iDreamPost

పరిస్థితి పూర్తిగా అదుపులో ఉంది.. ఎన్టీఆర్ఎఫ్, ఎన్డిఎంఎ సంయుక్త ప్రకటన

పరిస్థితి పూర్తిగా అదుపులో ఉంది.. ఎన్టీఆర్ఎఫ్, ఎన్డిఎంఎ సంయుక్త ప్రకటన

విశాఖలో గ్యాస్ లీకేజీ నీ పూర్తిస్థాయిలో నియంత్రించామని, ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉన్నట్లు ఎన్డీఆర్ఎఫ్, ఎండిఎంఏ సంయుక్తంగా వెల్లడించాయి. ఈ మేరకు ఆయా సంస్థల ఉన్నతాధికారులు ఢిల్లిలో మీడియా తో మాట్లాడారు. ఇప్పటికే ప్రత్యేక బృందాలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నట్లు తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే ఉదయం 5 :45 నిమిషాలకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్న ట్లు తెలిపారు.

ఈ ఘటనలో 10 మంది మరణించారని, వెయ్యి మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని పేర్కొన్నారు. తమ బృందాలు గ్యాస్ వ్యాప్తి ప్రభావిత గ్రామాల్లో ఇంటికి వెళ్లిన 500 మంది బాధితులను ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. ప్రత్యేక ఆక్సిజన్ పరికరాలను నేవీ అందించిందని తెలిపారు. పూణే నుంచి కెమికల్ డిజాస్టర్ ప్రత్యేక బృందాలను పిలిపించినట్లు వెల్లడించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందిస్తున్నట్లు తెలిపారు. అత్యధిక మందికి ఆక్సిజన్ థెరపీ ఇస్తున్నట్లు వెల్లడించాయి. పరిస్థితి చక్కబడే బృందాలు వరకు అక్కడే ఉంటాయని పేర్కొన్నాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి