iDreamPost

ఆసియా కప్ టీమ్.. జట్టులో వీళ్లను ఎంపిక చేయడం దండగేనా?

  • Author Soma Sekhar Published - 10:10 AM, Tue - 22 August 23
  • Author Soma Sekhar Published - 10:10 AM, Tue - 22 August 23
ఆసియా కప్ టీమ్.. జట్టులో వీళ్లను ఎంపిక చేయడం దండగేనా?

వరల్డ్ కప్ 2023 ముంగిట జరగబోయే ఆసియా కప్ కోసం ఎంతో మంది ఆసక్తిగా ఎదురుచూశారు. దానికి కారణం ఈ టోర్నీకి ఎవరిని ఎంపిక చేస్తారా? అని. క్రికెట్ విశ్వసమరాన్ని దృష్టిలో ఉంచుకుని ఇప్పటికే ప్రయోగాల బాట పట్టింది టీమిండియా. దీంతో ఆసియా కప్ కోసం ఎవరిని ఎంపిక చేస్తారా? అన్న టెన్షన్ ఆటగాళ్లతో పాటుగా సగటు క్రికెట్ ఫ్యాన్స్ లో సైతం నెలకొన్నది. వారి అంచనాలను ఆశ్చర్య పరుస్తూ.. 15 మందితో ఆసియా కప్ కు జట్టును ప్రకటించింది బీసీసీఐ. ఇక ఈ సిరీస్ లో కొందరు లక్కీగా ఛాన్స్ కొట్టేశారని అంటున్నారు ఫ్యాన్స్. అదీకాక వీళ్లను ఆసియా కప్ కు ఎంపిక చేయడం దండగే అని కామెట్స్ చేస్తున్నారు. మరి ఆ ఆటగాళ్లు ఎవరు? వారిని ఇలా ఎందుకు విమర్శిస్తున్నారో ఇప్పుడు చూద్దాం.

ఆసియా కప్ 2023లో పాల్గొనబోయే టీమిండియా జట్టును ప్రకటించింది బీసీసీఐ. అందరి టెన్షన్ ను తొలగిస్తూ.. ఆశ్చర్యకరమైన జట్టునే ప్రకటించిందని చెప్పాలి. సంజూ శాంసన్, చాహల్, అశ్విన్ లను ఈ టోర్నీకి పక్కకు పెట్టింది. ఇక గాయం నుంచి కోలుకున్న స్టార్ బ్యాటర్లు కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యార్ తిరిగి జట్టులోకి వచ్చారు. అయితే ఆసియా కప్ కు టీమిండియా స్వ్కాడ్ ను చూసిన తర్వాత కొంతమంది నెటిజన్లు పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఈ టోర్నీలో లక్కీగా ఛాన్స్ కొట్టేసిన కొందరు ఆటగాళ్లు వేస్ట్ అంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్లు పెడుతున్నారు క్రికెట్ ఫ్యాన్స్. తిలక్ వర్మ, మహ్మద్ షమీ, సూర్యకుమార్ యాదవ్ లను జట్టులోకి తీసుకోవడం దండగా అంటున్నారు. మరి దానికి గల కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

తిలక్ వర్మ

ఆసియా కప్ లో లక్కీ ఛాన్స్ కొట్టేసిన ఆటగాడు ఎవరైనా ఉంటే అది తెలుగు కుర్రాడు తిలక్ వర్మ అనే చెప్పాలి. విండీస్ తో టీ20 సిరీస్ లో అద్భుతంగా రాణించాడు తిలక్ వర్మ. దాంతో సెలక్టర్ల దృష్టిని ఆకర్షించి జట్టులోకి దూసుకొచ్చాడు. ఇక లెఫ్ట్ హ్యాండర్ బ్యాటర్ కావడం, అవసరమైతే బౌలింగ్ చేయగలగడం తిలక్ కు ప్లస్ పాయింట్స్. వీటినే పరిగణంలోకి తీసుకున్నట్లున్నారు సెలక్టర్లు. కానీ.. అతడికి ఇది తొలి వన్డే సిరీస్ అని మర్చిపోయింది మేనేజ్ మెంట్. అదీకాక దేశవాళీల్లో తిలక్ ఫిట్ నెస్ అంత గొప్పగా ఏమీ లేదు. పైగా హార్డ్ లెంగ్త్ బాల్స్ ఎదుర్కొవడంలో తిలక్ తడబడటం స్పష్టంగా కనిపిస్తూనే ఉంది. వరల్డ్ కప్ ముంగిట, ఆసియా కప్ లాంటి మెగాటోర్నీకి అనుభవం లేని ఆటగాడని ఎలా ఎంపిక చేశారని కామెంట్స్ చేస్తున్నారు సగటు క్రికెట్ ఫ్యాన్స్, నెటిజన్స్.

మహ్మద్ షమీ

ఈ సీజన్ ఐపీఎల్ లో అద్భుతంగా బౌలింగ్ చేశాడు మహ్మద్ షమీ. కానీ ఈ సంవత్సరం షమీ వన్డే ఫర్ఫామెన్స్ చెప్పుకోదగ్గ రీతిలో లేదు. తాను ఆడిన 8 వన్డేల్లో కేవలం 10 వికెట్లు మాత్రమే తీసి నిరాశ పరిచాడు. పైగా ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ తర్వాత గ్రౌండ్ లోకి కూడా అడుగుపెట్టలేదు. ఈ క్రమంలో అతడిని ఆసియా కప్ కు ఎంపిక చేయడం కాస్త ఆశ్చర్యమనే చెప్పాలి. కాగా.. గత రెండు సంవత్సరాల నుంచి వన్డేల్లో షమీ సగటు ఏమంత గొప్పగా లేదు. అయితే తనదైన రోజంటూ వస్తే.. టీమిండియాను ఒంటి చేత్తో గెలిపించగల సత్తా షమీలో ఉందనడం అతిశయోక్తికాదు.

సూర్యకుమార్ యాదవ్

టీ20ల్లో నెంబర్ వన్ బ్యాటర్ గా సూర్యకుమార్ యాదవ్ ట్రాక్ రికార్డు అమోఘం. కానీ వన్డేల్లో వచ్చే సరికి అతడి ట్రాక్ రికార్డు అత్యంత దరిద్రమనే చెప్పాలి. ఇటీవలే ఆసీస్ తో జరిగిన సిరీస్ లో వరుసగా గోల్డెన్ డకౌట్ లు నమోదు చేశాడు సూర్య. కాగా.. ఈ ఏడాది ఆడిన 10 వన్డేల్లో 127 పరుగులు మాత్రమే చేశాడు. అతడి టాప్ స్కోర్ 35 మాత్రమే. ఇలాంటి గణాంకాలు ఉన్న సూర్యను ఈ ఏడాది వన్డే ఫార్మాట్ లో నిర్వహిస్తున్న ఆసియా కప్ కు ఎందుకు ఎంపిక చేశారు అన్నదే ఇక్కడ మిస్టరీ ప్రశ్న. మరి ఈ ముగ్గురిని ఆసియా కప్ కు ఎంపిక చేయడంపై మీ అభిప్రాయాను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదికూడా చదవండి: క్రికెట్‌ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్‌! ఆసియా కప్‌, వరల్డ్‌ కప్‌ మ్యాచ్‌లు ఫ్రీగా చూడొచ్చు!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి