iDreamPost
android-app
ios-app

తల్లి ప్రేమంటే ఇదే.. ఒడిలో చంటి బిడ్డతో ఆఫీస్‌కు మేయర్‌!

తల్లి ప్రేమంటే ఇదే.. ఒడిలో చంటి బిడ్డతో ఆఫీస్‌కు మేయర్‌!

ఈ ప్రపంచంలో తల్లిని మించిన యోధురాలు ఎవ్వరూ లేరు. బిడ్డ కోసం తల్లి తన ప్రాణాలనుసైతం ఆనందంగా ఇచ్చేస్తుంది. బిడ్డకు కష్టం వస్తే తాను విలవిల్లాడిపోతుంది. ఓ పూట తిన్నా.. తినకపోయినా బిడ్డల కడుపు నింపడానికే చూస్తుంది. రాజ్యాన్ని పాలించే రాణి అయినా.. దేశానికి ప్రధాని అయినా బిడ్డల విషయంలో తల్లి ప్రాధాన్యతలు మారిపోతాయి. తల్లి ప్రేమకు అద్దం పట్టే సంఘటన ఒకటి తాజాగా చోటుచేసుకుంది. ఓ మహిళా మేయర్‌ నెలల చంటి బిడ్డతో ఆఫీసుకు వెళ్లింది. చంటి బిడ్డను ఒడిలో పెట్టుకుని ఆపీస్‌ పనులు చేసింది.

ఈ సంఘటన కేరళలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..  కేరళలోని తిరువనంతపురానికి చెందిన ఆర్య రాజేంద్రన్‌.. తిరువనంతపురం మేయర్‌గా ఎన్నికైనా సంగతి తెలిసిందే. చిన్న వయసులోనే మేయర్‌గా ఎన్నికై.. ఆర్య రాజేంద్రన్‌ రికార్డు సృష్టించింది. మేయర్‌గా ఆమె బాధ్యతలు చేపట్టే నాటికి ఆమె వయసు కేవలం 21 సంవత్సరాలు మాత్రమే. దీంతో అప్పట్లో దేశ వ్యాప్తంగా ఆమె పేరు మారుమోగింది. తాజాగా, మరో సారి ఆమె పేరు వార్తలో నిలుస్తోంది.

ఆమె నెలల చంటి బిడ్డతో ఆఫీస్‌కు వెళ్లారు. ఒడి చంటి బిడ్డను పెట్టుకుని ఆఫీస్‌ పనులు చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆ ఫొటోలు చూస్తున్న నెటిజన్లు ఆర్య రాజేంద్రన్‌ను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. బిడ్డను ఆయాలకు అప్పగించకుండా.. ఆఫీస్‌కు తీసుకెళ్లి మరీ పని చేయాటాన్ని ప్రశంసిస్తున్నారు. కాగా, ఆర్య రాజేంద్రన్‌ భర్త సీపీఐ(ఎమ్‌) ఎమ్మెల్యే సచిన్‌ దేవ్‌. ఆయన కూడా చిన్న వయసులోనే ఎమ్మెల్యేగా గెలుపొంది రికార్డు సృష్టించారు. మరి, మేయర్‌ ఆర్య రాజేంద్రన్‌ ఒడిలో చంటి బిడ్డతో ఆఫీస్‌కు వెళ్లటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişBetcioivermectin tabletPusulabetPusulabetMadridbetmeritbetCasibom GirişmeritbetlunabetTophillbetmarsbahis girişJojobet GirişcasibomCasibom GirişMarsbahis Giriş