iDreamPost

బంగారం కొనాలనుకునే వారికి ఊరట.. దిగి వచ్చిన పసిడి ధర

  • Published Nov 24, 2023 | 8:28 AMUpdated Nov 24, 2023 | 8:28 AM

గత కొంతకాలంగా పసిడి ధర బ్రేకన్నది లేకుండా పెరుగుతూ పోతూ ఉంది. ఈ ఏడాది ఆల్‌ టైమ్‌ గరిష్టాలకు చేరింది గోల్డ్‌ రేటు. ఇలా ఉండగా నేడు మాత్రం బంగారం ధర దిగి వచ్చింది. ఆ వివరాలు..

గత కొంతకాలంగా పసిడి ధర బ్రేకన్నది లేకుండా పెరుగుతూ పోతూ ఉంది. ఈ ఏడాది ఆల్‌ టైమ్‌ గరిష్టాలకు చేరింది గోల్డ్‌ రేటు. ఇలా ఉండగా నేడు మాత్రం బంగారం ధర దిగి వచ్చింది. ఆ వివరాలు..

  • Published Nov 24, 2023 | 8:28 AMUpdated Nov 24, 2023 | 8:28 AM
బంగారం కొనాలనుకునే వారికి ఊరట.. దిగి వచ్చిన పసిడి ధర

తెలుగు రాష్ట్రాల్లోనే కాక.. దేశవ్యాప్తంగా వివాహాల సీజన్‌ ప్రారంభం అయ్యింది. ఇక ఈ సమయంలో మన దేశంలో బంగారానికి భారీ డిమాండ్‌ ఉంటుంది. తులాలు మొదలు కేజీల వరకు బంగారం కొనుగోళ్లు సాగుతాయి. పెళ్లిళ్ల సీజన్‌లో బులియన్‌ మార్కెట్‌ కళకళాడుతుంది. ఎంత పేదవారైనా సరే.. వివాహాల సందర్భంగా పుత్తడి కొనుగోలు చేస్తారు. అయితే గత కొంత కాలంగా గోల్డ్‌ రేటు భారీగా పెరుగుతూ పోతూ ఉంది. దీపావళి తర్వాత పుత్తడి ధర పరుగందుకుంది.

ఇప్పటికే బంగారం ధర ఈ ఏడాది ఆల్‌ టైం గరిష్టాలకు చేరుకుంది. ఇక గత కొన్ని రోజులుగా పెరుగుతూ పోతున్న పుత్తడి రేటుకు తాజాగా బ్రేక్‌ పడింది. నేడు బంగారం ధర దిగి వచ్చింది. కనుక కనకం కొనాలనుకునేవారు ఇప్పుడే త్వరపడితే మంచిది అంటున్నారు బులియన్‌ మార్కెట్‌ విశ్లేషకులు. మరి నేడు బంగారం ధర ఎంత ఉంది అంటే..

గురువారం దేశీయ బులియన్‌ మార్కెట్‌లో బంగారం స్థిరంగా ఉన్న విషయం తెలిసిందే. అయితే నేడు అనగా శుక్రవారం నాడు మాత్రం గోల్డ్‌ రేటు దిగి వచ్చింది. అయితే అది కూడా స్వల్పమే. నేడు హైదరాబాద్‌ బులియన్‌ మార్కెట్‌లో బంగారు ఆభరణాల తయారీకి వినియోగించే పుత్తడి పది గ్రాముల ధర రూ.50 మేర దిగి వచ్చింది. ఇక నేడు భాగ్యనగరం బులియన్‌ మార్కెట్‌లో 22 క్యారెట్‌ 10 గ్రాముల పసిడి రేటు రూ. 56,800గా ఉంది. అలానే 24 క్యారెట్‌ స్వచ్ఛమైన గోల్డ్‌ రేటు పది గ్రాముల మీద 50 రూపాయలు తగ్గి.. రూ. 61,970 వద్ద కొనసాగుతోంది.

ఇక దేశ రాజధాని ఢిల్లీలో కూడా నేడు బంగారం ధర స్వల్పంగా తగ్గింది. నేడు హస్తినలో 22 క్యారెట్‌ బంగారం పది గ్రాముల మీద 50 రూపాయలు తగ్గి.. ప్రస్తుతం రూ. 56,950గా వద్ద అమ్ముడవుతోంది. అలానే 24 క్యారెట్‌ మేలిమి బంగారం రేటు 10 గ్రాముల మీద రూ.50 తగ్గి.. 62,120 రూపాయల వద్దకొనసాగుతోంది. ఇక అంతర్జాతీయ మార్కెట్‌లో మాత్రం గోల్డ్‌, సిల్వర్‌ రేట్లు పెరుగుతూనే ఉన్నాయి కానీ తగ్గడం లేదు.

మరోసారి పెరిగిన వెండి ధర..

నేడు దేశీయ బులియన్‌ మార్కెట్‌లో బంగారం ధర స్వల్పంగా దిగి రాగా.. వెండి రేటు మాత్రం అందుకు భిన్నంగా పెరిగింది. ఇక నేడు హైదరాబాద్‌లో వెండి ధర కిలో మీద 200 రూపాయలు పెరిగి.. రూ. 79,200 వద్ద కొనసాగుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో కూడా సిల్వర్‌ రేటు పెరిగింది. ఇక నేడు హస్తినలో వెండి ధర కిలో మీద 200 రూపాయలు పెరిగి ప్రస్తుతం రూ. 76,200గా ఉంది. ఇక హైదరాబాద్‌లో బంగారం ధర తక్కువగా ఉంటే.. ఢిల్లీలో మాత్రం ఎక్కువగా ఉంటుంది. వెండి విషయానికి వస్తే.. భాగ్యనగరంలో సిల్వర్‌ రేటు ఎక్కువగా ఉంటే.. ఢిల్లీలో మాత్రం తక్కువగా ఉంటుంది. ఇందుకు ప్రధాన కారణం స్థానికంగా ఉండే పన్నులు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి