iDreamPost

‘టైగర్ 3’ ట్రైలర్.. పఠాన్ లో లేనివి ఇందులో గమనించారా?

  • Author ajaykrishna Updated - 04:11 PM, Mon - 16 October 23
  • Author ajaykrishna Updated - 04:11 PM, Mon - 16 October 23
‘టైగర్ 3’ ట్రైలర్.. పఠాన్ లో లేనివి ఇందులో గమనించారా?

ఈ ఏడాది బాలీవుడ్ కి కింగ్ షారుఖ్ ఖాన్ ఓ ఊపు తీసుకొచ్చాడు. ఏడాది ఆరంభంలో పఠాన్.. రీసెంట్ గా జవాన్ సినిమాలతో రూ. 1000 కోట్ల క్లబ్ లో చేరి.. తదుపరి బిగ్ ఫిలిమ్స్ కి కాస్త భరోసా అందించాడు. కంటెంట్ బాగుంటే సినిమాలు ఎప్పుడైనా.. ఎన్ని భాషలలో అయినా ఆడతాయి. బాలీవుడ్ స్పై యూనివర్స్.. వార్, పఠాన్ ల తర్వాత అదే వరుసలో ఇప్పుడు ‘టైగర్ 3’ వస్తోంది. పఠాన్, జవాన్.. ఒకే ఏడాది రెండు వేల కోట్ల కలెక్షన్స్ దక్కడంతో.. ఇప్పుడు అందరి దృష్టి టైగర్ 3పై పడింది. యష్ రాజ్ స్పై సిరీస్ లో భాగంగా అత్యంత భారీ బడ్జెట్ తో టైగర్ 3 తెరకెక్కింది. ఈ సినిమాని డైరెక్టర్ మనీష్ శర్మ రూపొందించాడు.

ఇటీవల టీజర్ తో అంచనాలు పెంచిన సల్మాన్ ఖాన్.. ఈసారి టైగర్ 3 ట్రైలర్ తో అందరిని సర్ప్రైజ్ చేశాడు. పాన్ ఇండియా స్థాయిలో.. టైగర్ 3 హిందీ, తెలుగు, తమిళ భాషలలో రిలీజ్ కాబోతుంది. ఇప్పటిదాకా దీవాలి రిలీజ్ అంటూ చెప్పుకొచ్చారు.. కానీ, ఈరోజు ట్రైలర్ లో నవంబర్ 12న రిలీజ్ అని ప్రకటించారు. పైగా ట్రైలర్ లో ఇంటరెస్టింగ్ ఎలిమెంట్స్ చాలా ఉన్నాయి. బట్.. ఒక దశలో ఇవన్నీ చూసేశాం అనిపించినా.. చూడాలని అనిపించిందంటే.. అది సల్మాన్, కత్రినా కైఫ్ ల కోసమే. టైగర్ 3లో యాక్షన్ సీక్వెన్స్ లు నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయి. ఆ కెమెరా వర్క్ కూడా ఆకట్టుకుంటుంది. కానీ.. సర్ప్రైజ్ ఏంటంటే.. సల్మాన్ కి విలన్ గా ఇమ్రాన్ హష్మీ ఉన్నాడు.

ఇక ట్రైలర్ విషయానికి వస్తే.. స్పై స్టోరీస్ అన్ని దాదాపు ఒకేలా ఉంటాయని తెలిసిందే. దేశానికి ప్రమాదం ఉందని తెలిస్తే.. ఎలాంటి మిషన్ అయినా.. ఎంత రిస్క్ అయినా చేయడానికి సిద్ధంగా ఉండే స్ప్రై స్టోరీ ఇది. కాకపోతే.. ఈసారి హీరో ఫ్యామిలీకి కష్టం వస్తే.. ఎలా ఉంటుంది అనే యాంగిల్ లో చూపించే ప్రయత్నం చేశారు. పఠాన్ లో విలన్ ఫ్యామిలీ దెబ్బతిని తన పగను దేశంపై చూపించాలని చూస్తాడు. ఇందులో కూడా విలన్ ఫ్యామిలీకి ఏదో నష్టం జరగడం వల్ల.. స్పై టైగర్ పై ప్రతీకారం తీర్చుకొనే పనిలో ఉంటాడు. అంతేగాక మధ్యలో దేశద్రోహి కూడా అనిపించుకుంటాడు. దాదాపు పఠాన్ ఛాయలు చాలా ఉన్నాయి. కథ పరంగా కొత్తదనం లేదు. కానీ.. విజువల్స్ పరంగా ఆసక్తి రేపారు. కంటెంట్ కంటే ఎక్కువ టెక్నికల్ గ్రాండియర్ పై దృష్టిపెట్టిన సంగతి తెలిసిపోతుంది. పఠాన్ లో దీపికా చేసినట్లే.. ఇందులో కత్రినా ఫైట్స్ చేసింది. అన్నింటికీ మించి విలన్ ఇమ్రాన్ హష్మీ క్యారెక్టర్ ఆసక్తికరంగా ఉంది. చూడాలి మరి.. ఈ సినిమా పఠాన్ స్థాయిలో ఆడి, సల్మాన్ కి కంబ్యాక్ హిట్ ఇస్తుందేమో!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి