Tirupathi Rao
Viral Video Of UP MLA Received Quid Pro Quo Plea: ఓటర్లు రాజకీయ నాయకులను ఏదో సహాయం కావాలి అని కోరుతూ ఉంటారు. నాయకులు కూడా చేస్తామంటూ హామీలు ఇచ్చేస్తూ ఉంటారు. అయితే వాటిలో సమాన్యంగా తమను ఆదుకోవాలి అని మాత్రమే ఉంటుంది. కానీ, ఈ ఓటరు మాత్రం ఎమ్మెల్యేని ఓ వింత కోరిక కోరాడు.
Viral Video Of UP MLA Received Quid Pro Quo Plea: ఓటర్లు రాజకీయ నాయకులను ఏదో సహాయం కావాలి అని కోరుతూ ఉంటారు. నాయకులు కూడా చేస్తామంటూ హామీలు ఇచ్చేస్తూ ఉంటారు. అయితే వాటిలో సమాన్యంగా తమను ఆదుకోవాలి అని మాత్రమే ఉంటుంది. కానీ, ఈ ఓటరు మాత్రం ఎమ్మెల్యేని ఓ వింత కోరిక కోరాడు.
Tirupathi Rao
సాధారణంగా ఎన్నికలు రాగానే రాజకీయ నాయకులు అంతా ప్రజల వద్దకు క్యూ కడతారు. వారిపై ఎక్కడిలేని ప్రేమను చూపిస్తారు. మీ ఓటు మాకే వేయాలి అంటూ బతిమాలుకుంటారు. గెలవడం కోసం ఎక్కడలేని హామీలు గుమ్మరిస్తారు. మీరు ఏది కోరుకున్నా తీర్చేస్తామంటూ గొప్పలకు పోతారు. తీరా గెలిచిన తర్వాత మాత్రం ముఖం చాటేస్తారు అంటూ విమర్శలు ఉండనే ఉన్నాయి. విజయం సాధించాక సామాన్యులతో నాయకులకు పని ఉండదు అని చెబుతూ ఉంటారు. దాదాపుగా చాలామంది తీరు ఇలాగే ఉంటుంది. ప్రజలు కూడా గెలిచిన తర్వాత నాయకులను పెద్దగా కోరికలు కోరరు. ఎందుకంటే అసలు వాళ్లను కలిసే అవకాశం రావాలి కదా. అయితే ఇక్కడ ఒక ఓటరుకి మాత్రం ఆ అవకాశం దక్కింది. తాను ఓటేసిన ఎమ్మెల్యే తన వద్దకే వచ్చాడు. ఇంకేముంది.. పరుగున వెళ్లి తన మనసులో మాట ఆయన ముందు ఉంచేశాడు. ఆ కోరిక విన్న తర్వాత ఎమ్మెల్యేకి బుర్ర గిర్రున తిరిగిపోయింది. మరి.. ఆ కోరిక ఏంటి? ఎందుకు ఎమ్మెల్యే అంత షాక్ అయ్యాడు? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం….
ఎన్నికలు ముగిసిన తర్వాత రాజకీయ నాయకులు బొత్తిగా నల్లపూస అయిపోతారు. అంటే వాళ్ల దర్శనం సామాన్యులకు దాదాపుగా అసాధ్యం అనే చెప్పాలి. ఏదైనా సమస్య చెప్పుకోవాలి అన్నా అది అంత తేలిక కాదు. ఎంతో పుణ్యం చేసుకుంటే గానీ.. ఎమ్మెల్యే గారి దర్శనం దొరకదు అంటారు. అలాంటిది ఒక ఓటరుకు మాత్రం వెతుకున్న తీగ కాలికి తగిలింది. ఎమ్మెల్యేనే ఆ ఓటరు దగ్గరకు రావాల్సి వచ్చింది. అప్పుడు ఆ ఓటరు ఒక వింత కోరిక కోరాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఛర్ఖారీ నియోజకవర్గంలో జరిగింది. ఆ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా బ్రిజ్ భూషణ్ రాజ్ పుత్ ఉన్నారు. మహోబా ప్రాతంలో ఆయన కారు పెట్రోలు కోసం ఒక బంక్ లో ఆగింది. అక్కడే అఖిలేంద్ర ఖరే అనే వ్యక్తి ఉన్నాడు. అతను పెట్రోల్ బంక్ లో పనిచేస్తున్నాడు.
సాధారణంగా ఎమ్మెల్యే కనిపించగానే అందరూ పరిగెత్తుకుంటూ వెళ్తారు. అలాగే అఖిలేంద్ర ఖరే కూడా వెళ్లాడు. ఏదో పలకరించడానికి వస్తున్నాడులే అని ఎమ్మెల్యే భావించాడు. అఖిలేంద్రను చూసి ఎమ్మెల్యే కుశల ప్రశ్నలు వేశాడు. అందుకు బాగానే రియాక్ట్ అయిన అఖిలేంద్ర ఖరే.. ఆ తర్వాత తన మనసులో ఉన్న మాటను ఎమ్మెల్యేకి చెప్పాడు. అతనేదో తన కష్టాన్ని చెబుతున్నాడు అని ఎమ్మెల్యే భావించాడు. నిజానికి అఖిలేంద్ర తన కష్టాన్నే చెప్పుకున్నాడు. కాకపోతే అది ఎమ్మెల్యే చేతుల్లో లేని విషయం అనమాట. అదేంటంటే.. తనకు మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేయాలని అఖిలేంద్ర ఖరే కోరాడు. అందుకు ఎమ్మెల్యే బ్రిజ్ భూషణ్ ఒక్కసారిగా కంగు తిన్నాడు. కాసేపటికి తేరుకున్న ఎమ్మెల్యే నేను ఎందుకు పెళ్లి చేయాలని ప్రశ్నించాడు. అందుకు ఏమాత్రం తడుముకోకుండా.. అఖిలేంద్ర నేను మీకే ఓటేశాను అంటూ సమాధానం చెప్పాడు. ఆ సమాధానంతో ఎమ్మెల్యే మరోసారి షాకయ్యాడు.
తర్వాత ఎమ్మెల్యే అఖిలేంద్రతో మాటలు కలిపాడు. నాకు ఓటేశావ్.. కాబట్టి నీకు పిల్లను చూసి పెళ్లి చేయాలి. సరే నీ వయసు ఎంతో చెప్పు అని ప్రశ్నించాడు. అందుకు ఆ వ్యక్తి త్వరలోనే 44 ఏళ్లు వస్తాయని సమాధానం చెప్పాడు. ఇక్కడ ఉద్యోగం చేస్తున్నావ్ కదా.. నీ జీతం ఎంత అని అడిగాడు. అతను నెలకు 6 వేల రూపాయలు వస్తాయని.. తనకు కాస్త సొంత స్థలం కూడా ఉందని చెప్పాడు. సరే ఎలాంటి అమ్మాయి కావాలి నీకు అని ఎమ్మెల్యే ప్రశ్నించారు. కొన్ని వర్గాల వాళ్లు మాత్రం వద్దు అని అతను సమాధానం చెప్పాడు. అలా అనుకోకూడదు అని.. అందరూ సమానమే అంటూ ఎమ్మెల్యే సమాధానం చెప్పారు. మనకు ఎవరితో రాసి పెడితే వారితోనే వివాహం జరుగుతుంది అంటూ సమాధానమిచ్చారు. ప్రస్తుతం ఎమ్మెల్యే- అఖిలేంద్ర మధ్య జరిగిన సంభాషణ నెట్టింట వైరల్ గా మారింది. వీళ్ల మాటలు విన్న నెటిజన్స్ అంతా సరదాగా రియాక్ట్ అవుతున్నారు.