iDreamPost

Pune:బిడ్డని కాపాడటానికి మెట్రో ట్రాక్‌పై దూకిన తల్లి! అంతలో దేవుడిలా!

  • Published Jan 20, 2024 | 12:41 PMUpdated Jan 20, 2024 | 12:41 PM

సృష్టిలో అమ్మ ప్రేమ చాల గొప్పది. అందుకే అమ్మ తన బిడ్డల కోసం ఎలాంటి త్యాగం చేయడానికైనా సిద్ధంగా ఉంటుంది. అంతేకాకుండా వారు ఆపదలో ఉన్నప్పుడు తన ప్రాణాలను సైతం పణంగా పెట్టి వాళ్లని రక్షిస్తుంది. అయితే తాజాగా ఓ తల్లి తన బిడ్డ ప్రాణాలు కాపాడటం కోసం చేసిన సహసం అందరినీ ఆశ్చర్యనికి గురిచేసింది. అసలు ఏం జరిగిదంటే..

ఈ సృష్టిలో అమ్మ ప్రేమ చాల గొప్పది. అందుకే లోకంలో మాతృత్వమనేది సమస్త ప్రాణులలో ప్రకాశిస్తుంది. అంతేకాకుండా అమ్మ తన బిడ్డల కోసం ఎలాంటి త్యాగం చేయడానికైనా సిద్ధంగా ఉంటుంది. వారు ఆపదలో ఉన్నప్పుడు తన ప్రాణాలను సైతం పణంగా పెట్టి వాళ్లని రక్షిస్తుంది. అలాంటి తల్లి ప్రేమను దేనితోను వెలకట్టలేము. అంతాటి స్వచ్ఛమైన హృ‌దయం కలిగిన అమ్మ ప్రేమ గురించి ప్రపంచంలోని ఎంతోమంది కవులు ఎంతో గొప్పగా వర్ణించారు. పిల్లలు ఆపదలో ఉన్నప్పుడ తల్లి చూపే తెగువ సామాన్యమైనది కాదు. ఎందుకంటే ఆ సమయంలో ఎంతటి బలమైన శత్రవునైనా ఎదురించి కాపాడుకోవటంలో తల్లి ప్రేమ చాలా కీలకమైనది. ఇటీవల కాలంలో ఇలాంటి సంఘటనలు చాలానే చూస్తున్నాం. అయితే తాజాగా ఓ తల్లి తన బిడ్డ ప్రాణాలు కాపాడటం కోసం ఏకాంగా మెట్రో ట్రాక్ పై దూకేసింది. ఆ వివరాళ్లోకి వెళ్తే..

ప్రతి తల్లి తన పిల్లలు ఆపదలో ఉన్నప్పుడు రక్షించడానికి అవసరమైతే మృత్యువుకైనా ఎదురెళ్తుంది. అలాంటి సంఘటనలు నిత్యం చూస్తునే ఉన్నాం. అయితే తాజాగా ఓ మూడేళ్ల పిల్లవాడు పరుగెత్తుకుంటూ మెట్రో ట్రాక్ మీద పడిపోయాడు. వెంటనే తన బిడ్డను కాపాడుకోవడానికి ఆ తల్లి కూడా మెట్రో ట్రాక్ పై దూకేసింది. ఈ ఘటన పుణే సివిల్‌ కోర్టు మెట్రో స్టేషన్‌ వద్ద జరిగింది. ఇది గమనించిన కొందరు అక్కడికి చేరుకుని వాళ్లను పైకి లాగా ప్రయత్నం చేశారు. అయితే ఒక్కోసారి సమయస్ఫూర్తిని ప్రదర్శించడం వలన పెను ముప్పులు తప్పుతుంటాయి. అందుకు నిదర్శనంగా అక్కడవున్న ఓ సెక్యూరిటీ గార్డు వ్యవహరించే తీరుపై అందరూ ఆయన్ని హీరోగా అభినందించారు.

అందుకు కారణం ఈ ఘటన జరిగిన వెంటనే సెక్యూరిటీ గార్డు అయిన వికాస్‌ బంగర్‌ పరిగెత్తుకుంటూ వెళ్లి ఎమర్జెన్సీ బటన్ నొక్కారు. దీంతో..స్టేషన్‌కు మరికొద్ది క్షణాల్లో చేరాల్సిన రైలు.. 30 మీటర్ల దూరంలో ఆగిపోయింది. ఈలోపు ట్రాక్‌ మీద నుంచి ఆ తల్లీబిడ్డలిద్దరినీ అక్కడున్న జనాలు పైకి లాగారు . వాళ్లిద్దరికీ చిన్నపాటి గాయం కూడా కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే సెక్యూరిటీ గార్డు సమయానికి స్పందించడం వల్లే ఆ తల్లీబిడ్డ ప్రాణాలు నిలిచాయని అందరూ ఆయన్ని ప్రశంసించారు. కాగా, ఇలాంటి చోట్ల పిల్లలతో వెళ్లినప్పుడు జాగ్రత్తగా ఉండాలని పలువురు సూచిస్తున్నారు. మరి, బిడ్డను కాపాడుకోవడం కోసం ఆ తల్లి చేసిన సహసం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి