iDreamPost

భర్తని కాదని మృగాన్ని నమ్మి.. కన్నీళ్లు పెట్టించే ఇల్లాలి కథ!

Bangalore Crime News: డబ్బు, నగల కోసం ఓ మహిళను నమ్మించి మోసం చేయడమే కాదు.. దారుణంగా హత్య చేశాడు. చిన్న తప్పుతో పోలీసులకు దొరికిపోయాడు.. ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే..

Bangalore Crime News: డబ్బు, నగల కోసం ఓ మహిళను నమ్మించి మోసం చేయడమే కాదు.. దారుణంగా హత్య చేశాడు. చిన్న తప్పుతో పోలీసులకు దొరికిపోయాడు.. ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే..

భర్తని కాదని మృగాన్ని నమ్మి.. కన్నీళ్లు పెట్టించే ఇల్లాలి కథ!

ఈ మద్య కొంతమంది ఈజీ మనీ కోసం ఎన్నో అక్రమాలు, అన్యాయాలకు తెగబడుతున్నారు. ఎదుటి వారిని ఈజీగా మోసం చేస్తూ అందినంత దోచుకుంటున్నారు. ఒంటరిగా మహిళలు కనిపిస్తే చాలు వారిపై లైంగికంగా దాడులు చేయడమే కాదు.. డబ్బు, నగలు లాక్కెళ్లడమే కాదు.. హత్యలకు పాల్పపడుతున్నారు. ఓ మహిళను దారుణంగా హత్య చేసిన ఉదంతం వెలుగులోకి వచ్చింది.. హత్య చేసి ఎలాంటి ఆధారాలు లేకుండా హంతకుడు జాగ్రత్త పడ్డాడు.  మహిళ హత్య కేసును పోలీసులు ఛాలెంజ్ గా తీసుకొని మిస్టరీని ఛేదించారు. ఈ ఘటన ఎక్కడ జరిగింది.. ఈ కేసులో నింధితుడిని పోలీసులు ఎలా కనిపెట్టారు..? అన్న విషయం గురించి తెలుసుకుందాం. వివరాల్లోకి వెళితే..

బెంగుళూరు శివార్లలోని ఎలక్ట్రానిక్ సిటీ ప్రాంతంలో ఓ మహిళ హత్య కేసు మిస్టరీగా మారింది. హంతకుడు మహిళను హత్య చేసి ఎలాంటి ఆనవాళ్లు లేకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. ఆ మహిళ పుర్ర, ఎముకలు పోలీసులకు లభ్యం కావడంతో కేసును సీరియస్ గా తీసుకొని ఇన్వెస్టిగేషన్ చేశారు. దొడ్డకమ్మన హళ్లికి చెందిన సుకన్య (36) హత్యకు గురైంది. హత్య చేసింది అదే గ్రామానికి చెందిన జస్వంత్(20). ఈ నెల ఫిబ్రవరి 12 నుంచి సుకన్య కనిపించకుండా పోయింది. దీంతో కుటుంబ సభ్యులు ఆ రోజు మొత్తం వెతికారు.. బంధువులను ఆరా తీశారు. ఎక్కడా సుకన్య ఆచూకి లభించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే ఎలక్ట్రానిక్ సిటీ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.

వారం రోజుల తర్వాత బింగిపురా గ్రామంలో గుర్తు తెలియని మహిళ పుర్రె, ఎముకలు కనిపించాయని పోలీసులకు సమాచారం అందడంతో సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. సుకన్య మిస్సింగ్ కేసు దృష్టిలో పెట్టుకొని ఆమె ఫోన్ కాల్ వివరాలు సేకరించారు. ఈ క్రమంలోనే జస్వంత్ పై అనుమానాలు వచ్చాయి. వెంటనే స్టేషన్ కి తీసుకువచ్చి తమదైన స్టైల్లో విచారణ చేశాడు. దీంతో తాను సుకన్యను హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. హత్య చేసిన విధానం పోలీసులకు వివరించారు. ఆమెను కారులో నిర్మానుష్య ప్రదేశానికి తీసుకువెళ్లి హత్య చేసి పెట్రోల్ పోసి నిప్పంటించానని… చనిపోయినట్లు నిర్ధారించుకొని అక్కడ నుంచి వెళ్లిపోయినట్లు తెలిపాడు. ఇదిలా ఉంటే.. సుకన్యకు జస్వంత్ తో అక్రమ సంబంధం ఉన్నట్లు అనుమానిస్తున్నారు. కొంతకాలంగా సుకన్యను డబ్బు, నగలు డిమాండ్ చేస్తూ వచ్చాడు జస్వంత్. ఫిబ్రవరి 14 వాలెంటైన్ డే సందర్భంగా గోవాలో ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయడం కోసం డబ్బులు అవసరం అయ్యింది. అందుకోసం సుకన్యకు మాయమాటలు చెప్పి నిర్జీవ ప్రదేశానికి తీసుకెళ్లి హత్య చేసి నగలు దోచుకెళ్లినట్లు జస్వంత్ ఒప్పుకున్నట్లు తెలుస్తుది.  ఈ కేసును పోలీసులు మరింత లోతుగా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నట్లు తెలిపారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి