iDreamPost

సంభావనతో వచ్చిన చిల్లరతో బండి కొన్న పూజారి! అంత మొత్తమా?

కష్టపడి సంపాదించిన సొమ్ములో రూపాయి రూపాయి పోగేసి.. చివరకు ఓ పెద్ద మొత్తంలో అమౌంట్ కాగానే.. తన కలను నెరవేర్చుకున్నాడు పూజారి. అందులో విశేషమేముంది అనుకుంటున్నారా..అయితే ఈ వార్త చదవండి.

కష్టపడి సంపాదించిన సొమ్ములో రూపాయి రూపాయి పోగేసి.. చివరకు ఓ పెద్ద మొత్తంలో అమౌంట్ కాగానే.. తన కలను నెరవేర్చుకున్నాడు పూజారి. అందులో విశేషమేముంది అనుకుంటున్నారా..అయితే ఈ వార్త చదవండి.

సంభావనతో వచ్చిన చిల్లరతో బండి కొన్న పూజారి! అంత మొత్తమా?

ఒక్కొక్కరికి ఓక్కో కల. కొంత మంది సొంత ఇల్లు కట్టుకోవాలనుకుంటారు. మరికొంత ఎక్కువ సేవింగ్స్ ఉండాలని, ఆపద సమయంలో కుటుంబానికి ఎటువంటి కష్టం కలగకూడదని భావిస్తుంటారు. మహిళలకు బంగారం ఒంటి నిండా ధరించాలన్న పిచ్చి ఉంటుంది. అబ్బాయిలకు కాస్ట్లీ కార్స్, బైక్స్, ఖరీదైన వాచెస్, మొబైల్స్ వంటివి కొనుక్కోవాలని ఆశిస్తుంటారు. కానీ పరిస్థితుల దృష్ట్యా ఆ కలలు కల్లలుగానే మిగిలిపోతుంటాయి. ముఖ్యంగా మధ్య తరగతి కుటుంబీకులకు. పిల్లలు పెంచి, పెద్ద చేయడంతో.. తమ ఇష్ట ఇష్టాలను మర్చిపోతుంటారు పెద్దలు. అవి తీరుతాయో లేదో కూడా చెప్పడం కష్టమే. కానీ ఈ గుడి పంతులు మాత్రం ఆ కలను నెరవేర్చుకున్నాడు.

తన కల అయిన బైక్ కొనుకున్నాడు కానీ షోరూం యాజమాన్యానికి చుక్కలు చూపించాడు. ఇంతకు ఏమైందంటే..? చిత్తూరు జిల్లా బైరెడ్డి పల్లి మండలం కుప్పనపల్లి గ్రామానికి చెందిన మురళీధర్ ఆచార్యులు.. స్థానిక కాల భైరవ స్వామి ఆలయంలో పూజారిగా వ్యవహరిస్తున్నారు. ఆ గుడిలో వచ్చే సంభావన, కాస్తంత జీతంతో బతుకుతున్నాడు. అయితే మురళీధర్, ఆయన భార్య ఉషకు స్కూటీ కొనుక్కోవాలని ఆశ. ఆ కలను నెరవేర్చుకునేందుకు తన సంభావనలో వచ్చే చిల్లర డబ్బులను దాచుకున్నాడు మురళీధర్. అలా దాచగా దాచగా.. లక్ష రూపాయలకు పైగా పోగేశాడు. ఆ డబ్బులతో పలమనేరులోని ఓ బైక్ షోరూమ్ వద్దకు వెళ్లాడు. అంతలో సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ వచ్చి.. ఏం కావాలని అడగ్గా.. బైక్ అని చెప్పి తమకు నచ్చిన బండిని ఎంచుకున్నారు.

అబ్బా మంచి బేరం వచ్చిందని, ఎక్కువ సేపు చూడకుండా బండి కొంటున్నారన్న ఆనందంలో ఉన్నారు యాజమాన్యం. టీవీఎస్ జూపిటర్ స్కూటీని కొనుగోలు చేసేందుకు రెడీ అయ్యారు. అంతలో యాజమన్యానికి దిమ్మదిరిగే షాక్ ఇచ్చారు మురళీధర్. ఆ బండి ఖరీదు రూ. లక్షా 17 వేలు రూపాయలు కాగా, ఆ డబ్బులు కట్టేందుకు సిద్ధమయ్యాడు పూజారి. సంచులతో తెచ్చిన నాణేలను షోరూమ్‌లో కుప్పగా పోసి.. లెక్కించడం మొదలు పెట్టాడు. దీంతో ఒక్కసారిగా అవాక్కయ్యారు నిర్వాహకులు, సేల్స్ ఎగ్జిక్యూటివ్స్. అతడు కౌంటింగ్ చేస్తుంటే.. తలా ఓ చెయ్ వేసి.. ఆ చిల్లర మొత్తాన్ని లెక్కించారు.

ఆ చిల్లర లెక్కించడానికి మూడు గంటల సమయం పట్టింది. మొత్తానికి ఆ బండికి కట్టాల్సిన డబ్బులను ఆ చిల్లరతోనే చెల్లించాడు పూజారి. అయితే ఈ సంఘటన గుర్తిండిపోవాలన్న ఉద్దేశంతో బండి అందించి.. వారితో కేక్ కట్ చేయించారు షోరూమ్ నిర్వాహకులు. అయితే తన కల తీరినందుకు సంబరంలో మునిగిపోయారు. భార్యను ఎక్కించుకుని సంతోషంతో తిరిగి ఇంటికి పయనమయ్యారు. ప్రస్తుతం ఈ వార్త వైరల్ అవుతుంది. మరీ అతడు చిల్లరతో డబ్బులు కొనుగోలు చేయడం పట్ల మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి