iDreamPost

వసతి గృహంలో అగ్నిప్రమాదం.. 13 మంది విద్యార్థుల మృతి!

తరచూ ఏదో ఒక ప్రాంతంలో ఘోర అగ్నిప్రమాదాలు జరుగుతుంటాయి. తాజాగా ఓ వసతి గృహంలో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 13 మంది విద్యార్థులు సజీవ దహనం అయ్యారు. శుక్రవారం రాత్రి జరిగిన ఈ ఘోరం 13 కుటుంబాల్లో విషాదం నింపింది.

తరచూ ఏదో ఒక ప్రాంతంలో ఘోర అగ్నిప్రమాదాలు జరుగుతుంటాయి. తాజాగా ఓ వసతి గృహంలో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 13 మంది విద్యార్థులు సజీవ దహనం అయ్యారు. శుక్రవారం రాత్రి జరిగిన ఈ ఘోరం 13 కుటుంబాల్లో విషాదం నింపింది.

వసతి గృహంలో అగ్నిప్రమాదం.. 13 మంది విద్యార్థుల మృతి!

నిత్యం ఏదో ఒక ప్రాంతంలో అగ్నిప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. షార్ట్ సర్కూట్, రసాయనాల పేలుడు వంటి కారణాలతో  ఈ ప్రమాదాలు జరుగుతుంటాయి. అగ్నిప్రమాదాల ఘటనలో అనేక మంది అమాయకులు  ప్రాణాలు కోల్పోతుంటారు. మరెందరో తీవ్ర గాయాలతో జీవితాన్ని నరకంగా అనుభవిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం హైదరాబాద్ లోని నాంపల్లిలో ఓ భవనంలో అగ్నిప్రమాదం జరిగి.. ఎనిమిది మంది మరణించారు. తాజాగా ఓ హాస్టల్ లో అగ్నిప్రమాదం జరిగి ఏకంగా 13 మంది విద్యార్థులు మరణించారు. ఈ ఘటన ఎక్కడ జరిగింది.  వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం…

శుక్రవారం చైనాలోని హెనాన్ ప్రావిన్స్ లో  అగ్నిప్రమాదం జరిగింది.  ఓ పాఠశాలకు చెందిన వసతి గృహంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. హెనాన్  ప్రావిన్స్ లోని యింగ్ కాయ్ అనే పాఠశాల హస్టల్ లో రాత్రి 11 గంటలక సమయంలో అగ్నిప్రమాదం సంభవించింది. క్షణాల్లో మంటలు ఆ భవనం మొత్తాన్ని చుట్టు ముట్టాయి. ఈ ప్రమాదంలో 13 మంది విద్యార్థులు దుర్మరణం చెందారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనపై స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని చర్యలు చేపట్టారు.

ఎగసి పడుతున్న మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా కృషి చేసింది.  ఇక ఈ ప్రమాదంలో మరణించిన వారందరూ మూడో తరగతి చదువుతున్నట్లు  సదరు పాఠశాల ఉపాధ్యాయుడు మీడియాకు వెల్లడించారు. ఇక ప్రమాదంలో గాయపడిన విద్యార్థిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి ఆరోగ్య నిలకడగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అగ్నిప్రమాదాల నివారణ రూల్స్ ను పాటించని సదరు స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

అయితే, ఈప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. గతంలోనూ ఉత్తర చైనాలో ఓ బొగ్గు కంపెనీలు అగ్నిప్రమాదం జరిగి..26 మంది మరణించారు. తాజాగా ఈ ఘటన జరగడంతో 13 మంది విద్యార్థుల కుటుంబాల్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.  ఎవరో చేసిన తప్పుకు అభంశుభం తెలియని  పసిపిల్లలు బలయ్యారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  మన తెలుగు రాష్ట్రాల్లో సైతం తరచూ అగ్నిప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవలే గద్వాల జిల్లాలో ఓ బస్సులో ప్రమాదం జరిగి ఓ మహిళ సజీవ దహనం అయిన సంగతి తెలిసిందే. ఇలా తరచూ అగ్నిప్రమాదాల కారణంగా ఎందరో అమాయకులు మంటల్లో కాలిపోతున్నారు.  గతంలో సికింద్రాబాద్ ప్రాంతంలో కూడా మరి.. ఇలాంటి విషాదాల నివారణకు చర్యలు  ఏమిటి?. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి