iDreamPost

విద్యార్థులకు మరో గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం!

టెన్త్ పాసై చాలా మంది విద్యార్థులు కుటుంబ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులే కాకుండా వివిధ రకాల కారణాలతో ఇంటర్ లో ప్రవేశానికి అడ్మిషన్ తీసుకోకుండా మిగిలిపోయారు. అయితే అలాంటి వారికి ప్రభుత్వం శుభవార్తను చెప్పింది. అదేంటంటే?

విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది. టెన్త్ పాసై చాలా మంది విద్యార్థులు కుటుంబ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులే కాకుండా వివిధ రకాల కారణాలతో ఇంటర్ లో ప్రవేశానికి అడ్మిషన్ తీసుకోకుండా మిగిలిపోయారు. అయితే అలాంటి వారికి ప్రభుత్వం శుభవార్తను చెప్పింది. వీరికి మరో అవకాశం కల్పిస్తూ తాజాగా తెలంగాణ విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. ఇంటర్ లో ప్రవేశాలు పొందకుండా మిగిలిపోయిన విద్యార్థులు నవంబర్ 10లోపు కాలేజీలో అడ్మిషన్ తీసుకోవాలని ప్రకటించింది.

ఇక ఇదే కాకుండా ఇంటర్ ప్రథమ, ద్వితియ ఏడాది చదువుతున్న విద్యార్థులు ఒక కాలేజీ నుంచి మరో కాలేజీలో చేరేందుకు రీఅడ్మిషన్ కు కూడా అవకాశం కల్పిస్తూ విద్యాశాఖ నిర్ణయం తీసుకోవడం విశేషం. వివిధ కారణాలతో ఇంటర్ ప్రవేశాలు పొందని విద్యార్థులు తప్పనిసరిగా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విద్యాశాఖ అధికారులు సూచించారు. ఈ విషయం తెలుసుకున్న టెన్త్ పాసై అడ్మిషన్ పొందని విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇంటర్ చదివేందుకు అడ్మిషన్ కు మరోసారి అవకాశం కల్పించిన తెలంగాణ ప్రభుత్వానికి, విద్యాశాఖకు విద్యార్థులు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి