iDreamPost

Thaman S : సంగీత దర్శకుడి పని ఇది కాదుగా

Thaman S : సంగీత దర్శకుడి పని ఇది కాదుగా

ఎన్నడూ లేనిది రాధే శ్యామ్ విషయంలో సంగీత దర్శకుడు తమన్ విపరీతంగా ఎగ్జైట్ అవుతున్నాడు. నిన్న జరిగిన ప్రెస్ మీట్లో తన పరిధి కానీ అంశాల గురించి మాట్లాడ్డం, ఏదో కౌంటర్లు వేయాలనే తరహాలో కామెడీ చేయడం ఎప్పుడూ చూడనిది. ముఖ్యంగా క్రిటిక్స్ కి ఏమైనా కాలేజీ ఉందాని వెటకారం చేయడం, సినిమా బాలేదు అన్నవాళ్ళ గురించి పంచులు వేయడం కొత్తగా కాదు వింతగా అనిపించింది. దర్శకుడు రాధాకృష్ణ ఇదంతా చూస్తూ సంయమనంగా ఉన్నా తమన్ మాత్రం కంట్రోల్ చేసుకోలేకపోయాడు. పైగా విమర్శకులను సినిమా తీసి చూపించండనే ఉద్దేశంలో మాట్లాడ్డం ఇళయరాజా, కీరవాణి లాంటి దిగ్గజాలు సైతం ఎన్నడూ చేయనిది

ఇదంతా ఒక ఎత్తు అయితే ట్విట్టర్ లో ఎక్కడెక్కడ వీడియోలు ట్వీట్లు అన్నీ తీసుకొచ్చి వరసబెట్టి పోస్ట్ చేయడం మిగిలిన హీరోల అభిమానులను ఆశ్చర్యపరుస్తోంది. పదే పదే బ్లాక్ బస్టర్ అని చెప్పడం చూస్తే తమన్ కి ఏమైందని అనుకుంటున్న వాళ్ళు లేకపోలేదు. అసలు సినిమాకు విమర్శే ఉండకూడదనేది అర్ధరహితం. చూసిన ప్రతి ఒక్కరికి హక్కు ఉంటుంది. సోషల్ మీడియా కావొచ్చు లేదా ఐమ్యాక్స్  బయట మైకు పట్టుకుని కావొచ్చు. ఎవరైనా మాట్లాడొచ్చు. బాలేదు అన్నారని నిందలేయడం ఏంటో తమన్ అర్థం చేసుకోవాలి. అంతేసి డబ్బులు పెట్టిన ప్రొడ్యూసరే కాదు వందలు వేలు పెట్టి కొన్న ప్రేక్షకుల వైపు కూడా ఆలోచించాలిగా.

రాధే శ్యామ్ ని తమన్ ఇంతగా ప్రమోట్ చేయడానికి కారణం ప్రీ రిలీజ్ కు ముందు తనే చెప్పాడు. కెరీర్ కొంత బ్యాడ్ గా ఉన్న టైంలో మహానుభావుడు, భాగమతి అవకాశాలు ఇచ్చిన యువి సంస్థకు ఇప్పుడిలా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయంలో అండగా ఉండటం పెద్ద విషయం కాదని. మంచిదే. అలా అని మరీ ఇంతగా మోయడం కూడా కరెక్ట్ కాదుగా. సినిమా బాగుంటే ఎవరు చెప్పినా చెప్పకపోయినా జనాలు థియేటర్లకు వెళ్తారు. విమర్శల వల్ల ప్రభావితమయ్యేది మహా అయితే ఒకటి లేదా రెండు శాతం. ఆ మాత్రం దానికి ఏకంగా ప్రెస్ మీట్ లో అంతగా ఫీలవ్వాల్సిన అవసరం లేదు. అసలు ప్రభాస్ అయినా ఇంతగా బాధ పడ్డాడో లేదో

Also Read : Qubool Hai Report : ఖుబూల్ హై రిపోర్ట్

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి