iDreamPost

దిగివస్తున్న పసిడి ధరలు.. నేడు ఎంతంటే?

Gold and Silver Rates: అంతర్జాతీయ మార్కెట్ లో ఏర్పుడుతున్న పరిస్థితుల వల్ల తరుచూ బంగారం, వెండి ధరల్లో మార్పులు వస్తున్నాయి.. ఇటీవల బంగారం భారీగా దిగివస్తుంది.

Gold and Silver Rates: అంతర్జాతీయ మార్కెట్ లో ఏర్పుడుతున్న పరిస్థితుల వల్ల తరుచూ బంగారం, వెండి ధరల్లో మార్పులు వస్తున్నాయి.. ఇటీవల బంగారం భారీగా దిగివస్తుంది.

దిగివస్తున్న పసిడి ధరలు.. నేడు ఎంతంటే?

ఇటీవల దేశంలో బంగారం ధరలు భారీగా పెరిగిపోతూ వచ్చాయి.. అదే బాటలో వెండి ధరలు. అయితే ఈ నెలలో పసిడి ధరలు భారీగా పతనమవుతూ వస్తున్నాయి. ఇక బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి ఇదే మంచి గోల్డెన్ ఛాన్స్ అంటున్నారు నిపుణులు. వివాహాది శుభకార్యక్రమాలకు పసిడి కోనుగోలు చేసేందుకు మహిళలు ఇష్టపడుతుంటారు. గత వారం రోజుల నుంచి బంగారం ధరలు తగ్గుతూ వస్తున్నాయి. మహిళలకు గొప్ప శుభవార్త గత పదిహేను రోజుల్లో ఒకే ఒక్కసారి పసిడి ధరల పెరిగింది.. తర్వాత స్థిరంగా కొనసాగి తగ్గుతూ వచ్చింది. నేడు మార్కెట్ లో బంగారం, వెండి ధరల విషయానికి వస్తే..

బంగారం గురించి ఎంత చెప్పినా తక్కువే.. మహిళలే కాదు.. పురుషులు కూడా పసిడి అంటే తెగ ఇష్టపడుతుంటారు. ఇటీవల బంగారం ధరలు భారీగా పతనం కావడంతో మహిళలు జ్యులరీ షాపులకు క్యూ కడుతున్నారు. వాస్తవానికి అంతర్జాతీయ మార్కెట్ లోని పరిస్థితులు  పసిడి, వెండిపై పడటంతో తరుచూ మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. ఈ సమయంలో బంగారం కొనుగోలు చేస్తే మంచి లాభం కలిసి వస్తుందని అంటున్నారు. వచ్చే పెళ్లిళ్ల సీజన్ లో బంగారం ధరలే మళ్లి పెరిగే చాన్స్ ఉందని నిపుణులు అంటున్నారు. తెలుగు రాష్ట్రాలు హైదరాబాద్, వరంగల్, విజయవాడ, విశాఖ లో నేటి గోల్డ్ రేటు ధరలు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,000లు ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.62,180 వద్ద కొనసాగుతుంది. ప్రస్తుతం కిలో వెండి ధర రూ. 75,500 వద్ద కొనసాగుతుంది.

today gold rates

దేశంలోని ప్రధాన నగరాలు ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 57,150 లు ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 62,310 వద్ద కొనసాగుతుంది. దేశ ఆర్థిక రాజధాని ముంబై, కేరళా,బెంగుళూరు,కోల్‌కొతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.57,000 లు ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 62,180 వద్ద కొనసాగుతుంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,500 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 62,730 వద్ద కొనసాగుతుంది. చెన్నై కిలో వెండి ధర రూ. 75,500 లు ఉండగా, ఢిల్లీ, ముంబై లో రూ.73,900 వద్ద కొనసాగుతుంది. బెంగుళూరు , కోల్‌కొతాలో కిలో వెండి ధర రూ.74,000 వద్ద ట్రెండ్ అవుతుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి