iDreamPost

నిర్భయ దోషులకు ఉరి ఖాయమే..

నిర్భయ దోషులకు ఉరి ఖాయమే..

రేపు ఉదయం నిర్భయ దోషులను ఉరి తీయనుండడంతో ఉరి శిక్షను వాయిదా పడేలా చేయడానికి నిర్భయ దోషులు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అందులో భాగంగా నిర్భయ దోషుల్లో ఒకరైన ముఖేష్ సింగ్ దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీం కోర్టు కొట్టివేసింది.

నిర్భయ ఘటన జరిగినప్పుడు తాను ఢిల్లీలో లేనని ముఖేష్ సింగ్ తాజాగా వేసిన పిటిషన్ ను విచారించిన సుప్రీం కోర్టు ముఖేష్ సింగ్ పిటిషన్ ను కొట్టివేయడంతో శిక్షను వాయిదా వేయించాలని నిర్భయ దోషుల ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో రేపు ఉదయం నిర్భయ దోషులకు ఉరి అమలుకు ఆటంకాలు తొలిగిపోయినట్లే అని భావించవచ్చు.

కాగా తన భర్తకు ఉరి శిక్ష అమలు చేయడానికి వీలు లేదని ముఖేష్ సింగ్ భార్య పటియాలా కోర్టు ముందు ఆందోళన వ్యక్తం చేసారు. ఈరోజు ఉదయం పవన్ కుమార్ గుప్తా దాఖలు చేసిన క్యురేటివ్ పిటిషన్ ను సుప్రీం కోర్టు కొట్టివేసిన విషయం తెలిసిందే. నిందితులకు లభించిన న్యాయపరమైన అన్ని అవకాశాలు ముగిసిపోవడంతో పటియాలా కోర్టు మార్చ్ 20 ఉదయం 5.30 కి ఉరి తీయాలని డెత్ వారెంట్లు జారీ చేసింది. దీంతో నిర్భయకు న్యాయం జరుగుతుందని నిందితులకు ఉరి శిక్ష అమలు ఖాయమేనని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. దీంతో నిర్భయ దోషుల ఉరి అమలుకు మరికొన్నిగంటలు మాత్రమే మిగిలిఉన్నాయి. 

పిటిషన్లు పెండింగ్ లో ఉండడంతో ఉరిశిక్షపై స్టే విధించాలని పటియాలా కోర్టులో నిర్భయ నిందితులు దాఖలు చేసిన పిటిషన్ ను కొట్టివేసి ఉరిశిక్షపై స్టే ఇవ్వడానికి పటియాలా కోర్టు నిరాకరించింది. దీంతో పవన్ గుప్తా,వినయ్ శర్మ,ముఖేష్ సింగ్,అక్షయ్ ల ఉరి శిక్షను అమలు చేయడానికి ఉన్న అడ్డంకులు తొలిగిపోయాయి. నిర్భయ దోషులకు రేపు ఉదయం 5.30 కి ఉరి శిక్ష విధించడానికి ఏర్పాట్లను ఇప్పటికే అధికారులు పూర్తి చేశారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి