iDreamPost

స్వల్పంగా తగ్గిన పసిడి ధరలు.. నేడు ఎంతంటే?

బంగారం అంటే ఎవరైనా ఎంతో ఇష్టపడతారు. దేశంలో బంగారానికి ఎంతో డిమాండ్ ఉంది.. ఇటీవల పసిడి ధరలు ఎప్పుడూ పెరుగుతూ.. తగ్గుతూ వస్తున్నాయి.

బంగారం అంటే ఎవరైనా ఎంతో ఇష్టపడతారు. దేశంలో బంగారానికి ఎంతో డిమాండ్ ఉంది.. ఇటీవల పసిడి ధరలు ఎప్పుడూ పెరుగుతూ.. తగ్గుతూ వస్తున్నాయి.

స్వల్పంగా తగ్గిన పసిడి ధరలు.. నేడు ఎంతంటే?

ఇటీవల బంగారం ధరలు ఎప్పుడు పెరుగుతున్నాయో.. ఎప్పుడు తగ్గుతున్నాయో తెలియక అయోమయంలో ఉంటున్నారు కొనుగోలుదారులు. ప్రస్తుతం కార్తీకమాసం సీజన్ పండుగలు, పెళ్లి వేడుకలతో హడావుడిగా ఉంటుంది. ఈ నెల మొదటి వారంలో కాస్త స్థిరంగా ఉన్న బంగారం ధరలు వారం రోజుల నుంచి చుక్కలు చూపించాయి. వరుసగా ధరలు పెరిగిపోతూ వచ్చాయి. తాజాగా పసిడి ధరలు కాస్త తగ్గుముఖం పట్టినట్టు కనిపిస్తుంది. గడిచిన రెండు రోజుల్లో బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతూ వస్తున్నాయి. ప్రపంచ మార్కెట్ లో ఏర్పడిన మార్పులు మొదట బంగారం పై పడుతూ వస్తుంది. ఇజ్రాయెల్-పాలస్తినాల మధ్య జరుగుతున్న యుద్దం కూడా బంగారం పెరుగుదలకు ఒక కారణం అంటున్నారు ఆర్థిక నిపుణులు. నేడు మార్కెట్ లో బంగారం, వెండి ధరల విషయానికి వస్తే..

రెండు రోజుగా పసిడి ధరలు కాస్త స్థిరంగా కొనసాగుతూ వస్తున్నాయి. నిన్నటి ధరతో పోల్చుకుంటే 22 క్యారెట్ల పసిడిపై, 24 క్యారెట్ల పసిడిపై రూ. 50 మేర తగ్గింది. ప్రస్తుతం పెళ్లిళ్ళ సీజన్ కనుక బంగారం కొనుగోలు చేయడానికి మహిళలు జ్యులరీ షాపులకు క్యూ కడుతున్నారు. మంగళవారం మార్కెట్ లో ధరల విషయానికి వస్తే.. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 56,500గా ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 61,640గా వద్ద ట్రెండ్ అవుతుంది. బంగారం ధరలు కాస్త పెరిగినప్పటికీ వెండి ధరలు మాత్రం స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్, విజయవాడ, విశాఖ, వరంగల్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.56,500 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.61,640 వద్ద కొనసాగుతుంది.

దేశంలోని ప్రధాన నగరాలు అయిన ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ రూ.56,650 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ.61,740 వద్ద కొనసాగుతుంది. ముంబై, కోల్‌కతా, బెంగళూరులో 22 క్యారెట్ల పసిడి ధర రూ.56,500, 24 క్యారెట్ల పసిడి ధర రూ.61,640 వద్ద ట్రెండ్ అవుతుంది. చెన్నైలో మాత్రం 22 క్యారెట్ల బంగారం ధర రూ.56,950 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.62,130గా వద్ద కొనసాగుతుంది. ఇక వెండి ధరలు మాత్రం స్థిరంగా కొనసాగుతూ వస్తున్నాయి. ఢిల్లీ, ముంబై, కోల్‌కతాలో కిలో వెండి ధర రూ.76,000 వద్ద కొనసాగుతుంది. చెన్నైలో కిలో వెండి ధర రూ.79,000, బెంగుళూరు లో కిలో వెండి రూ.72,250, కేరళా, హైదరాబాద్, విజయవాడ, విశాఖ లో కిలో వెండి ధర రూ.79,000 వద్ద ట్రెండ్ అవుతుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి