iDreamPost
android-app
ios-app

హాలీవుడ్‌ యాక్షన్‌ సినిమాను మించి.. రన్నింగ్‌ లారీ మీదకు ఎక్కి మరీ దొంగతనం

  • Published May 25, 2024 | 1:08 PM Updated Updated May 25, 2024 | 1:08 PM

తాజాగా సోషల్‌ మీడియాలో ఓ వీడియో వైరల్‌ అవుతుంది. రన్నింగ్‌ లారీ మీదకు ఎక్కి మరీ దొంగతనం చేశారు కొందరు యువకులు. ఆ వివరాలు..

తాజాగా సోషల్‌ మీడియాలో ఓ వీడియో వైరల్‌ అవుతుంది. రన్నింగ్‌ లారీ మీదకు ఎక్కి మరీ దొంగతనం చేశారు కొందరు యువకులు. ఆ వివరాలు..

  • Published May 25, 2024 | 1:08 PMUpdated May 25, 2024 | 1:08 PM
హాలీవుడ్‌ యాక్షన్‌ సినిమాను మించి.. రన్నింగ్‌ లారీ మీదకు ఎక్కి మరీ దొంగతనం

సాధారణంగా రన్నింగ్‌ వెహికల్స్‌ మీదకు జంప్‌ చేయడం, వాటి మీద సాహసోపేతమైన విన్యాసాలు చేయడం.. ఫైట్లు, పాటలు వంటివి సినిమాల్లో సాధ్యం అవుతాయి. నిజ జీవితంలో.. బుర్ర, బుద్ది ఉన్న ఎవరూ ఇలాంటి సాహసాలు చేయరు. ఎందుకుంటే ఇలాంటి విన్యాసాలు చేసే సమయంలో ఏమాత్రం తేడా జరిగినా.. ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. ఇక సినిమాల్లో కూడా ఇలాంటి యాక్షన్‌ సీన్లను.. ఎన్నో జాగ్రత్తలు తీసుకుని.. రక్షణ ఏర్పాట్ల మధ్య షూట్‌ చేస్తారు. ఎందుకంటే చిన్న అజాగ్రత్త కూడా ప్రాణాలు తీస్తుందని వారికి తెలుసు. అయితే తాజాగా సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఓ వీడియో మాత్రం.. ఔరా.. ఇలాంటి మనుషులు కూడా ఉంటారా అనిపిస్తోంది. రోడ్డు మీద రన్నింగ్‌లో ఉన్న లారీ మీదకు ఎక్కి మరి దొంగతనం చేశారు కొందరు యువకులు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.

ఇక ఈ సంఘటన ఎక్కడ చోటు చేసుకుంది.. వంటి వివరాలేవి తెలియదు. హాలీవుడ్‌ యాక్షన్‌ చిత్రం కాదు.. మనవాళ్ల టాలెంట్‌ అనే క్యాప్షన్‌తో షేర్‌ చేసిన ఈ వీడియోలో.. హైవే మీద లోడ్‌తో ఉన్న ఓ లారీ వెళ్తుంటుంది. దాని వెనకే ఓ బైక్‌ ఫాలో అవుతుంది. ఆ వెనకే ఓ కారు వెళ్తుంటుంది. ఇంతలో లారీ మీద ఇద్దరు వ్యక్తులు ప్రత్యక్షం అవుతారు. ఆ తర్వాత వారిద్దరూ కలిసి ఓ మూటను కిందకు విసురుతారు. ఆ తర్వాత.. ఇద్దరు యువకులు ఏమాత్రం భయం లేకుండా ర్నింగ్‌ లారీ మీద నుంచి కిందకు దిగి.. బైక్‌ ఎక్కి అక్కడ నుంచి చక్కా పారిపోయారు. కారులో కూర్చున్న వాళ్లు ఈ తతంగాన్ని వీడియో తీసి.. సోషల్‌ మీడియాలో షేర్‌ చేయడంతో ఇది కాస్త వైరల్‌గా మారింది.

ఇక వీడియో చూసిన జనాలు.. వీరి ధైర్యాన్ని చూసి ఆశ్చర్యపోతున్నాం. మీ ప్రాణాలకు తెగించి మరీ ఇలాంటి సాహసాలు చేయడం అవసరమా.. సడెన్‌గా బ్రేక్‌ వేస్తే మీ పరిస్థితి ఏంటి.. పది రూపాయల వస్తువు కోసం.. మీ ప్రాణాలు పణంగా పెడతారు.. ధూమ్‌ 4 యాక్షన్‌ సీన్స్‌ మించి ఉన్నాయి.. ఇలా వీడియో తీసే బదులు లారీ డ్రైవర్‌ను అలర్ట్‌ చేస్తే సరిపోయేది కదా అని కామెంట్స్‌ చేస్తున్నారు.

అయితే కొందరు మాత్రం.. అసలు వారు లారీ మీదకు ఎప్పుడు ఎక్కారు.. ఎందుకంటే.. రన్నింగ్‌లో దిగినంత ఈజీగా వాహనం మీదకు ఎక్కడం అంత సులువు కాదు. అంటే వారు ముందే లారీ లోడ్‌ చేసే సమయంలోనే ఎక్కి ఉంటారు.. ఆ తర్వాత అదును చూసి.. లగేజ్‌ని కిందకు విసిరి.. ఆ తర్వాత వారు కూడా లారీ మీద నుంచి దిగారు. చూడబోతే ఇదంతా ప్రీ ప్లాన్డ్‌ దొంగతనంలా ఉంది.. లేదా ప్రాంక్‌ వీడియో కూడా అవ్వొచ్చు అని కామెంట్స్‌ చేస్తున్నారు. ఇక ఈ సంఘటన ఎక్కడ జరిగింది తెలియదు.. కానీ వీడియోలో వినిపించే మాటలను బట్టి.. నార్త్‌ ఇండియా అని తెలుస్తుంది. ఇక లారీలో ఏం లోడ్‌ ఉందో తెలియదు.. వారు కిందపడేసిన ప్యాకేజ్‌లో ఏం ఉన్నాయో కూడా తెలియదు.

Jojobet GirişJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetjojobet girişbetcioJojobetJojobetJojobetjojobetgrandpashabetcasibomjojobet giriş