iDreamPost

ఈ వారం థియేటర్, ఓటీటీలో సందడి చేయనున్న సినిమాలివే..!

  • Author singhj Published - 02:17 PM, Mon - 14 August 23
  • Author singhj Published - 02:17 PM, Mon - 14 August 23
ఈ వారం థియేటర్, ఓటీటీలో సందడి చేయనున్న సినిమాలివే..!

టాలీవుడ్​లో ఈ మధ్య ఎక్కువగా చిన్న చిత్రాలే జోరు చూపించాయి. ‘సామజవరగమన’, ‘బేబీ’లు చిన్న సినిమాలుగా రిలీజై బాక్సాఫీస్ వద్ద పెద్ద మూవీస్ రేంజ్​లో రచ్చ చేశాయి. ముఖ్యంగా ‘బేబీ’ అయితే రూ.80 కోట్లకు పైగా కలెక్షన్స్​తో ట్రేడ్ పండితులను కూడా ఆశ్చర్యానికి గురిచేసింది. తెలుగు బాక్సాఫీస్ వద్ద ఒకవైపు చిన్న చిత్రాలు వసూళ్ల జాతర చేస్తుంటే మరోవైపు పెద్ద చిత్రాలు చతికిలపడుతున్నాయి. ఆమధ్య వచ్చిన పవన్​ కల్యాణ్ ‘బ్రో’ మూవీ యావరేజీగా నిలవగా.. రీసెంట్​గా రిలీజైన మెగాస్టార్ చిరంజీవి ‘భోళా శంకర్’ మిక్స్​డ్ టాక్​ను తెచ్చుకుంది. ‘భోళా’కు భారీ నష్టాలు తప్పవని ట్రేడ్ టాక్.

మెగాస్టార్ ‘భోళా శంకర్’ మూవీ మిక్స్​డ్‌ టాక్ తెచ్చుకొని బాక్సాఫీస్ వద్ద ఆశించినంతగా వసూళ్లు సాధించడం లేదు. కానీ తలైవా రజినీకాంత్ నటించిన ‘జైలర్’ మాత్రం అటు తమిళంతో పాటు ఇటు తెలుగు నాట కూడా హిట్ టాక్​తో దూసుకెళ్తోంది. మరోవైపు ప్రేక్షకుల మనసుల్ని దోచుకునేందుకు మరికొన్ని మూవీస్ ఈ వారం వచ్చేస్తున్నాయి. అందులో కొన్ని బిగ్ స్క్రీన్లలోకి, మరికొన్ని ఓటీటీలోకి రానున్నాయి. అయితే బాక్సాఫీస్ వద్ద భారీ బడ్జెట్ చిత్రాల సందడి కనిపించడం లేదు. థియేటర్/ఓటీటీలో వచ్చేస్తున్న సినిమాలు, వెబ్ సిరీస్​లు ఏంటో ఇప్పుడు చూద్దాం..

ఈ వారం థియేటర్లలో విడుదలవుతున్న చిత్రాలు..

డీడీ రిటర్న్స్: భూతాల బంగ్లా – ఆగస్టు 18
పిజ్జా – ఆగస్టు 18
మిస్టర్ ప్రెగ్నెంట్ – ఆగస్టు 18
జిలేబి – ఆగస్టు 18
ప్రేమ్ కుమార్ – ఆగస్టు 18

ఓటీటీలో రిలీజ్ అవుతున్న సినిమాలు, వెబ్ సిరీస్​లు

జీ5
ఛత్రపతి (హిందీ మూవీ) – ఆగస్టు 15

నెట్​ఫ్లిక్స్
అన్​టోల్డ్: ఆల్ ఆఫ్ షేమ్ (హాలీవుడ్) – ఆగస్టు 15
నో ఎస్కేప్ రూమ్ (హాలీవుడ్) – ఆగస్టు 15
డెప్ వర్సెస్ హార్డ్ (డాక్యుమెంటరీ సిరీస్) – ఆగస్టు 16
మాస్క్ గర్ల్ (కొరియన్ వెబ్ సిరీస్) – ఆగస్టు 18
గన్స్ అండ్ గులాబ్స్ (తెలుగు డబ్బింగ్) – ఆగస్టు 18

జియో
తాలి (హిందీ మూవీ) – ఆగస్టు 15
ఫ సే ఫాంటసీ కొత్త సీజన్ (హిందీ చిత్రం) – ఆగస్టు 17

లయన్స్​ గేట్ ప్లే
మైండ్ కేజ్ (హాలీవుడ్) – ఆగస్టు 15

బుక్​మై షో
బాబిలోన్ 5: రోడ్ హోమ్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్) – ఆగస్టు 15
డామ్​ఫైర్ (హాలీవుడ్) – ఆగస్టు 15
స్టోరీస్ నాట్ టూ బీ టోల్డ్ (హాలీవుడ్) – ఆగస్టు 15

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి