ్యాయి. దీంతో నర్సింహారెడ్డి కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

వీధి కుక్కలపై పగ పెంచుకున్నాడు నర్సింహరెడ్డి. వాటిని ఎలాగైనా చంపేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలోనే హైదరాబాద్ కు చెందిన తారీఖ్ అమ్మద్, మహ్మద్ తాహెర్ ను సంప్రదించాడు. తారీక్ అమ్మద్ లైసెన్స్‌డ్ గన్ ఉంది. ఇద్దరు మిత్రులతో కలిసి ఫిబ్రవరి 15న తన బెంజ్ కారులో పొన్నగల్ గ్రామానికి వెళ్లి రాత్రి వీధుల్లో తిరిగే కుక్కలను కాల్చివేశారు. ఈ ఘటనలో 20 కుక్కలు మరణించాయి. గ్రామస్థులు వీధుల్లోకి వచ్చి చూసేసరికి నర్సింహారెడ్డి తన స్నేహితులతో కారులో పారిపోయారు. మరుసటి రోజు గ్రామపంచాయతీ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నింధితులకు సంబంధించిన ఆధారాలు పోలీసులకు చాలా కష్టంగా మారాయి. ఈ క్రమంలోనే సోమవారం బెంజ్ కారులో పొన్నగల్ కి వచ్చారు నర్సింహరెడ్డి అతని స్నేహితులు. కుక్కలు చనిపోయిన సమయంలో ఇదే కారు వీధుల్లో తిరగడం కొంతమంది గ్రామస్థులు చూశారు. మళ్లీ అదే కారు కనిపించడంతో పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు తమదైన స్టైల్లో విచారణ చేయడంతో నేరాన్ని ఒప్పుకున్నాడు నర్సింహరెడ్డి. నిందితుల నుంచి తుపాకీ, బెంజ్ కారు, 6 స్మార్ట్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ తెలిపారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి