iDreamPost

లాక్ డౌన్ ని పర్యవేక్షించడానికి స్వయంగా లాఠీ పట్టిన వైసిపి ఎమ్మెల్యే

లాక్ డౌన్ ని పర్యవేక్షించడానికి స్వయంగా లాఠీ పట్టిన వైసిపి ఎమ్మెల్యే

కరొనా వైరస్ ప్రమాదకరంగా వ్యాపిస్తున్న తరుణంలో ప్రధాని నరేంద్ర మోడి దేశ వ్యాప్త లాక్ డౌన్ ని ప్రకటించిన నేపధ్యంలో ఒకవైపు సామాన్యుల నుండి ప్రజా ప్రతినిధులదాకా ఇళ్లకే పరిమితమైయ్యారు. తెలంగాణ సీఎం కేసీఆర్ కుడా కరొనా వైరస్ ని సమర్ధవంతంగా ఎదుర్కోవడం ప్రతిగ్రామానికి సర్పంచ్ ప్రతి నియోజకవర్గానికి ఎమ్మెల్యే హీరో కావాలని పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.

కాగ, ఆంధ్ర ప్రదేశ్ లో మాత్రం తన వ్యవహారశైలి తో, తన ప్రసంగాలు విమర్శలతో అసెంబ్లీ లో నవ్వులు పూయించే చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి శాసనసభ్యుడు బియ్యపు మధుసూదన రెడ్డి మాత్రం తోటి ప్రజాప్రతినిధులకు భిన్నంగా స్వయంగా చేతిలో లాఠీ పట్టి రోడ్డు మీదకి వచ్చి పోలీసులతో కలసి పట్టణంలో పలు ప్రాంతాల్లో పర్యటిస్తూ లాక్ డౌన్ పరిస్తితులను సమీక్షించడం విశేషం. అదే సమయంలో పారిశుద్య కార్మికులు, ఎన్ఏంఆర్ ల పనితీరును ఎమ్మెల్యే స్వయంగా పర్యవేక్షించారు.

కష్టకాలంలో విధి నిర్వహణలో ఉన్న పోలీసులకు, కార్మికులకు ఎమ్మెల్యే బియ్యపు మధుసూధన్ రెడ్డి అండగా నిలవడం పట్ల ఎమ్మెల్యే తీరు పై నియోజకవర్గ వ్యాప్తంగా ప్రశంశల జల్లు కురిపిస్తున్నారు. ఈ సమయంలో రోడ్ల పై బైకుల మీద అటుగా వచ్చిన వారిపై ఎమ్మెల్యే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక వారం రోజుల పాటు ప్రశాంతంగా ఇంట్లో కూర్చోకుండా నిర్లక్ష్యంగా రోడ్లమీద తిరుగుతున్న కొందరు యువకులపై ఎమ్మెల్యే తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. రోడ్డు పక్కన దుకాణాలు తెరిచిన పు కొందరు వ్యాపారస్తుల దగ్గరికి ఎమ్మెల్యే స్వయంగా వెళ్ళి దుకాణాలు మూసి వెయ్యాలని చేతులు జొడించి బ్రతిమాలడం విశేషం. అదే సమయంలో మందులు హాస్పిటల్ కోసం వచ్చేవారు మాస్కులు ధరించాలని ఆయన కోరారు. ఈ సంధర్భంగా పట్టణంలో పారిశుద్య పనులు పర్యవేక్షించడానికి ఏర్పాటు చేసిన డ్రోన్ ని ఆయన కొద్దిసేపు ఆపరేట్ చేశారు.

మొదటి సారి అసెంబ్లీకి ఎన్నికైనప్పటికీ బియ్యపు మధుసూధన్ రెడ్డి స్వయంగా కరొనా వైరస్ మహమ్మారిని సమర్ధంగా అడ్డుకోవడంలో ప్రజా ప్రతినిధులందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడని చెప్పవచ్చు

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి