iDreamPost

తండ్రి బాలికపై రేప్..వీడియో తీసి పోలీసులకు పట్టించిన కొడుకు!

తండ్రి బాలికపై రేప్..వీడియో తీసి  పోలీసులకు పట్టించిన కొడుకు!

ఈ మధ్యకాలంలో ఆడపిల్లలపై లైంగిక వేధింపులు, అత్యాచార ఘటనలు అనేకం జరుగుతున్నాయి. ఇంకా దారుణం ఏమిటంటే కొందరు పండు ముసలి వారు సైతం ఆడపిల్లలపై అఘాయిత్యాలకు పాల్పడి.. సభ్య సమాజాన్ని తలవంపులు తెస్తున్నారు. ఇలా బాలికలపై జరిగిన దారుణాలు ఎన్నో బయటకు రాకుండా పోతున్నాయి. తాజాగా ఓ తండ్రి బాలికపై రేప్ చేయగా.. కొడుకు వీడియో తీసి.. పోలీసులకు పట్టించాడు. అసలు ఈ స్టోరీ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

ఢిల్లీలో 16 ఏండ్ల బాలికపై 68 ఏండ్ల వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఏప్రిల్ 20న ఇంటి బయట ఒంటరిగా ఉన్న బాలికను మాయ మాటలతో మభ్య పెట్టిన ఓ వృద్ధుడు.. తన ఇంట్లోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఎవరికైన చెబితే చంపేస్తానని బెదిరించాడు. అయితే, ఆ వృద్ధుడి కొడుకు చేసిన ఓ ఘనకార్యం వలన ఈ ముసలోడి అరాచకం బయట పడింది. తన తండ్రి  చేతబడి చేస్తున్నాడని నిందితుడి కొడుకు అనుమానం వచ్చింది. దీంతో తన తండ్రి రూమ్ లో సీక్రెట్ గా ఫోన్ ను అమర్చాడు. దీంతో ఈ అత్యాచార ఘటన అందులో రికార్డైంది. కొన్ని రోజుల తరువాత తండ్రి.. చాతబడి ఎలా చేస్తున్నాడా అని.. తాను పెట్టిన సీక్రెట్ కెమెరాను బయట  తీశాడు. అందులో బాలికపై జరిగిన అత్యాచార ఘటన కనిపించింది. ఆ వీడియోను ఇటీవల బాలిక తండ్రికి పంపించడంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

ఇంతకాలం వృద్ధుడి బెదిరింపులకు భయపడిన ఆ బాలిక.. వీడియో బయటకు రాగానే జరిగిందంతా పోలీసులకు తెలిపింది. అతని కుమారుడిని విచారించిన తర్వాత వృద్ధుడిని పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం ఆ వృద్ధుడిని జ్యుడీషియల్ కస్టడీకి పంపినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు బాలిక ఉండే ప్రాంతంలోనే నివసిస్తాడని, వారి కుటుంబ సభ్యులతో కలిసి మతపరమైన యాత్రలకు వెళ్లేవాడని పోలీసులు తెపారు.  మరోవైపు నిందితుడికి తన కొడుకుతో విబేధాలున్నాయని పోలీసులు చెప్పారు. మరి.. తన తండ్రి చేసిన తప్పును బట్ట బయలు చేసిన చివరకు జైలుకి పంపాడు ఆ తనయుడు. మరి.. పిల్లలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్న మానవ మృగాలకు ఎలాంటి శిక్ష విధించాలి? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి