iDreamPost

తిరుమలకు వెళ్లే భక్తులకు గమనిక.. నెల మొత్తం మూసివేత!

తిరుమలకు వెళ్లే భక్తులకు గమనిక.. నెల మొత్తం మూసివేత!

భారత దేశంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో తిరుమల తిరుపతి దేవస్థానం ఒకటి.  కేవలం మన దేశంలోనే కాక.. ప్రపంచ వ్యాప్తంగా తిరుమల శ్రీవారికి భక్తులు ఉన్నారు. అందుకే శ్రీవారిని దర్శించుకునేందుకు నిత్యం వేలాది మంది భక్తులు వస్తుంటారు.  అలానే భక్తుల సౌకర్యం కోసం టీటీడీ అనేక సదుపాయాలు కల్పిస్తుంది. శ్రీవారి దర్శనం, ఇతర వివరాలను ఎప్పటికప్పుడు భక్తులకు తెలియజేస్తుంది.  తిరుమలకు సంబంధించిన సమాచారం కోసం నిత్యం ఎంతోమంది భక్తులు  ఎదురు చూస్తుంటారు. ఈక్రమంలో వచ్చే నెల తిరుమలకు వెళ్లే భక్తులు ఒక ముఖ్య విషయం  తెలుసుకోవాల్సి ఉంది. వచ్చే నెల మొత్తం పుష్కరిణి  మూసివేయబడుతుంది.

తిరుమ‌లలో శ్రీ‌వారి ఆల‌యం ప్రాంతంలో ఉన్న పుష్క‌రిణిని నెల రోజుల పాటూ మూసివేయనున్నారు. ఈ నేపథ్యంలో పుష్కరణిలో ఉన్న నీటిని పూర్తిగా తొలగించి.. పైపులైన్ల మరమ్మతులు, ఇతర పనులు చేపట్టనున్నారు. అందుకు గాను ఆగస్టు 1 నుంచి 31వ తేదీ వరకు పుష్క‌రిణిని మూసి వేయనున్నారు. ఈ కారణంగా నెల రోజుల పాటు పుష్క‌రిణి హార‌తి ఉండ‌దని తిరుమల తిరుపతి దేవస్థాన బోర్డు తెలిపింది. సాధారణంగా శ్రీవారి పుష్కరిణిలో నీరు ఎప్పుడు నిల్వ ఉండదు.  పుష్కరిణిలో నీటిని శుద్ధి చేసి తిరిగి వినియోగించేందుకు అత్యుత్తమ టెక్నాలజీతో కూడిన రీసైక్లింగ్ వ్యవస్థ అందుబాటులో ఉంది.

నిరంతరం నీటిని శుద్ధి చేసి తిరిగి వినియోగిస్తుంటారు.  ఇక మరికొన్ని  రోజుల్లో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు  జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఒక నెల రోజుల పాటు పుష్కరిణిలో నీటిని పూర్తిగా తొలగించి.. చిన్న చిన్న మరమ్మతులను పూర్తి చేస్తారు. అనంతరం శ్రీవారి పుష్కరిణి తిరిగి తెరవనున్నారు. ఇక పుష్కరిణి మూసివేసిన నెల కాలంలో మొద‌టి ప‌ది రోజుల పాటు పుష్క‌రిణి మ‌ర‌మ్మ‌తుల కోసం నీటిని తొల‌గిస్తారు. ఆ త‌రువాత ప‌ది రోజులు పాటు మ‌ర‌మ్మ‌తులు ఏవైనా ఉంటే పూర్తి చేస్తారు.

ఇక చివ‌రి ప‌ది రోజులు పుష్క‌రిణిలో నీటిని నింపి పూర్తిగా సిద్ధం ఉంచుతారు. అదే విధంగా పుష్క‌రిణిలోని నీటి పిహెచ్ విలువ 7 ఉండేలా చూస్తారు. పుష్కరిణి మరమ్మతులు పనులను టీటీడీ వాట‌ర్ వ‌ర్క్స్ విభాగం ఆధ్వర్యంలో జరుగుతాయి.  ఇలా ఆగష్టుల నెలలో పుష్కరణి మూసివేయనున్నారు. భక్తులు ఈ విషయాన్ని గమనించి అవసరమైన వారు బుక్ చేసుకోవాలని టీటీడీ సూచించింది. మరి.. తిరుమలకు సంబంధించిన ఈ వార్తపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: భర్తకు గుడి కట్టి పూజలు చేస్తున్న భార్య.. ఎక్కడో కాదు..!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి