iDreamPost

సూర్యవంశం మూవీలో ఉన్న ఈ పాప.. ఇప్పుడెలా ఉందంటే..?

విక్టరీ వెంకటేష్ అనగానే.. సెంటిమెంట్, ఫ్యామిలీ డ్రామానే ఎక్కువగా కనిపిస్తాయి. ఇంటిల్లిపాదీ ఆయన సినిమాలను చూసేందుకు ఇష్టపడుతుంటారు. అటువంటి మూవీల్లో ఒకటి సూర్యవంశం. ఇప్పటికీ టీవీల్లో వస్తుంటే.. మిస్ అవ్వకుండా చూసేవాళ్లు ఉన్నారు. అందులో కనిపించిన ఈ పాప..

విక్టరీ వెంకటేష్ అనగానే.. సెంటిమెంట్, ఫ్యామిలీ డ్రామానే ఎక్కువగా కనిపిస్తాయి. ఇంటిల్లిపాదీ ఆయన సినిమాలను చూసేందుకు ఇష్టపడుతుంటారు. అటువంటి మూవీల్లో ఒకటి సూర్యవంశం. ఇప్పటికీ టీవీల్లో వస్తుంటే.. మిస్ అవ్వకుండా చూసేవాళ్లు ఉన్నారు. అందులో కనిపించిన ఈ పాప..

సూర్యవంశం మూవీలో ఉన్న ఈ పాప.. ఇప్పుడెలా ఉందంటే..?

హీరోలకు గుర్తింపునిచ్చే క్యారెక్టర్స్‌తో పాటు కొన్ని మైల్ స్టోన్ మూవీస్ కూడా ఉంటాయి. ఇప్పడు అదే ఫేజ్‌లో ఉన్నారు విక్టరీ వెంకటేష్. తన 75వ సినిమా సైంధవ్ మూవీతో రాబోతున్నారు. సంక్రాంతి రేసులో ఈ మూవీ కూడా ఉన్న సంగతి విదితమే. అందరి హీరోలకు ఫ్యాన్స్ ఉంటారు కానీ.. వెంకటేష్ అందరూ మెచ్చే హీరో. ఇక వెంకీ సినిమాలు విడుదల అవుతున్నాయంటే చాలు సకుటుంబ సపరివారంగా చూసేందుకు థియేటర్లకు వెళుతుంటారు. ముఖ్యంగా మహిళా ప్రేక్షకులు ఈయన మూవీస్‌కు బ్రహ్మరథం పట్లేవాళ్లు. టాలీవుడ్ ఇండస్ట్రీలో సక్సెస్ రేటు ఉన్న హీరోల్లో ఈయన కూడా ఒకరు. ఆయన మూవీల్లో చాలా సూపర్ డూపర్ హిట్స్ ఉన్నాయి. అయితే ఇతడిపై చాలా మంది జాలి చూపించడంతో పాటు అలాంటి భర్త ఉండాలని అని భావించే మూవీ ఏదన్నా ఉందంటే అది సూర్యవంశమే.

వెంకటేష్, మీనా అంటే సూపర్ డూపర్ హిట్ కాంబినేషన్. సౌందర్య తర్వాత వెంకీ మామ ఎక్కువ సినిమాల్లో నటించింది ఈమెతోనే. చంటి, సుందరకాండ, అబ్బాయిగారు ఆ తర్వాత వచ్చిన మూవీనే సూర్య వంశం. రీమేక్ రారాజుగా గుర్తింపు పడిన వెంకీ ఈ మూవీని కూడా కోలీవుడ్ నుండి తెచ్చుకున్నారు. అదే టైటిల్‌తో తెలుగులోను పెట్టి సినిమా తీశారు. ఈ సినిమా ఎంత పెద్ద హిట్టో అందరికీ తెలుసు. ఇప్పటికీ ఈ సినిమాలోని పాటలు వీనుల విందుగా ఉంటాయి. ‘రోజావే చిన్ని రోజావే’ ‘కిలకిల నవ్వే కోకిల కోసం వచ్చింది మధుమాసం’ ‘చుక్కలన్నీ ముగ్గులై పక్కుమన్న ముంగిలి’ ఇప్పటికీ చాలా మందికి ఫేవరేట్స్ సాంగ్స్. ఇక ఈ మూవీలో వెంకీ..తన సమీపబంధువు అయిన సంఘవిని చిన్నప్పటి నుండి ప్రేమిస్తాడు. ఆమెనే పెళ్లిచేసుకోవాలనుకుంటాడు.

కానీ సంఘవికి అతడిని రిజక్ట్ చేస్తుంది. చివరకు మీనా వివాహం చేసుకుంటుంది. భార్యను కలెక్టర్ గా మార్చి, అతడు ఎదిగేందుకు, తన కుటుంబ పరువు నిలబెట్టేందుకు ప్రయత్నిస్తాడు వెంకటేష్. ఇందులో వెంకీ (తండ్రి,కొడుకులు) డ్యూయల్ రోల్. ఈ మూవీలో సంఘవి చిన్నప్పటి పాత్రలో కనిపిస్తోంది ఓ చిన్నారి. రోజావే చిన్ని రోజావే సాంగ్ లో వీరిద్దరి చిన్నప్పటి స్టోరీని చూపిస్తారు. అందులో పాపకు ముళ్లు గుచ్చుకునే ప్రయత్నంలో చిన్నారి వెంకటేష్.. చేతులు అడ్డుపెట్టే సీన్ ఉంటుంది కదా.. అందులో కనిపిస్తోందో పాప. ఇంతకు ఆ అమ్మాయి ఎవరు, పేరేంటో తెలుసా..? ఆమె పేరు నివాసిని దివ్య. తెలిసిన సమాచారం ప్రకారం.. అది తమిళ సినిమాలో సీన్..దాన్నే తెలుగులో అతికించారనుకుంటా. ఎందుకంటే.. ఒకే ఒక్క సీన్ ఉంటుంది వెంకీ, సంఘవిల చిన్నప్పటికీ సంబంధించి.. మళ్లీ ఎందుకు తీయడమనుకుని.. ఇది సీన్ కత్తిరించి.. తెలుగులో కూడా అతికించారని అర్థమౌతుంది.

నివాసిని దివ్య తమిళ నటి. చెన్నైలో పుట్టి పెరిగింది. చదువు పూర్తయ్యాక సీరియల్స్‌లో నటిస్తోంది. చెల్లక్కలి అనే సీరియల్ ద్వారా బుల్లితెరలోకి ఎంట్రీ ఇచ్చిన నివాసిని.. ఆ తర్వాత యాజిని అనే ధారావాహికలో కనిపించింది. పలు సీరియల్స్ తో పాపులారిటీ సంపాదించుకుని ఎక్కడికో వెళ్లిపోతుందని అనుకున్న సమయంలో అనూహ్యంగా బ్రేక్ తీసుకుంది. చాలా గ్యాప్ తర్వాత జీ తెలుగు సీరియల్‌తో రీ ఎంట్రీ ఇచ్చింది. జీ తమిళ్‌లో ప్రసారమై.. మంచి ఆదరణ పొందిన సూపర్ హిట్ సీరియల్ నీతానే ఎంతన్ పొన్ వసంతంలో మీరా పాత్రలో నటిస్తోంది. నటిగానే కాకుండా నిర్మాతగా మారి.. ఈ సీరియల్ తెరకెక్కించింది. ప్రస్తుతం ప్రొడక్షన్ పనిలో బిజీగా ఉంటూనే.. సోషల్ మీడియాలో యాక్టివ్ గా కనిపిస్తోంది. మరీ ఇప్పుడు ఈ నటి ఎలా ఉందో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Divya Bharathi Vetrivel (@nivashinidivya)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి