iDreamPost

పూజా హెగ్డే – సంవత్సరం పొడవునా బ్యాడ్ లక్కే

పూజా హెగ్డే – సంవత్సరం పొడవునా బ్యాడ్ లక్కే

టాలీవుడ్ లో టాప్ హీరోయిన్స్ ఎవరయ్యా అంటే వెంటనే గుర్తొచ్చే పేర్లలో మొదటిది పూజా హెగ్డే. ఒకప్పుడు ఐరన్ లెగ్ అనిపించుకుని ఇదే రోజు అంటే డిసెంబర్ 24తో ముకుందతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన ఈ బుట్టబొమ్మ తర్వాత వరస హిట్లతో దూసుకుపోవడం చూస్తూనే ఉన్నాం. స్టార్ హీరోల మొదటి ప్రాధాన్యత తనే ఉంటోంది. గత ఏడాది మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ తో సూపర్ హిట్టు అంతకు ముందు సంవత్సరం అల వైకుంఠపురములోతో ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న పూజా హెగ్డేకు 2022 ఏ మాత్రం కలిసి రాక పోగా తన కెరీర్ లోనే అత్యంత వరస్ట్ ఇయర్ గా మిగిలిపోనుంది. చేసినవన్నీ అట్టర్ ఫ్లాప్ అయితే ఎవరు మాత్రం ఏం చేస్తారు

ప్రభాస్ తో ప్యాన్ ఇండియా రేంజ్ లో చేసిన ‘రాధే శ్యామ్’ మొదటి దెబ్బ. రిలీజ్ కు ముందు దీని మీద అంచనాలు ఏ స్థాయిలో ఉండేవో అందరికీ గుర్తే. కానీ నార్త్ నుంచి సౌత్ దాకా ఆడియన్స్ దీనికి ఏకగ్రీవంగా డిజాస్టర్ ఫలితం ఇచ్చారు. విజయ్ తో జట్టుకట్టిన ‘బీస్ట్’ తమిళంలో పర్వాలేదు అనిపిస్తే ఇతర భాషల్లో మాత్రం సూపర్ ఫ్లాప్ మూటగట్టుకుంది. అలమతి అబీబో చార్ట్ బస్టర్ కావడం ఒక్కటే కొంత ఊరట కలిగించింది. ఆ తర్వాత మెగా తండ్రి కొడుకులు చిరంజీవి రామ్ చరణ్ ‘ఆచార్య’లో హీరోయిన్ గా నటిస్తే అది ఇంకా ఘోరంగా బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ అయ్యింది. ఎంతగా అంటే దర్శకుడు కొరటాల శివ కొంతకాలం కనిపింఛనంతగా


తాజాగా బాలీవుడ్ లో చేసిన ‘సర్కస్’ కూడా ఇదే బాట పట్టింది. రణ్వీర్ సింగ్ డబుల్ యాక్షన్ తో రోహిత్ శెట్టి దర్శకత్వంలో వచ్చిన ఈ కిచిడి మరీ చవకబారు కామెడీతో పబ్లిక్ తో నో అనిపించేసుకుంది. పైగా పూజా హెగ్డేకు ఇందులో ఇచ్చిన పాత్ర వల్ల కలిగిన ప్రయోజనం శూన్యం. ఐటెం సాంగ్ చేసిన ‘ఎఫ్3’ ఒకటే కమర్షియల్ గా సేఫ్ అవ్వడం తన ఖాతాలోకి రాదు కాబట్టి మొత్తం నాలుగు సూపర్ ఫ్లాపులతో పూజా హెగ్డే 2022ని ముగించేసింది. ఇప్పుడు తన రాబోయే ఆశలన్నీ మహేష్ బాబు 28 మీదే ఉన్నాయి. త్రివిక్రమ్ మళ్ళీ బ్రేక్ ఇస్తాడేమో చూడాలి. వెంకటేష్ చెల్లిగా సల్మాన్ ఖాన్ సరసన చేసిన కిసీకా భాయ్ కిసీకా జాన్ తన బాలీవుడ్ భవిష్యత్తుని డిసైడ్ చేయనుంది

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి