iDreamPost

పాక్ మహిళ మాయలో భారత ఇంజనీర్.. ఆర్మీ కీలక సమాచారం లీక్!

  • Published May 11, 2024 | 4:06 PMUpdated May 11, 2024 | 4:06 PM

మరోమారు దేశంలో ఈ హని ట్రాపింగ్ పేరుతో పాకిస్థాన్ దేశం భారత్ పై కన్నేసింది. ఎప్పుడెప్పుడు భారత్ రహస్యాలను తెలుసుకుందామా అని అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ పాకిస్థాన్.. మరో అందమైన మహిళను ఎరగా వేసి.. భారత భద్రతా దళాల్లో పని చేస్తున్న ఓ ఇంజనీర్ ను ట్రాప్ చేసింది.

మరోమారు దేశంలో ఈ హని ట్రాపింగ్ పేరుతో పాకిస్థాన్ దేశం భారత్ పై కన్నేసింది. ఎప్పుడెప్పుడు భారత్ రహస్యాలను తెలుసుకుందామా అని అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ పాకిస్థాన్.. మరో అందమైన మహిళను ఎరగా వేసి.. భారత భద్రతా దళాల్లో పని చేస్తున్న ఓ ఇంజనీర్ ను ట్రాప్ చేసింది.

  • Published May 11, 2024 | 4:06 PMUpdated May 11, 2024 | 4:06 PM
పాక్ మహిళ మాయలో భారత ఇంజనీర్.. ఆర్మీ కీలక సమాచారం లీక్!

హనీ ట్రాప్.. గత కొంతకాలంగా ఎక్కడ చూసిన ఈ పదం చాలా విస్తృతంగా వినిపిస్తుంది. సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు కలిగిన పెద్ద పెద్ద కోటీశ్వరులు, బిజినెస్ మాన్స్, అలాగే ప్రభుత్వ రంగంలో పనిచేసే వ్యక్తులను మోసం చేసి వారి దగ్గర విలువైన సమాచారాన్ని రాబెట్టడం, పెద్ద మోతాదులో నగదును కొల్లగొట్టడం కోసం.. చాలామంది అందమైన అమ్మాయిలను బరిలోకి దించుతారు. ఇక ఆ అమ్మాయిలు ఆ వ్యక్తులను సోషల్ మీడియాల్లో పరిచయం ఏర్పరుచుకొని, వారిని మెల్లగా ఆకట్టుకుని ట్రాప్ చేస్తారు. ఈ క్రమంలోనే వారికి ఆకర్షితులైన వ్యాక్తులు దగ్గర వారికి కావాల్సినసమాచారాన్ని తెలుసుకుంటారు. దీనేనే హనీ టాపింగ్ అని అంటారు. ఇప్పటికే ఈ తరహా క్రైమ్ లు చాలానే జరిగాయి. ఇటీవలే దేశం కోసం పనిచేసే జావాన్ లను సైతం వదిలిపెట్టకుండా.. వారిని కూడా ఈ హని ట్రాప్ పేరుతో ఆకట్టుకుంటు వారి ద గ్గర విలువైన సమాచారాన్ని రాబెట్టుకుంటున్నారు.తాజాగా మరోసారి ఈ హని ట్రాపింగ్ ఘటన తీవ్ర కలకరం రేపింది. ఆ వివరాళ్లోకి వెళ్తే..

మరోమారు దేశంలో ఈ హని ట్రాపింగ్ పేరుతో పాకిస్థాన్ దేశం భారత్ పై కన్నేసింది. ఎప్పుడెప్పుడు భారత్ రహస్యాలను తెలుసుకుందామా అని అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ పాకిస్థాన్.. అందమైన మహిళను ఎరగా వేసి.. భారత భద్రతా దళాల్లో ఉన్న ఆఫీసర్లకు వల వేస్తూ ఉంటుంది. అయితే ఇది గుర్తించని.. కొందరు కీలకమైన రహస్య రహస్య సమాచారాన్ని వారికి చేరవేస్తుంటారు. దీంతో ఆ సున్నితమైన సమాచారం కాస్త శత్రు దేశమైన పాక్ కు చేరుతోంది. తాజాగా మరోసారి ఈ హనీ ట్రాప్ కేసు వెలుగులోకి వచ్చింది. ఓ పాక్ మహిళ ఏజెంట్ ద్వారా భారత ఇంజనీర్ తో ఫేస్ బుక్ లో పరిచయం పెంచుకొని.. సైనిక రహస్యాలను పాక్ కు చేరవేశాడు. అయితే ఈ డేటాలో కీలకమైన డ్రోన్ల వివరాలను కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ప్రవీణ్ మిశ్రా అనే ఓ ఇంజనీర్‌కు.. ఫేస్‌బుక్‌లో సోనాల్ గర్గ్ అనే ఒక మహిళ పరిచయం అయింది. ఇకపోతే తాను చండీగఢ్‌లోని ఐబీఎం ఆఫీస్‌లో పనిచేస్తున్నట్లుగా ఆ మహిళ ఏజెంట్ తనని తాను పరిచయం చేసుకుంది.

ఈ క్రమంలోనే.. ఆ పాకిస్థాన్ మహిళ.. ప్రవీణ్ మిశ్రాతో ఫోన్ నంబర్ తీసుకొని చాటింగ్ చేసింది. అంతేకాకుండా.. వారి వద్ద కీలక సమాచారాన్ని సేకరించింది. అలాగే ఆ సమాచారాన్ని పాక్ కు చేరవేసింది. ఇక  భారత దళాలకు పణి, డ్రోన్‌ విడిభాగాలను సరఫరా చేసే ఓ సంస్థలో పనిచేస్తున్న ప్రవీణ్‌ మిశ్రా..  సోనాల్ గర్గ్ కోసం ఆర్మీ, రక్షణ సంస్థలకు చెందిన కీలక సమాచారాన్ని  సేకరించాడు.  ఈ నేపథ్యంలోనే అంకాలేశ్వర్‌లోని ఓ కంపెనీకి చెందిన రహస్య డేటాను అతడు దొంగిలించాడు. దాంతోపాటు ఆ కంపెనీ కంప్యూటర్లలో మాల్‌వేర్‌ను చొప్పించేందుకు కూడా ప్రయత్నించగా.. అతడి కదలికలను ఉదంపూర్‌లోని మిలటరీ ఇంటెలిజెన్స్‌ డిపార్ట్‌మెంట్ గుర్తించింది. వెంటనే గుజరాత్ సీఐడీ అధికారులను అలర్ట్ చేయగా.. వారు రంగంలోకి దిగి భరూచ్‌ జిల్లాలో అతనిని అదుపులోకి తీసుకున్నారు.

ఇక ప్రవీణ్ మిశ్రాను అరెస్ట్ చేసిన గుజరాత్ సీఐడీ అధికారులు.. విచారణలో పలు కీలక విషయాలను సేకరించారు. అలాగే ప్రవీణ్ మిశ్రా ఫోన్‌ను స్వాధీనం చేసుకున్న అధికారులు.. అందులో చాలా దేశ రక్షణ సమాచారం ఉన్నట్లు గుర్తించారు. అంతేకాకుండా.. అందులో కొంత సమాచారాన్ని ఇప్పటికే ప్రవీణ్ మిశ్రా పాకిస్థాన్ కు పంపించినట్లు అధికారులు పేర్కొన్నారు. ముఖ్యంగా డ్రోన్ల తయారీ ఇన్ఫర్మేషన్ కు సంబంధించి డేటా ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. ఇప్పటికే భారత్ పలు కీలక రంగాల్లో పనిచేస్తున్న వారిని ఇలా హనీట్రాప్ చేస్తున్న ఘటనలు చాలా ఎక్కువయ్యాయని ఇకపై ఇలాంటి విషయాల్లో జాగ్రత్తాగా ఉండాలని, లేకపోతే జీవితాంతం జైల్లో ఊచలు లెక్కిస్తారని అధికారులు హెచ్చరిస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి