iDreamPost
android-app
ios-app

వీడియో: రైల్వే ఫ్లాట్ ఫాంపై రీల్స్‌ చేస్తూ యువతి పిచ్చి చేష్టలు.. సరైన బుద్ది చెప్పిన మహిళ!

  • Published Jul 10, 2024 | 3:52 PM Updated Updated Jul 10, 2024 | 3:52 PM

Video Viral: ఇటీవల సోషల్ మీడియాలో విపరీతమై పాపులారిటీ సంపాదించాలి.. ఫాలోయింగ్ పెంచుకోవాలని కొంతమంది రీల్స్, వీడియోలు తీస్తూ నానా హంగామా చేస్తున్నారు. కొంతమంది రీల్స్ చేస్తూ పక్కవాళ్లను ఇబ్బందులకు గురి చేస్తున్నారు.

Video Viral: ఇటీవల సోషల్ మీడియాలో విపరీతమై పాపులారిటీ సంపాదించాలి.. ఫాలోయింగ్ పెంచుకోవాలని కొంతమంది రీల్స్, వీడియోలు తీస్తూ నానా హంగామా చేస్తున్నారు. కొంతమంది రీల్స్ చేస్తూ పక్కవాళ్లను ఇబ్బందులకు గురి చేస్తున్నారు.

  • Published Jul 10, 2024 | 3:52 PMUpdated Jul 10, 2024 | 3:52 PM
వీడియో: రైల్వే ఫ్లాట్ ఫాంపై రీల్స్‌ చేస్తూ యువతి పిచ్చి చేష్టలు.. సరైన బుద్ది చెప్పిన మహిళ!

ఈ మధ్య చిన్నా పెద్దా అనే తేడా లేకుండా సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వడం కోసం రీల్స్, యూట్యూబ్ వీడియోలు చేస్తు నానా రచ్చ చేస్తున్నారు. కొన్నిసార్లు మంచి కంటెంట్ తో వచ్చే వీడియోలకు లైకులు, షేర్స్ బాగానే వస్తున్నాయి. డ్యాన్సులు, పాటలు పాడటం, డైలాగ్స్ చెప్పడం, సాహసవంతమైన పనులు చేయడం ఇలా ఎన్నో రకాలుగా రీల్స్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నాయి. కొంతమంది వీడియోలు బాగా వైరల్ కావడంతో రాత్రికి రాత్రే సెలబ్రెటీలు అవుతున్నారు. కొన్నిసార్లు రీల్స్ వల్ల ఇతరులు ఇబ్బందులు పడుతుంటారు. అలా ఓ యువతి రైల్వే ఫ్లాట్ ఫాంపై రీల్స్‌ చేస్తూ యువతి పిచ్చి చేష్టలు చేయడంతో మహిళకు కోపం వచ్చి తాట తీసింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టివంట వైరల్ అవుతుంది. వివరాల్లోకి వెళితే..

సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి మంచి ఎంత జరుగుతుందో చెడు అంతకు రెట్టింపు జరుగుతుంది. కొంతమంది సోషల్ మీడియాలో ఫేమస్ కావాలని రీల్స్, యూట్యూబ్ వీడియోలు చేస్తూ నానా హంగామా చేస్తున్నారు. రీల్స్ కోసం ఎక్కడ పడితే అక్కడ పిచ్చి పట్టిన వారిలా ప్రవర్తిస్తూ ఎదుటి వారిని ఇబ్బందులకు గురి చేస్తుంటారు. అలా రీల్స్ చేస్తూ జనాల చేతుల్లో తన్నులు తిన్నవారు కూడా ఉన్నారు. అలాంటి ఘటన ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఓ రైల్వే ఫ్లాట్ ఫాం ప్రయాణికులతో రద్దీగా ఉంది.. ఆ సమయానికి ఎక్కడ నుంచి వచ్చిందో యువతి పిచ్చి పట్టినట్లు డ్యాన్స్ వేస్తూ ఫ్లాట్ ఫామ్ పై కుప్పిగంతులు వేస్తూ నానా రచ్చచేసింది.

ఫ్లాట్ ఫామ్ పై పాకుతూ.. నాగిని డ్యాన్స్ చేస్తూ తిక్క తిక్కగా ప్రవర్తించింది. కొంతమంది మగవాళ్ళను ఇబ్బంది పెడుతూ అసభ్యంగా ప్రవర్తించింది. ఇదంతా చూస్తూ అక్కడ ఉన్న తోటి ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. ఆ యువతి పిచ్చి చేష్టలు భరించలేక ఓ మహిళకు ఒళ్లు మండి చితక్కొట్టింది. అయినా ఆ యువతి ఏమాత్రం పట్టించుకోకుండా మళ్లీ డ్యాన్స్ చేస్తూ అల్లరి చేయడం మొదలు పెట్టింది. దీంతో విసిగిపోయిన ప్రయాణికులు ఎవరి దారిన వారు వెళ్లారు. అయితే ఆ యువతి కావాలని చేసిందా? ఏదైనా మత్తులో చేసిందా అన్న విషయం తెలియరాలేదు? ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. ఈ వీడియో Instagramలో @seemakanojiya87 అనే యూజర్‌ ఐడీ ఇన్ స్ట్రాలో వచ్చింది. ఇలాంటి వీడియోలు తీస్తూ పాపులర్ కావాలనుకుంటున్నారు.. పక్క వాళ్లు ఎంత ఇబ్బంది పడుతున్నారో అర్థం చేసుకోవడం లేదు అని కామెంట్స్ చేస్తున్నారు.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet