iDreamPost

ఆటోలో బ్యాగ్ వదిలేసిన మహిళ.. తీసి చూస్తే కళ్లు జిగేల్..

ఆటోల్లో, బస్సుల్లో, క్యాబ్స్ లో వెళ్లేటప్పుడు హడావుడిగా ఎక్కి, కంగారుగా దిగిపోతుంటారు. ఈ సమయంలో వెంట తెచ్చుకున్న లగేజీని, పర్సు, బ్యాగులను వాహనాల్లో వదిలేస్తూ ఉంటారు. అయితే ఒకసారి పోయినది తిరిగి దొరకడం అంటే కష్టమే.

ఆటోల్లో, బస్సుల్లో, క్యాబ్స్ లో వెళ్లేటప్పుడు హడావుడిగా ఎక్కి, కంగారుగా దిగిపోతుంటారు. ఈ సమయంలో వెంట తెచ్చుకున్న లగేజీని, పర్సు, బ్యాగులను వాహనాల్లో వదిలేస్తూ ఉంటారు. అయితే ఒకసారి పోయినది తిరిగి దొరకడం అంటే కష్టమే.

ఆటోలో బ్యాగ్ వదిలేసిన మహిళ.. తీసి చూస్తే కళ్లు జిగేల్..

గజిబిజీ బతుకుల మధ్య అంతా హడావుడే. పొద్దున్న లేచిన దగ్గర నుండి రాత్రి నిద్ర పోయే వరకు ప్రతి పనిలోనూ, ప్రతి విషయంలోనూ ఉరుకులు పరుగులు పెడుతూ ఉంటారు. ఇక ప్రయాణాల సమయంలో చెప్పనక్కర్లేదు. ఆటోలో, బస్సుల్లో వెళుతున్నప్పుడు హడావుడిగా ఎక్కి, దిగుతూ ఉంటారు. ఆ సమయంలో వెంట తీసుకెళ్లే లగేజీని లేదా చేతిలో ఉన్న డబ్బులు, బంగారు ఆభరణాలతో ఉన్న పర్సును, డాక్యుమెంట్లను వదిలేస్తారు. ఆ వాహనాలు వెళ్లిపోయాక.. అప్పుడు ఏదో పోయిందని వెతుక్కుంటూ ఉంటారు. ఇక పోయిన వస్తువు దొరికిందంటే తిరిగి లభించడం కల్లే. అయితే కొన్ని గంటలు బాధపడి.. ఆ వస్తువు మనది కాదనుకుంటా అని సరిపెట్టుకున్నప్పటికీ.. పోయిన వవస్తువులు దొరికితే బావుణ్ణు అని భావిస్తుంటారు.

అయితే ప్రయాణీకులు పొగొట్టుకున్న వస్తువులు తిరిగి ఇచ్చి నిజాయితీని చాటుకుంటున్నారు కొంత మంది ఆటోడ్రైవర్లు. తాజాగా ఓ మహిళా ఖరీదైన బ్యాగును ఆదమరచి వాహనంలో వదిలేసి వెళ్లిపోగా.. ఆటో డ్రైవర్ దాన్ని తిరిగి పోలీసులకు అప్పగించాడు. ఈ ఘటన విశాఖ పట్నంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బుధవాయం సాయంత్రం భారతి అనే మహిళ భీమిలి నగరం పాలెంలో ఆటో ఎక్కి ఎంవీపీ సర్కిల్లో దిగిపోయింది. సర్కిల్ దగ్గర ఆటో దిగే క్రమంలో వెంట తెచ్చిన బ్యాగు తీసుకోవడం మర్చిపోయింది. కొంత సమయం తర్వాత ఆమె బ్యాగును మర్చిపోయినట్లు గుర్తించి.. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. తాను ఆటోలో బ్యాగ్ వదిలేశానని అందులో 5 తులాల బంగారు ఆభరణాలు, 50 గ్రాముల వెండి, 18వేల నగదు ఉన్నాయని తెలిపింది.

రంగంలోకి దిగిన పోలీసులు.. బాధితురాలు భారతి చెప్పిన వివరాలతో ఆటో స్టాండ్ లో ఉన్న ఓ ఆటో డ్రైవర్ సాయంతో.. మహిళ ఎక్కిన ఆటోను పట్టుకున్నారు. ఆ ఆటో డ్రైవర్ కొండలరావు తనకు బ్యాగు దొరికిందని, ఇప్పుడే చూశానని, స్వచ్ఛందంగా అప్పగించడానికి వస్తున్నట్లు చెప్పాడు. అతడి నుండి కలెక్ట్ చేసుకుని భారతికి అప్పగించారు. ఈ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించిన కానిస్టేబుల్ హరిని మెరిట్ సర్టిఫికేట్ ఇచ్చి అభినందించారు ఉన్నతాధికారులు. అలాగే ఆటో వెతికేందుకు సహకరించిన మరో ఆటో డ్రైవర్ సత్యనారాయణ, బ్యాగును అప్పగించిన కొండలరావును ప్రత్యేకంగా అభినందించి క్యాష్ రివార్డులు అందజేశారు. బ్యాగును నిజాయితీగా అప్పగించిన కొండలరావుకు మహిళ ధన్యవాదాలు తెలిపారు. మీరు కూడా వస్తువులు పొరపాటున వాహనాల్లో పొగొట్టుకుంటే.. మీకెప్పుడైనా తిరిగి ఇచ్చిన సంఘటనలు ఉంటే కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి