iDreamPost
android-app
ios-app

శ్రీలంకలోని సీతమ్మ ఆలయానికి.. మన దేశం నుంచి ప్రత్యేక కానుకలు!

  • Published May 13, 2024 | 6:18 PMUpdated May 13, 2024 | 6:18 PM

Anjanadri, Seeta Devi Temple, Sri Lanka: రామజన్మ భూమి అయోధ్యలో బాల రాముడు కొలువుదీరాడు.. ఇప్పుడు సీతాదేవి వంతు వచ్చింది. అది కూడా లంకలో.. అక్కడ సీతా ఆలయ విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం..

Anjanadri, Seeta Devi Temple, Sri Lanka: రామజన్మ భూమి అయోధ్యలో బాల రాముడు కొలువుదీరాడు.. ఇప్పుడు సీతాదేవి వంతు వచ్చింది. అది కూడా లంకలో.. అక్కడ సీతా ఆలయ విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం..

  • Published May 13, 2024 | 6:18 PMUpdated May 13, 2024 | 6:18 PM
శ్రీలంకలోని సీతమ్మ ఆలయానికి.. మన దేశం నుంచి ప్రత్యేక కానుకలు!

వనవాసంలో ఉన్న సీతా దేవిని రాముడి నుంచి వేరు చేస్తూ.. లంకాధిపతి రావణుడు అపహరించి, లంకలో ఉంచాడు. అతని చెర నుంచి సీతను విడిపించి తీసుకురావడానికి రామరావణ యుద్ధం జరిగింది. ఇది అందరికీ తెలిసిన విషయం. లంకలో సీతా దేవికి అవమానాలు జరిగాయనేది కూడా అందరు రామాయణంలో చదువుకున్నారు. కానీ, అదే సీతమ్మకు లంకలో ఆలయం ఉన్నదన్న విషయం మా​త్రం చాలా తక్కువ మందికి తెలుసు. అయితే.. ఆ సీతా దేవి ఆలయానికి త్వరలోనే భారత్‌ నుంచి ప్రత్యేక కానుకలు వెళ్లాయి. అసలు లంకలో ఈ సీతాదేవి ఆలయం ఎక్కడ ఉంది. కానుకలు ఎక్కడి నుంచి ఎవరు పంపుతున్నారు? లాంటి ఆసక్తికర విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..

మన దేశంల రామ జన్మభూమి అయోధ్యలో బాల రాముడు కొలువుదీరాడు. అయితే ఇప్పుడు సీతాదేవి ఆలయం వంతు వచ్చింది. శ్రీలంకలోని సీతా ఎలియా గ్రామంలో సీతా దేవి ఆలయం ఉంది. ఈ సీతా దేవి ఆలయాన్ని ఆర్ట్ ఆఫ్ లివింగ్‌కు చెందిన శ్రీ రవిశంకర్ గురూజీ పునరుద్ధరించారు. పునరుద్ధరించిన ఆలయాన్ని మే 19న(ఆదివారం) ప్రారంభించనున్నారు. ఈ ఆలయ ప్రారంభోత్సవం సందర్భంగా ఆంజనేయుడి జన్మస్థలమైన అంజనాద్రి కొండ నుంచి సీతాదేవికి భారీగా కానుకలు పంపించారు. కానుకలతో పాటు ఆంజనేయుడి విగ్రహం, ఇక్కడి నీరు, మట్టి, పట్టు చీర పంపించారు.

సీతా దేవి దేవస్థానం శ్రీలంకలోని నువారా ఎలియా నుంచి చాలా దూరంలో ఉన్న సీతా ఎలియా గ్రామంలో ఉంది. సీతమ్మ ఆలయం కేవలం పూజా స్థలం మాత్రమే కాదు.. రావణుడు సీతమ్మను అపహరించి ఈ ప్రదేశంలోనే బంధించాడని స్థానికులు విశ్వసిస్తారు. ఈ ఆలయంలో రాముడు, సీతాదేవి, లక్ష్మణుడు, హనుమంతుని విగ్రహాలు ఉన్నాయి. ఆంజనేయుడి పాదముద్రలున్న ఒక శిల కూడా ఇక్కడ ఉంది. అయితే ఈ గుడి ప్రత్యేకంగా సీతాదేవికి అంకితం ఇచ్చారు. శ్రీలంకలో ఉన్న రామాయణానికి సంబంధించిన అత్యంత ముఖ్యమైన ప్రదేశాలలో ఇదీ ఒకటి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి