iDreamPost

భార్యాకూతుర్ని కడతేర్చి.. శరీరంపైనే మరణ వాంగ్మూలం రాసుకుని..

  • Published Feb 10, 2024 | 4:43 PMUpdated Feb 10, 2024 | 5:16 PM

ఇటీవల కాలంలో చాలామంది ఈజీ మనికీ అలవాటు పడటంతో ఆన్ లైన్ బెట్టింగ్ లను వ్యసనంలా అలవాటు చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే కుటుంబన్ని రోడ్డున పడేసి, తమ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. తాజాగా ఓ వ్యక్తి బెట్టింగ్ వలలో పడి కుటుంబం పట్ల కర్కశంగా ప్రవర్తించాడు. అసలు ఏం జరిగిదంటే..

ఇటీవల కాలంలో చాలామంది ఈజీ మనికీ అలవాటు పడటంతో ఆన్ లైన్ బెట్టింగ్ లను వ్యసనంలా అలవాటు చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే కుటుంబన్ని రోడ్డున పడేసి, తమ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. తాజాగా ఓ వ్యక్తి బెట్టింగ్ వలలో పడి కుటుంబం పట్ల కర్కశంగా ప్రవర్తించాడు. అసలు ఏం జరిగిదంటే..

  • Published Feb 10, 2024 | 4:43 PMUpdated Feb 10, 2024 | 5:16 PM
భార్యాకూతుర్ని కడతేర్చి.. శరీరంపైనే మరణ వాంగ్మూలం రాసుకుని..

‘క్రికెట్ బెట్టింగ్స్’. ఈ మధ్యకాలంలో చాలామందికి ఇది ఒక వ్యసనంలా మారిపోయింది. ఈ బెట్టింగ్స్ కి అలవాటు పడ్డ యువత అప్పులు చేసుకుంటూ.. ప్రాణలు మీదకి తెచ్చుకుంటున్నారు. ముఖ్యంగా ప్రతిఒక్కరు ఈజీ మనికీ అలవాటు పడటంతో.. బెట్టింగ్ లో పడి చాలా డబ్బులు పొగట్టుకుంటున్నారు. ఇలా తమ చదువు, కెరీర్, కుటుంబ సభ్యులను మార్చిపోతున్నారు. ఈ క్రమంలోనే చాలామంది ఉన్నవి కాస్త పోగెట్టుకొని, కుటుంబన్ని ఆర్థిక స్థితిలో పడేసి.. ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. ఇదివరకు ఇలాంటి ఘటనలు చాలానే జరిగాయి. తాజాగా మరోసారి బెట్టింగ్ వలలో పడి ఓ వ్యక్తి కుటుంబం పట్ల కర్కశంగా ప్రవర్తించాడు. బెట్టింగ్ లకు బానిసగా మారి అప్పులు చేశాడు. చివరికి కుటుంబన్నే మింగేశాడు. అసలు ఏం జరిగిదంటే..

అన్యునంగా సాగిన వైవాహిక జీవితం..  ప్రేమగా చూసుకుంటున్న భార్యను, అపురుపంగా చూసుకుంటున్నా కూతురిని కర్కశంగా కడతేర్చాడు ఓ వ్యక్తి. ఈ అమానుష ఘటన అనంతపురం జీల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. అనంతపురం జిల్లాలో చంద్రావతి, రామకృష్ణ అనే దంపతులు ఉన్నారు. వీరికి ఐదేళ్ల కిందట పెళ్లి కాగా, ప్రస్తుతం వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వీరిలో పెద్దమ్మాయి శాన్విత అమ్మమ్మ ఇంట్లో ఉంటు చదువుకుంటుంది. అయితే రామకృష్ణ,చంద్రావతి మాత్రం తమ చిన్న కుతూరు చైత్రికతో యాడికిలోని చౌడేశ్వరి కాలనీలో అద్దె ఇంట్లో నివశిస్తున్నారు. కాగా, రామకృష్ణ మగ్గం పనిచేస్తున్నాడు. ఇక పెళ్లై ఐదేళ్ల వరకూ బాగానే ఉన్నా రామకృష్ణ ఈ మధ్యకాలంలో క్రికెట్ బెట్టింగ్‌లకు అలవాటు పడ్డాడు. దీంతో బెట్టింగ్‌లో ఉన్నదంతా పోగొట్టుకున్నాడు. తిరిగి సంపాదించలనే ఆశతో అప్పులు చేసి మరీ.. బెట్టింగ్‌‍లలో పాల్గొన్నాడు. కానీ, బెట్టింగ్ లో కూడా ఉన్నదంతా పోగొట్టుకోవడంతో.. కుటుంబ ఆర్థికంగా గడవడం కష్టంగా మారింది. దీంతో భార్యాభర్తల మధ్య తరుచు గొడవలు జరుగుతుండేవి.

ఈ క్రమంలోనే గురువారం కూడా ఇద్దరి మధ్య గొడవ జరగడం వలన కోపాద్రికుడైన రామకృష్ణ కసాయిగా మారాడు. దీంతో భార్యను మంచానికి కట్టేసి ముఖాన్ని దిండుతో అదిమి హత్య చేశాడు. అలాగే తొమ్మిది నెలల చిన్నారి చైత్రికపై బియ్యం సంచి ఉంచి ఇంట్లో నుంచి పారిపోయాడు. కాగా, శుక్రవారం ఉదయం రామకృష్ణ సెల్‌ఫోన్‌కు సోదరుడు ఫోన్‌ చేయగా స్విచ్ఛాఫ్‌ రావడంతో.. అనుమానం వచ్చి బంధువులకు సమాచారం అందిచాడు. ఆ తర్వాత యాడికి వచ్చి చూడగా.. ఇంటికి తాళం వేసి కనిపించింది. దీంతో రామకృష్ణ సోదరుడు పోలీసులకు సమాచారం అందించాడు.

పోలీసులు రామకృష్ణ ఇంట్లో తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లి చూడగా.. చంద్రావతి, చైత్రిక మృతదేహాలు కనిపించాయి. ఇక ఇద్దరి మృతదేహాలను పోస్టుమార్టమ్‌కు తరలించిన పోలీసులు ఇంట్లో నుంచి ఆధారాలు సేకరించారు. ఆ తర్వాత పారిపోయిన రామకృష్ణ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలోనే రైల్వే స్టేషన్ సమీపంలో ఓ మృతదేహం ఉందంటూ శనివారం పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఘటనా స్థలికి వెళ్లి పరిశీలించిన పోలీసులు చనిపోయింది రామకృష్ణగా గుర్తించారు. అయితే భార్య కూతురిని హత్య చేసిన తర్వాత రైలుపట్టాల వద్దకు వచ్చి ఆత్మహత్యకు పాల్పడినట్లు గుర్తించారు. కానీ, చనిపోతూ.. తన భార్యా కూతురిని నన్ను క్షమించండి అంటూ శరీరంపై రాసుకుని బలవన్మరణానికి పాల్పపడ్డాడు. దీంతో ఈ విషాద ఘటన స్థానికులను కలిచివేసింది. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మరి, బెట్టింగ్ ఉచ్చులో పడి కుటుంబన్ని బలిగొని, తాను ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి