iDreamPost
android-app
ios-app

వీడియో: రన్నింగ్ ట్రైన్ ముందు యువతి రీల్స్.. తీక్క కుదర్చిన లోకో పైలట్!

  • Published Jul 01, 2024 | 12:59 PM Updated Updated Jul 01, 2024 | 12:59 PM

Woman Doing The Reels: సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి రక రకాల వీడియోలో నెట్టింట వైరల్ అవుతున్నాయి. సోషల్ మీడియాలో పాపులర్ కావడానికి.. ఎక్కువ మంది ఫాలోవర్లను పెంచుకోవడానికి రక రకాల ప్రయత్నాలు చేస్తున్నారు.

Woman Doing The Reels: సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి రక రకాల వీడియోలో నెట్టింట వైరల్ అవుతున్నాయి. సోషల్ మీడియాలో పాపులర్ కావడానికి.. ఎక్కువ మంది ఫాలోవర్లను పెంచుకోవడానికి రక రకాల ప్రయత్నాలు చేస్తున్నారు.

  • Published Jul 01, 2024 | 12:59 PMUpdated Jul 01, 2024 | 12:59 PM
వీడియో: రన్నింగ్ ట్రైన్ ముందు యువతి రీల్స్.. తీక్క కుదర్చిన లోకో పైలట్!

సోషల్ మీడియా పుణ్యమా అని కొంతమంది రాత్రికి రాత్రే సెలబ్రెటీలుగా మారిపోతున్న విషయం తెలిసిందే.  తక్కువ సమయంలో ఎక్కువ పాపులారిటీ సంపాదించుకోవాలన్న క్యూరియాసిటితో కొంతమంది చిత్ర విచిత్రమైన ప్రయత్నాలు చేస్తున్నారు. పాటలు పాడటం, డ్యాన్స్ చేయడం, ప్రాణాలకు తెగించి సాహసాలు చేయడం లాంటివి చేస్తూ నెటిజన్లను ఆకర్షిస్తున్నారు. కొన్నిసార్లు వారు చేస్తున్న సాహసాల వల్ల ప్రాణాలు సైతం పోతున్న విషయం తెలిసిందే. ఇక స్మార్ట్ ఫోన్ వచ్చినప్పటి నుంచి ప్రమాదకర స్థితిలో సెల్పీలు, వీడియోలు తీసుకుంటూ ప్రమాదాలు కొనితెచ్చుకుంటున్నారు. ఓ యువతి ట్రైన్ ముందు రీల్స్ చేస్తున్న సమయంలో లోకో పైలట్ ఆమెకు సరైన బుద్ది చెప్పాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వివరాల్లోకి వెళితే..

ఇటీవల కొంతమందికి రీల్స్ పిచ్చ బాగా ముదిరిపోయింది.. ప్రతి చిన్న విషయంపై రీల్స్ చేస్తూ ఫాలోవర్లను పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. వయసుతో సంబంధం లేకుండా చిన్నా.. పెద్దా అంతా రీల్స్ చేయడం, వీడియోలు చేసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయడం కామన్ అయ్యింది. కొంత మంది విభిన్నంగా ఉండాలనే ఉద్దేశ్యంతో ఎత్తైన ప్రదేశాలు, జలపాతాలు, వేగంగా ప్రయాణిస్తున్న వాహనాలు, హెవీ ట్రాఫిక్, సముద్రాలు ఇలా ఎన్నో రకాలుగా రీల్స్ చేస్తున్నారు. అలాంటి సమయంలో కొన్నిసార్లు ప్రాణాల మీదకు తెచ్చుకోవడమే కాదు.. ప్రాణాలు పోగొట్టుకున్నవారు కూడా ఉన్నారు. ఓ మహిళ ట్రైన్ ఎదురుగా రీల్స్ చేస్తూ ఉండగా లోకో పైలట్ అది గమనించి ఆమెకు సరైన బుద్ది చెప్పాడు.

వీడియోలో కనిపిస్తున్న ప్రకారం.. పట్టాలపై మీద నుంచి రైలు దూసుకు వస్తుంది. అదేదీ పట్టనట్టు ఓ మహిళ రైలు పట్టాల మీదకు వచ్చి ఎదురుగా ఓ వ్యక్తితో ఏదో మాట్లాడుతుంది. క్రమంగా ట్రైన్ ఆమెను సమీపిస్తుంది.. కానీ రీల్స్ షూట్ బిజీలో ఆ మహిళ ట్రైన్ విషయాన్ని పట్టించుకోవడం లేదు. వీడియో తీస్తున్న వ్యక్తి కూడా ఆ మహిళ వెనుక నుంచి వస్తున్న ట్రైన్ గురించి చెప్పకుండా తన పని తాను చేసుకుంటున్నాడు. ఇంకేముంది ట్రైన్ ఆ మహిళ సమీపంలోకి వచ్చింది.. వీడియో చూస్తున్న వారంతా ఆ మహిళ పని అయిపోయిందని భావించారు. కానీ.. రైలు ఇంజన్ భోగీలో నుంచి ఆమెను గమనించిన లోకో పైలట్ అలర్ట్ అయ్యాడు.

రైలు పట్టాల మీద నిలబడి ఉన్న మహిళను ఒక్క తన్ను తన్నగా దెబ్బకు అవతలివైపు ఒరిగిపోవడంతో పెద్ద ప్రమాదం తప్పిపోయింది. వెంటనే ఆ మహిళతో పాటు వీడియో తీస్తున్న వ్యక్తి అక్కడ నుంచి వెళ్లిపోయారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు వేలం వెర్రి అని.. ప్రాణాలు పోయినా పరవాలేదు.. రీల్స్ ముఖ్యం అనుకునే ఇలాంటి వారికి తగిన బుద్ది చెప్పాడు అని కామెంట్స్ చేస్తున్నారు. ఇటీవల ట్రైన్స్ ముందు రీల్స్ చేస్తున్న వారు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.

 

 

View this post on Instagram

 

A post shared by UNILAD Tech (@uniladtech)

gamdomCasibomJojobet Girişmarsbahis girişGrandpashabet Giriş