iDreamPost

ఈరోజు OTTలోకి 3 స్పెషల్ మూవీస్

  • Published Mar 15, 2024 | 11:53 AMUpdated Mar 15, 2024 | 11:53 AM

శుక్రవారం వచ్చిదంటే చాలు మూవీ లవర్స్ కు పెద్ద పండగనే చెప్పవచ్చు. ఇక ఈవారం కూడా ప్రేక్షకులను అలరించడానికి మంచి మంచి సినిమాలు ఓటీటీలోకి అందుబాటులో ఉన్నాయి. మరి వాటిలో మూడు ఇంట్రెస్టింగ్ సినిమాలు ఉన్నాయి.

శుక్రవారం వచ్చిదంటే చాలు మూవీ లవర్స్ కు పెద్ద పండగనే చెప్పవచ్చు. ఇక ఈవారం కూడా ప్రేక్షకులను అలరించడానికి మంచి మంచి సినిమాలు ఓటీటీలోకి అందుబాటులో ఉన్నాయి. మరి వాటిలో మూడు ఇంట్రెస్టింగ్ సినిమాలు ఉన్నాయి.

  • Published Mar 15, 2024 | 11:53 AMUpdated Mar 15, 2024 | 11:53 AM
ఈరోజు OTTలోకి 3 స్పెషల్ మూవీస్

శుక్రవారం వచ్చిదంటే చాలు మూవీ లవర్స్ కు పెద్ద పండగనే చెప్పవచ్చు. ఎందుకంటే.. ప్రతి శుక్రవారం ఓటీటీలో కొత్త కొత్త సినిమాలు, ఇంట్రస్టీంగ్ వెబ్ సిరీస్ అనేవి స్ట్రీమింగ్ అవుతాయి. ఇక ఓటీటీ ప్రియులు కూడా రకరకాల జోనర్ లతో విడుదలైన సినిమాలు ఏ ఫ్లాట్ పామ్ లో అందుబాటులోకి వచ్చాయా అని వెతికే పనిలో ఉంటారు. అయితే ఈసారి థియేటర్లలో పెద్దగా చెప్పుకోదగ్గ సినిమాలైతే ఏమి లేవు. కేవలం తంత్ర, వెయ్ దరువెయ్, షరతులు వర్తిస్తాయి వంటి మూడు చిన్న సినిమాలే ఉన్నాయి. ఇక వీటిలలో ఏది మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుని బరిలో నిలబడుతుందనేది చూడాలి, ఇక పోతే ఇదే సమయంలో ఓటీటీలోకి మాత్రం మంచి క్రేజీ మూవీస్ అనేవి అదుబాటటులోకి వచ్చేశాయి. ముఖ్యంగా వాటిలో ఓ మూడు చిత్రాలు మంచి ఇంట్రెస్టింగ్ కంటెంట్ తో ప్రేక్షకులను అలరిస్తాయని అనిపిస్తుంది. ఆ సినిమాలేవంటే..

ప్రతి వారం సినిమాలు రిలీజ్ అవుతాంటాయి. కానీ ఈ వీకెండ్ మాత్రం చాలా స్పెషల్. ఎందుకంటే.. ఈ వీకెండ్ రావడంతోనే.. రకరకాల జోన్ లతో వివిధ భాషల్లో సినిమాలు, వెబ్ సిరీస్ అనేవి ఓటీటీలోకి వెంట తీసుకొని వస్తుంది. ఇక ఓటీటీ లవర్స్ కూడా ఈ వీకెండ్ లో మంచి ఇంట్రెస్టింగ్ కంటెంట్ ఉన్న సినిమాల కోసం తెగ ఎదురు చూస్తుంటారు. ఇక వారి అంచనాలకు తగ్గట్టుగానే కొత్త కొత్త సినిమాలు ఇప్పుడు ఓటీటీలో వివిధ ఫ్లాట్ పామ్ లోకి అందుబాటులో ఉన్నాయి. వాటిలో గత నెల థియేటర్లలో రిలీజ్ అయిన ఈ మూడు సినిమాలకు ప్రేక్షకుల ఆదరణ మరింత ఎక్కువగా ఉంటుందని అందరూ అంచనాలు మొదలైయ్యాయి. అందులో మొదటిది. మలయాళం సినిమా ‘భ్రమయుగం’. ఈ సినిమాలో మెగాస్టార్ ముమ్మట్టి నటించారు, కాగా, ఈ సినిమా గత నెల ఫిబ్రవరి 15న థియేటర్లలో రిలీజ్ అయ్యి సెన్సెషన్ సృష్టించిన విషయం తెలిసిందే. పైగా డిఫరెంట్ కాన్సెప్ట్ కావడం, కాస్త ల్యాగ్ ఉండటంతో ఇది తెలుగు ప్రేక్షకులకు పెద్దగా కనెక్ట్ కాలేదు. అయితే ఇప్పుడు ఈ చిత్రం ‘సోనీ లివ్’ ఓటీటీలోకి వచ్చేసింది. పైగా ఇది తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతుంది. ఇక 1970లో జరిిన ఓ విచిత్రమైన కథతో తెరకెక్కిన సినిమానే ఈ భ్రమయుగం.

ఇక తెలుగులో ఈ మధ్యకాలంలో వెబ్ సిరీస్ లు చాలా వస్తున్నాయి. కానీ, వాటిలో కొన్ని మాత్రమే హిట్ అవుతున్నాయి. మరి, అందులో కామెడీ ఎంటర్టైన్మెంట్ తోడైతే దానికి ప్రేక్షకుల నుంచి వచ్చిన ఆదరణ గురుంచి ప్రత్యేకంగా చెప్పక్కరలేదు. మరి అలా కడుపుబ్బా నవ్వించే సిరీస్ లో ‘సేవ్ ద టైగర్స్- 2’ కూడా ఒకటి. అయితే ఈ సిరీస్ తొలి భాగాన్ని మించి ఉందని టాక్ వినిపిస్తోంది. మరి ఈ కామెడీ సిరీస్ చూడలనుకుంటే ‘డిస్నీ ప్లస్ హాట్ స్టార్’ లో చూసేయ్యవచ్చు. ఇక దీని తర్వాత సంక్రాంతికి థియేటర్లలోకి వచ్చిన తమిళ్ సినిమా ‘మిషన్ చాప్టర్-1’. ఇందులో అరుణ్ విజయ్, అమీ జాక్సన్ జంటగా నటించారు. కాగా, ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ, థియేటర్ల సమస్య కారణంగా తెలుగు వెర్షన్ వాయిదా వేసుకున్నరు. ఇక తమిళంలో ఓ మాదిరిగా టాక్ తెచ్చుకున్న ఈ సినిమా తండ్రి కూతుళ్ల మధ్య డ్రామాగా కొనసాగుతుంది. అయితే ఈ సినిమాను చూడాలునుకుంటే.. ‘అమెజాన్ ఫ్రైమ్’ లో చూడవచ్చు. అయితే ఈ వీకెండ్ లో చాలా సినిమాలు ఓటీటీలో వచ్చినప్పట్టికి అందులో కాస్తంత ఆసక్తి కలిగించిన సినిమాలు ఇవే అని చెప్పవచ్చు. మరి, ఓటీటీలో అందుబాటులో ఉన్న ఈ మూడు ఇంట్రస్టింగ్ సినిమాల్లో మీకు నచ్చిన సినిమా ఏదో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి