iDreamPost

Tenant Movie Review & Rating: సత్యం రాజేశ్ టెనెంట్ మూవీ రివ్యూ

Tenant Movie Review & Rating In Telugu: పొలిమేర 2 సినిమా తర్వాత సత్యం రాజేశ్ చేసిన సినిమా టెనెంట్. ఈ మూవీపై ఆడియన్స్ లో చాలానే అంచనాలు ఉన్నాయి. పైగా సస్పెన్స్ థ్రిల్లర్ కావడంతో అవి రెట్టింపు అయ్యాయి. మరి టెనెంట్ మూవీ ఎలా ఉందో తెలియాలంటే.. ఈ రివ్యూ చదివేయండి.

Tenant Movie Review & Rating In Telugu: పొలిమేర 2 సినిమా తర్వాత సత్యం రాజేశ్ చేసిన సినిమా టెనెంట్. ఈ మూవీపై ఆడియన్స్ లో చాలానే అంచనాలు ఉన్నాయి. పైగా సస్పెన్స్ థ్రిల్లర్ కావడంతో అవి రెట్టింపు అయ్యాయి. మరి టెనెంట్ మూవీ ఎలా ఉందో తెలియాలంటే.. ఈ రివ్యూ చదివేయండి.

Tenant Movie Review & Rating: సత్యం రాజేశ్ టెనెంట్ మూవీ రివ్యూ

కథ:

గౌతమ్(సత్యం రాజేశ్), సంధ్య(మేఘా చౌదరి) వివాహం చేసుకుని ఎంతో సంతోషంగా జీవితాన్ని గడుపుతూ ఉంటారు. వారి మధ్య ఉన్న అనుబంధం, ప్రేమానురాగాలు ముచ్చట తెప్పిస్తాయి. ఓ ఖరీదైన ఫ్లాటులో జీవితం ఎంతో ఆనందంగా సాగిపోతూ ఉంటుంది. అయితే వారి పక్క ఫ్లాట్ లోకి రిషీ(భరత్ కాంత్) వచ్చిన తర్వాత వారి జీవితాలు మలుపులు తిరగడం స్టార్ట్ అవుతుంది. అసలు ఎంతో అన్యోన్యంగా ఉన్న జంట మధ్య అరమరికలు స్టార్ట్ అవుతాయి. అనుకోకుండా ఒకరోజు సంధ్య మంచంపై విగతజీవిగా కనిపిస్తుంది? అదే సమయంలో గౌతమ్ ఉండే అపార్ట్ మెంట్ లో ఒక కుర్రాడు బిల్డింగ్ పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడతాడు. అసలు సంధ్యది హత్యా? ఆత్మహత్యా? ఆ కుర్రాడు ఎందుకు చనిపోతాడు. సంధ్య మృతితో గౌతమ్ కి ఏమైనా సంబంధం ఉందా? అనేది మూవీ చూసి తెలుసుకోవాల్సిందే.

విశ్లేషణ:

టెనెంట్.. ఈ టైటిల్ చూసిన తర్వాత మీకు కథ మీద ఒక క్లారిటీ వస్తుంది. అపార్టుమెంట్, అద్దెకు ఉండే వ్యక్తుల జీవితాల నేపథ్యంలోనే ఈ కథ సాగుతూ ఉంటుంది. సమాజంలో జరిగే అంశాల నుంచి ఇన్ స్పైర్ అయి తీసిన ఒక మెసేజ్ ఓరియంటెడ్ చిత్రమే ఈ టెనెంట్. క్లైమ్యాక్స్ షాట్ నుంచి కథను ముందుకు తీసుకెళ్తూ వచ్చారు. కాస్త నెమ్మదిగా సాగే కథనం ఇది. ఇంటర్వెల్ బ్యాంగ్ కూడా చాలా సాదాసీదాగా అయిపోతుంది. కానీ, సెకండాఫ్ లో కథ పరుగులు పెడుతుంది. అంత ప్రేమగా ఉన్న గౌతమ్- సంధ్యల మధ్య ఏం జరిగింది? రిషితో పరిచయం ఏర్పడ్డాకే ఎందుకు వారి మధ్య గొడవలు జరిగాయి? రిషి ఫ్రెండ్స్ వచ్చాక గౌతమ్ జీవితంలో జరిగిన పెను మార్పులు ఏంటి? అసలు రిషి- సంధ్య ఏమైపోయారు? అనే ప్రశ్నలకు సమాధానం కోసం ప్రేక్షకులను ఆఖరికి వరకు ఆ ఎగ్జైట్మెంట్ ని క్యారీ చేయగలిగారు.

ఎన్నో ట్విస్టులు, ప్రశ్నలు ఆడియన్స్ ని వెంటాడుతాయి. అమెరికా వెళ్లాల్సిన గౌతమ్- సంధ్య జీవితాలు ఇలా అయిపోయాయే అని ఆడియన్స్ కన్నీళ్లు పెట్టుకునే సీన్స్ పడ్డాయి. అసలు గౌతమ్ ని ఎందుకు అరెస్టు చేశారు? గౌతమ్ జరిగింది చెప్పాడా? అసలు సంధ్యది హత్యా? ఆత్మహత్యా? అనే ఇంట్రెస్టింగ్ పాయింట్స్ సినిమాపై ఆసక్తిని పెంచుతాయి. ప్రస్తుతం సమాజంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అపరిచితులతో ఎలా ఉండాలి? అనే విషయాలు ఆలోచింపజేస్తాయి. పొలిమేర, పొలిమేర 2 సినిమాల తర్వాత అంతే ఇన్టెన్సిటీ ఉన్న కథతో సత్యం రాజేశ్ రావడం ఆడియన్స్ ని ఆకట్టుకుంటోంది. వేరియేషన్స్ ఉన్న పాత్రలు చేయడంలో సత్యం రాజేశ్ ఎంత సమర్థుడో అందరికీ తెలిసిందే. హీరోయిన్ చౌదరి కూడా ఆడియన్స్ ని ఆకట్టుకుంటుంది. పాత్రలో ఉన్న డెప్త్ ని ఆమె తన యాక్టింగ్ తో పలికిచింది.

ఈ మూవీకి పోలీస్ ఆఫీసర్ గా చేసిన ఎస్తేర్ బిగ్ అసెట్ అనే చెప్పాలి. ఒక అందమైన పోలీస్ ఆఫీసర్ గానే కాకుండా.. మంచి ఇన్ స్టిగేటర్ గా కూడా ఎస్తేర్ మెప్పిస్తుంది. లీడ్ క్యారెక్టర్స్ చేసిన చందన్ పయ్యావుల, తేజ్ దిలీప్, భరత్ కాంత్, రమ్య పొందూరి ఇలా అందరూ మెప్పిస్తారు. అలాగే టెక్నికల్ విభాగం పని తీరును కూడా మెచ్చుకోవాల్సిందే. డైరెక్టర్ ఇప్పుడు కాక ఇంకెప్పుడు మూవీ తర్వాత యుగంధర్ తీసిన చిత్రం ఇది. డైరెక్టర్ తాను చెప్పాలనుకున్న విషయాన్ని స్పష్టంగానే ఆడియన్స్ కి కన్వే చేశాడు. సాహిత్య సాగర్ మ్యూజిక్ ఆకట్టుకుంటుంది. జెమిన్ జోం అయ్యనీత్ సినిమాటోగ్రఫీ పర్వాలేదు అనిపిస్తుంది. అలాగే ముక్తవరపు ఎడిటింగ్ కూడా ఓకే అనిపిస్తుంది. మూవీ బడ్జెట్ కి తగ్గట్టు నిర్మాణ విలువుల ఆడియన్స్ ని ఆకట్టుకుంటాయి. టెనెంట్ తో సత్యం రాజేశ్- మేఘా చౌదరి కి ఒక డీసెంట్ హిట్టు దొరికినట్లే అయ్యింది.

బలాలు:

  • సత్యం రాజేశ్
  • కథ
  • ట్విస్టులు

బలహీనతలు:

  • ఫస్ట్ హాఫ్
  • నెమ్మదిగా సాగే కథనం

రేటింగ్: 2.5/5

(*గమనిక: ఈ రివ్యూ సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి