iDreamPost

TTD కళాశాలల్లో లెక్చరర్ పోస్టులు.. నెలకు రూ. లక్షన్నర వరకు జీతం!

నిరుద్యోగులకు తిరుమల తిరుపతి దేవస్థానం తీపి కబురును అందించింది. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న లెక్చరర్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఆ వివరాలు మీకోసం.

నిరుద్యోగులకు తిరుమల తిరుపతి దేవస్థానం తీపి కబురును అందించింది. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న లెక్చరర్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఆ వివరాలు మీకోసం.

TTD కళాశాలల్లో లెక్చరర్ పోస్టులు.. నెలకు రూ. లక్షన్నర వరకు జీతం!

ఆంధ్రప్రదేశ్ లోని నిరుద్యోగులకు టీటీడీ భారీ శుభవార్తను అందించింది. తిరుపతిలోని తిరుమల తిరుపతి దేవస్థానం శాశ్వత ప్రాతిపదికన టీటీడీ డిగ్రీ కాలేజీలు/ ఓరియంటల్ కాలేజీల్లో డిగ్రీ లెక్చరర్లు.. అలాగే టీటీడీ జూనియర్ కళాశాలల్లో జూనియర్ లెక్చరర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 78 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. కాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని హిందూ మతానికి చెందిన అభ్యర్థులు మాత్రమే ఈ పోస్టులకు అప్లయ్‌ చేసుకునేందుకు అవకాశం కల్పించారు. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌ లైన్‌ విధానంలో అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకోదలిచిన అభ్యర్థులు పూర్తి సమాచారం కోసం టీటీడీ వెబ్ సైట్ ను https://www.tirumala.org/ పరిశీలించాల్సి ఉంటుంది.

ముఖ్యమైన సమాచారం:

  • మొత్తం లెక్చరర్ పోస్టులు:
  • 78

డిగ్రీ లెక్చరర్ ఖాళీలు:

  • 49

సబ్జెక్టుల వారీ ఖాళీలు:

  • బోటనీ- 3, కెమిస్ట్రీ- 2, కామర్స్- 9, డెయిరీ సైన్స్- 1, ఎలక్ట్రానిక్స్- 1, ఇంగ్లిష్- 8, హిందీ- 2, హిస్టరీ- 1, హోమ్ సైన్స్- 4, ఫిజికల్ ఎడ్యుకేషన్- 2, ఫిజిక్స్- 2, పాపులేషన్ స్టడీస్- 1, సంస్కృతం- 1, సంస్కృత వ్యాకరణం- 1, స్టాటిస్టిక్స్- 4, తెలుగు- 3, జువాలజీ- 4 పోస్టులున్నాయి.

అర్హత:

  • అభ్యర్థులు కనీసం 55% మార్కులతో సంబంధిత సబ్జెక్టులో మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు నెట్‌/ స్లెట్‌ అర్హత సాధించి ఉండాలి.

జూనియర్ లెక్చరర్ ఖాళీలు:

  • 29

సబ్జెక్టుల వారీ ఖాళీలు:

  • బోటనీ- 4, కెమిస్ట్రీ- 4, సివిక్స్‌- 4, కామర్స్‌- 2, ఇంగ్లిష్- 1, హిందీ- 1, హిస్టరీ- 4, మ్యాథమెటిక్స్‌- 2, ఫిజిక్స్- 2, తెలుగు- 3, జువాలజీ- 2 పోస్టులున్నాయి.

అర్హత:

  • అభ్యర్థులు కనీసం 55% మార్కులతో మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.

వయోపరిమితి:

  • అభ్యర్థుల వయసు 01-07-2023 నాటికి 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి. ఆయా కేటగిరీల వారికి వయసు సడలింపు నిబంధనలు వర్తిస్తాయి.

జీతం:

  • డిగ్రీ లెక్చరర్‌ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు రూ.61,960- రూ.1,51,370 అందిస్తారు. జూనియర్ లెక్చరర్‌ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు రూ.57,100- రూ.1,47,760 చెల్లిస్తారు.

ఎంపిక ప్రక్రియ:

  • అభ్యర్థులను రాత పరీక్ష (కంప్యూటర్ ఆధారిత రిక్రూట్‌మెంట్ టెస్ట్), ధ్రువపత్రాల పరిశీలన తదితరాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు ఫీజు:

  • ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్ మెన్ అభ్యర్థులకు రూ.250. ఇతరులకు రూ.370 చెల్లించాల్సి ఉంటుంది.

దరఖాస్తు విధానం :

  • ఆన్‌ లైన్‌

దరఖాస్తుల ప్రారంభం:

  • 2024, ఫిబ్రవరి మొదటి వారంలో దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమవుతుంది.

దరఖాస్తులకు చివరితేదీ:

  • 29-02-2024

టీటీడీ వెబ్‌ సైట్‌:

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి