iDreamPost

రోడ్డుపై డీజిల్ ట్యాంకర్ బోల్తా.. భారీగా చెలరేగిన మంటలు!

Diesel Tanker: పెట్రోల్, డీజిల్ వంటి వాటిని తరలించే వాహనాలు తరచూ ప్రమాదానికి గురవుతుంటాయి. ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు అప్రమత్తంగా లేకుంటే భారీ ప్రాణ నష్టం సంభవిస్తుంది. తాజాగా ఓ డీజిల్ ట్యాంకర్ రోడ్డుపై బోల్తా పడింది.

Diesel Tanker: పెట్రోల్, డీజిల్ వంటి వాటిని తరలించే వాహనాలు తరచూ ప్రమాదానికి గురవుతుంటాయి. ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు అప్రమత్తంగా లేకుంటే భారీ ప్రాణ నష్టం సంభవిస్తుంది. తాజాగా ఓ డీజిల్ ట్యాంకర్ రోడ్డుపై బోల్తా పడింది.

రోడ్డుపై డీజిల్ ట్యాంకర్ బోల్తా.. భారీగా చెలరేగిన మంటలు!

నిత్యం ఏదో ఒక రోడ్డు ప్రమాదాలు అనేవి జరుగుతూనే ఉంటాయి. ముఖ్యంగా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తూ డ్రైవింగ్ చేయడం కారణంగా ఈ ప్రమాదాలు చోటుచేసుకుంటాయి. రోడ్డు ప్రమాదాల కారణంగా ఎందరో మృతి చెందగా, ఎన్నో కుటుంబాలు రోడ్డున పడతాయి. ఈ ప్రమాదాల కారణంగా మరెందరో తీవ్ర గాయాలతో జీవితాన్ని నరకయాతన అనుభిస్తున్నారు. ఇంధనాలు తరలించే వాహనాలు ప్రమాదానికి గురైనప్పుడు భారీ ప్రాణ నష్టం జరుగుతుంది. ఇటీవలే ఓ ప్రాంతంలో ఆయిల్ ట్యాంకర్ బోల్తా పడి..మంటలు అంటుకున్న ఘటనలో 44 మంది దుర్మరణం చెందారు. తాజాగా జగిత్యాల జిల్లాలో డీజిల్ ట్యాంకర్ బోల్తా పడి.. భారీగా మంటలు చెలరేగాయి. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే…

తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లాలో డీజిల్ ట్యాంకర్ ప్రమాదానికి గురైంది.  మెట్ పల్లి మండలం వెంకటరావుపేట సమీపం జాతీయ రహదారిపై ఈ  ప్రమాదం చోటుచేసుకుంది.  ఘట్ కేసర్ నుంచి జిగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం రాఘవపేటలోని ఓ బంకుకు ఈ ట్యాంకర్ డీజిల్ తరలిస్తుంది. ఈ క్రమంలోనే విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ ను డీజిల్ తో వెళ్తున్న ఈ ట్యాంకర్ ఢీ కొట్టింది. ట్రాన్స్ ఫార్మర్ ను ట్యాంకర్ బలంగా ఢీ కొట్టడంతో పెద్ద శబ్దం వచ్చింది.  ఈ ప్రమాదంలో డీజిల్ ట్యాంకర్ బోల్తా పడింది. దీంతో క్షణాల్లో భారీగా మంటలు చెలరేగాయి.

Diesel tanker overturned on the road

స్థానికులు  అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో వెంటనే రెండు ఫైరింజన్లతో అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకున్నాయి. డీజిల్ ట్యాంకర్ నుంచి ఎగసి పడుతున్న భారీ మంటలను ఆర్పేందుకు తీవ్రంగా శ్రమించారు. ఇక డీజిల్ ట్యాంకర్ కావడంతో అందులో నుంచి మంటలు భారీ ఎత్తున ఎగసి పడ్డాయి. ఈ ప్రమాదంలో జాతీయ రహదారిపై వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. చాలా సేపు జాతీయ రహదారిపై భారీ ట్రాఫిక్ జామ్ అయ్యింది. భారీగా మంటలు ఎగసి పడుతుండటంతో  ఆ ప్రాంతం అంతా నల్లటి పొగ కమ్ముకుంది. ఊరికి సమీపంలోనే ఈ ఘటన జరగడంతో అందరు భయాందోళనకు గురయ్యారు. ఆ మంటలు ఇళ్లపైకి వస్తాయనే అనుమానంతో ఆందోళనకు గురయ్యారు.

ఇలా ఇంధనాన్ని తరలిస్తున్న వాహనాలు అప్పుడప్పుడు ప్రమాదానికి గురవుతుంటాయి. ఇటీవలే ఓ దేశంలో పెట్రోల్ ట్యాంకర్ ప్రమాదానికి గురైంది. అందులో నుంచి భారీగా పెట్రోల్ బయటకు వచ్చింది. అయితే ఆ పెట్రోల్ ను తీసుకునేందుకు స్థానికులు పెద్ద ఎత్తునా అక్కడికి వచ్చారు. ఈ నేపథ్యంలోనే అకస్మాత్తుగా మంటలు చేలరేగి.. భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 44 మంది అక్కడికక్కడే మృతి చెందారు. 88 మందికి తీవ్ర గాయాలయ్యాయి. డీజిల్, పెట్రోల్ వంటివి సరఫరా చేసే వాహనాలు ప్రమాదానికి గురైనప్పుడు అందరు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి