iDreamPost

ప్రేమోన్మాది కిరాతకం.. యువతి తల్లిదండ్రులు పెళ్లికి ఒప్పుకోలేదని..!

ప్రేమోన్మాది కిరాతకం.. యువతి తల్లిదండ్రులు పెళ్లికి ఒప్పుకోలేదని..!

నేటి కాలం యువత తల్లిదండ్రులు కుదిర్చిన వివాహాల కన్నా ప్రేమ పెళ్లిలకే మొగ్గు చూపుతున్నారు. ఇక ప్రేమించిన వాడినే పెళ్లి చేసుకోవాలని అనుకున్నా.. కులాలు, మతాలు అడ్డు రావడంతో వీరి ప్రేమ పెళ్లికి పెద్దలు అంగీకరించడం లేదు. చివరికి ఆ ప్రేమికులు పెద్దలను ఎదురించి మరీ పెళ్లిలు చేసుకుంటున్నారు. ఇక పరువు పోయిందని భావించి అమ్మాయి తల్లిదండ్రులు యువకుడిని చంపడమో, లేదంటే ఆత్మహత్య చేసుకోవడం చేస్తున్నారు. కానీ, ఏపీలో మాత్రం వీటికి భిన్నంగా ఓ ఘటన చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే?

పోలీసుల కథనం ప్రకారం.. ఏపీలోని శ్రీకాళహస్తి వాగివేడుకు చెందిన గిరి అనే యువకుడు తిరుపతి జిల్లా డక్కిలికి చెందిన ఓ యువతిని ప్రేమించాడు. ఆ యువతి కూడా ఇతడిని ప్రేమించినట్లు తెలుస్తుంది. అలా వీరి వ్యవహారం కొన్ని రోజులు గడిచింది. ఇక ఆ యువకుడు ప్రియురాలినే పెళ్లి చేసుకోవాలని భావించాడు. ఆ ప్రేమికులు పెళ్లికి కూడా రెడీ అయ్యారు. కానీ, వీరి పెళ్లికి యువతి తల్లిదండ్రులు అంగీకరించలేదు. దీంతో ప్రియుడు గిరి కోపంతో ఊగిపోయాడు. క్షణికావేశంలో ఆ యువకుడు ప్రియురాలి తల్లిదండ్రులపై దాడి చేశాడు.

ఇతని దాడిలో ప్రియురాలి తండ్రి తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు వెంటనే స్పందించి యువతి తండ్రిని దగ్గరలోని ఓ ఆస్పత్రికి తరలించారు. అనంతరం బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అయితే, ప్రస్తుతం యువతి తండ్రి పరిస్థితి విషమంగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది.

ఇది కూడా చదవండి: ప్రియుడి బరితెగింపు.. ప్రియురాలు ఆస్పత్రిలో ఉండగా..!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి