iDreamPost

అత్తింటి వేధింపులు… ఘోర నిర్ణయం తీసుకున్న వివాహిత!

ఈ ఆధునిక యుగంలో మహిళలు అన్ని రంగాల్లో దూసుకెళ్తున్నారు. పురుషులతో సమానంగా పోటీ పడుతూ.. ముందుకెళ్తున్నారు. ఇంతలా మహిళలు అభివృద్ధి చెందినా.. కొన్ని చోట్ల మాత్రం ఇంకా వరకట్న వేధింపులకు గురవుతున్నారు.. అలానే బలి అవుతున్నారు. తాజాగా ఓ వివాహిత క్షణికావేశంలో దారుణం నిర్ణయం తీసుకుంది.

ఈ ఆధునిక యుగంలో మహిళలు అన్ని రంగాల్లో దూసుకెళ్తున్నారు. పురుషులతో సమానంగా పోటీ పడుతూ.. ముందుకెళ్తున్నారు. ఇంతలా మహిళలు అభివృద్ధి చెందినా.. కొన్ని చోట్ల మాత్రం ఇంకా వరకట్న వేధింపులకు గురవుతున్నారు.. అలానే బలి అవుతున్నారు. తాజాగా ఓ వివాహిత క్షణికావేశంలో దారుణం నిర్ణయం తీసుకుంది.

అత్తింటి వేధింపులు… ఘోర నిర్ణయం తీసుకున్న వివాహిత!

ప్రతి ఒక్క అమ్మాయి.. తన పెళ్లి జీవితంపై ఎన్నో ఆశలు పెట్టుకుంది. తనకు కాబోయే వాడి గురించి ఎన్నో కలలు కంటుంది. అయితే చాలా తక్కువ మంది జీవితాల్లో మాత్రమే..తాము ఊహించినవి జరుగుతుంటాయి. మరోవైపు చాలా మంది ఆడపిల్లలు అత్తారింటిలో ఎదురయ్యే వివిధ రకాల వేధింపులతో నరకం అనుభవిస్తుంటారు. ఇంకా దారుణం ఏమింటేంటే..తనకు మద్దతుగా ఉండాల్సిన భర్తే.. అత్తమామలతో కలిసి ఇబ్బందులకు గురి చేస్తుంటాడు. దీంతో చాలా మంది వివాహితలు బలవన్మరణానికి పాల్పడి..నిండు జీవితాన్ని ముగిస్తున్నారు. తాజాగా ఓ వివాహిత కూడా ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన సిరిసిల్లలో బుధవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

తెలంగాణ రాష్ట్రం, సిద్ధిపేట జిల్లా అక్కన్నపేట మండలం కేశవపూర్ కు చెందిన బొమ్మగాని స్రవంతి అలియాస్ లాస్య కి కరీంనగర్ జిల్లా ఇల్లందకుంటకి చెందిన రావుల నాగరాజుతో 2018లో వివాహం జరిగింది. రావుల నాగరాజు సిరిసిల్ల బెటాలియన్ లో కానిస్టేబుల్ గా పని చేస్తున్నాడు. ఇక ఈ దంపతులకు ఆరేళ్ల పాప, రెండేళ్ల బాబు ఉన్నారు. పిల్లలను తమ పెద్దల వద్ద ఉంచి.. వీరిద్దరే  ఉంటున్నారు. రావుల నాగరాజు దంపతులు సిరిసిల్ల రాళ్లబావి వద్ద ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. ఇద్దరు చక్కని బిడ్డలు, జీవనానికి ఓ ఉద్యోగం.. ఉంది. ఇక ఎంతో సంతోషంగా సాగాల్సిన వీరి దాంపత్యంలో గొడవలు మొదలయ్యాయి.

నాగరాజు, లాస్యల మధ్య కొంతకాలం నుంచి గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే నాగరాజు మంగళవారం తన విధుల నిమిత్తం బయటకు వెళ్లాడు. అదే సమయంలో లాస్య ఒక్కతే ఇంట్లో ఉంది. కొద్ది సేపటికి ఆమె విషం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఇంటి నుంచి శబ్దం రావడంతో గమనించిన వారి ఇంటి ఓనర్ వెంటనే నాగరాజుకు సమాచారం అందించాడు. విషమ స్థితిలో ఉన్న భార్యను నాగరాజు సిరిసిల్ల ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లాడు. అక్కడి వైద్యులు సూచిన మేరకు కరీంనగర్‌కు తీసుకెళ్లాడు. లాస్య పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌ లోని ఓ ఆస్పత్రికి తరలించారు.

లాస్య అక్కడే చికిత్స పొందుతూ బుధవారం మరణించింది. అత్తారింటి వాళ్లు వరకట్నం వేధింపులు గురి చేశారని, కొద్ది రోజులుగా అదనంగా రూ.10 లక్షలు కట్నం తీసుకురావాలని వేధించడంతోనే తన బిడ్డ ఆత్మహత్య చేసుకుందని మృతురాలి తండ్రి బొమ్మగాని రాజేశం.. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మృతురాలి తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇలాంటి ఘటనలు తరచూ ఏదో ఒక ప్రాంతంలో జరుగుతూనే ఉన్నాయి. మరి.. ఘటనల నిర్మూలనకు ఏం చేయాలి?. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి